కంటెంట్‌కు వెళ్లండి

David

968 వచనాలు · 40 కుటుంబ సభ్యులు

David ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. విషయం ఏమీ వానికి తెలియదు. యోనాతానుకు దావీదుకు మాత్రమే ఆ విషయం తెలుసు.

  2. వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు బండ దక్షిణ దిక్కునుండి బయటకి వచ్చి యోనాతాను ఎదుట మూడుసార్లు మోకరించి తలవంచి నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ ఏడ్చారు. ఇలా ఉండగా దావీదు మరింత గట్టిగా ఏడ్చాడు.

  3. అప్పుడు యోనాతాను, “యెహోవా నీకు నాకు మధ్య, నీ సంతానానికి నా సంతానానికి మధ్య ఎప్పటికీ సాక్షిగా ఉండును గాక. మనమిద్దరం యెహోవా నామాన్ని బట్టి ప్రమాణం చేసుకున్నాం కాబట్టి మనస్సులో నెమ్మది కలిగి వెళ్లు” అని దావీదుతో చెప్పగా దావీదు బయలుదేరి వెళ్లిపోయాడు. యోనాతాను పట్టణానికి తిరిగి వెళ్లాడు.

  4. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వచ్చాడు. అయితే అహీమెలెకు దావీదు రావడం చూసి భయపడి, “నీతో ఎవరూ లేకుండా నీవు ఒక్కడివే వచ్చావెందుకు?” అని అతన్ని అడిగాడు.

  5. అందుకు దావీదు యాజకుడైన అహీమెలెకుతో, “రాజు నాకు ఒక పని అప్పగించి, ‘నేను నిన్ను పంపిన పని గురించి ఎవరికి తెలియకూడదు’ అన్నాడు. నేను నా మనుష్యులతో ఒక చోటికి వెళ్లి అక్కడ ఉండమని చెప్పాను.

  6. ఆ యాజకుడు దావీదుతో, “సాధారణ రొట్టె నా దగ్గర లేదు; నీ మనుష్యులు స్త్రీలకు దూరంగా ఉన్నట్లయితే వారు ఇక్కడ ఉన్న ప్రతిష్ఠిత రొట్టెలు తినవచ్చు” అని చెప్పాడు.

  7. అందుకు దావీదు, “ఖచ్చితంగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు రోజులు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. వారి దేహాలు పవిత్రంగానే ఉన్నాయి. సాధారణ పనిమీద వెళ్లినప్పుడే ఈ మనుష్యులు పవిత్రంగా ఉంటే, ఈ రోజు ఇంకెంత పవిత్రంగా ఉంటారు!”

  8. దావీదు అహీమెలెకును, “రాజు అప్పగించిన పని తొందరలో నేను నా కత్తిని ఇతర ఆయుధాలను తీసుకురాలేదు, నీ దగ్గర కత్తి గాని ఈటె గాని ఉందా?” అని అడిగాడు.

  9. అందుకు యాజకుడు, “ఏలహు లోయలో నీవు చంపిన గొల్యాతు అనే ఫిలిష్తీయుని కత్తి ఇక్కడ ఉంది. అది ఏఫోదు వెనుక బట్టతో చుట్టి ఉంది. అది తప్ప ఇక్కడ మరి ఏ కత్తి లేదు, నీకు కావాలంటే అది తీసుకో” అన్నాడు. దావీదు, “దానికి సాటియైనది మరొకటి లేదు; అది నాకు ఇవ్వు” అన్నాడు.

  10. దావీదు సౌలుకు భయపడి ఆ రోజే బయలుదేరి పారిపోయి గాతు రాజైన ఆకీషు దగ్గరకు వచ్చాడు.

  11. అయితే ఆకీషు సేవకులు అతనితో, “ఈ దావీదు ఆ దేశపు రాజు కాదా? వారు నాట్యం చేస్తూ పాటలు పాడుతూ, “ ‘సౌలు వేలమందిని చంపాడు. దావీదు పదివేలమందిని చంపారని చెప్పింది ఇతని గురించే కదా’?” అన్నారు.

  12. దావీదు ఈ మాటలు గుర్తుపెట్టుకుని గాతు రాజైన ఆకీషుకు చాలా భయపడ్డాడు.

  13. దావీదు అక్కడినుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని వెళ్లాడు. అతని అన్నదమ్ములు అతని తండ్రి ఇంటివారందరు ఆ విషయం విని అతని దగ్గరకు వచ్చారు.

  14. దావీదు అక్కడినుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, “నా పట్ల దేవుని చిత్తం ఏమిటో నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులను వచ్చి మీ దగ్గర ఉండనివ్వగలరా?” అని మోయాబు రాజును అడిగాడు.

  15. అతడు వారిని మోయాబు రాజు దగ్గర విడిచి వెళ్లాడు. దావీదు కొండల్లో దాక్కొని ఉన్నంత కాలం వారు అక్కడే ఉన్నారు.

  16. అయితే గాదు ప్రవక్త వచ్చి దావీదుతో, “బలమైన కోటలలో ఉండవద్దు, యూదా దేశానికి పారిపో” అని చెప్పాడు. కాబట్టి దావీదు హెరెతు అడవిలోకి వెళ్లాడు.

  17. ఒక రోజు దావీదు అతని మనుష్యులు ఎక్కడ ఉన్నారో సౌలుకు తెలిసింది. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచుల వృక్షం క్రింద ఈటె పట్టుకుని కూర్చున్నాడు. అతని సేవకులు అతని చుట్టూ నిలబడి ఉన్నారు.

  18. అందుకు అహీమెలెకు, “రాజా, దావీదువంటి నమ్మకమైనవాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతడు రాజుకు అల్లుడు, నీ అంగరక్షకుల నాయకుడు, నీ కుటుంబంలో ఎంతో గౌరవం ఉన్నవాడు.

  19. తర్వాత, “యెహోవా యాజకులైన వీరు దావీదు పక్షం ఉన్నారు. అతడు పారిపోయిన విషయం తెలిసినా నాకు చెప్పలేదు కాబట్టి మీరు వెళ్లి వీరందరిని చంపండి” అని తన చుట్టూ నిలబడి ఉన్న సైనికులకు ఆజ్ఞాపించాడు. అయితే రాజు అధికారులు యెహోవా యాజకులను చంపడానికి ఒప్పుకోలేదు.

  20. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అనే ఒకడు తప్పించుకుని పారిపోయి దావీదు దగ్గరకు వచ్చి, సౌలు యెహోవా యాజకులను చంపించిన విషయం దావీదుకు చెప్పాడు.

  21. And Abiathar shewed David that Saul had slain the LORD'S priests.

  22. అప్పుడు దావీదు అబ్యాతారుతో, “ఆ రోజు ఎదోమీయుడైన దోయేగు అక్కడే ఉన్నాడు కాబట్టి వాడు సౌలుకు ఖచ్చితంగా ఈ విషయం చెప్తాడని నేను అనుకున్నాను. నీ తండ్రి ఇంటివారందరు చనిపోవడానికి నేను కారణమయ్యాను.

  23. “చూడండి, ఫిలిష్తీయులు కెయీలాతో పోరాడి నూర్పిడి కళ్ళాలను దోచుకుంటున్నారు” అని దావీదుకు చెప్పినప్పుడు,

  24. దావీదు, “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను చంపనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోవా, “నీవు వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేసి కెయీలాను రక్షించు” అని అతనికి జవాబిచ్చారు.

  25. దావీదుతో ఉన్న మనుష్యులు, “మేము యూదా దేశంలో ఉన్నా మాకు భయంగా ఉంది. ఒకవేళ మేము ఫిలిష్తీయుల సైన్యాలకు ఎదురుగా కెయీలాకు వెళ్తే మరింత భయం వేస్తుంది గదా” అన్నారు.