Skip to content

Tamar

13 వచనాలు · 21 కుటుంబ సభ్యులు

Tamar ను ప్రస్తావించే వచనాలు

  1. దావీదు కుమారుడైన అబ్షాలోముకు తామారు అనే అందమైన చెల్లి ఉండగా దావీదు కుమారుడైన అమ్నోను తామారును గాఢంగా ప్రేమించాడు.

  2. అమ్నోనుకు తన చెల్లి తామారుపై ఉన్న వ్యామోహంతో అతడు అనారోగ్యం పాలయ్యాడు. ఆమె కన్య కాబట్టి ఆమెను ఏమైన చేయడం సాధ్యం కాదని అతనికి అనిపించింది.

  3. అతడు అమ్నోనును చూసి, “రాజకుమారుడవైన నీవు రోజు రోజుకు ఎందుకు చిక్కిపోతున్నావు? విషయమేంటో నాకు చెప్పవా?” అని అడిగాడు. అమ్నోను అతనితో, “నేను నా సోదరుడైన అబ్షాలోము చెల్లి తామారును ప్రేమిస్తున్నాను” అన్నాడు.

  4. అందుకు యెహోనాదాబు, “నీకు అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తూ మంచం మీద పడుకో. నీ తండ్రి నిన్ను చూడడానికి వచ్చినప్పుడు, ‘నా చెల్లి తామారు వచ్చి నాకు తినడానికి ఏదైనా ఇస్తే బాగుండేది. నా కళ్లముందు ఆమె భోజనం సిద్ధం చేసి, తన చేతితో నాకు తినిపించనివ్వండి’ అని నీ తండ్రితో చెప్పు” అన్నాడు.

  5. కాబట్టి తనకు అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తూ అమ్నోను పడుకున్నాడు. రాజు అతన్ని చూడడానికి వచ్చినప్పుడు అమ్నోను, “నేను నా చెల్లి తామారు చేతితో తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా నా కోసం ప్రత్యేకంగా రెండు రొట్టెలు చేయమని చెప్పండి” అని అడిగాడు.

  6. కాబట్టి దావీదు తామారుకు, “నీ అన్న అమ్నోను ఇంటికి వెళ్లి, అతని కోసం భోజనం సిద్ధం చేయి” అని ఇంట్లో ఉన్న తామారుకు కబురు పంపాడు.

  7. తామారు తన అన్న అమ్నోను ఇంటికి వెళ్లింది. అతడు ఇంకా పడుకునే ఉన్నాడు. ఆమె కొంత పిండి తీసుకుని కలిపి అతడు చూస్తుండగా రొట్టెలు చేసి కాల్చింది.

  8. అప్పుడు అమ్నోను తామారుతో, “భోజనం నా పడకగదిలోనికి తెచ్చి నీ చేతితో తినిపించు” అన్నాడు. తామారు తాను తయారుచేసిన రొట్టెలు తీసుకుని పడకగదిలో ఉన్న తన అన్న అమ్నోను దగ్గరకు వచ్చింది.

  9. తామారు తన తలపై బూడిద వేసుకుని తాను వేసుకున్న వస్త్రాన్ని చింపుకుని తలమీద చేతులు పెట్టుకుని గట్టిగా ఏడుస్తూ వెళ్లిపోయింది.

  10. ఆమె అన్న అబ్షాలోము ఆమెను చూసి, “నీ అన్న అమ్నోను కదా నీతో ఉన్నది? నా చెల్లీ, నెమ్మదిగా ఉండు; అతడు నీ అన్న. బాధపడకు” అన్నాడు. తామారు తన అన్న అబ్షాలోము ఇంట్లో ఒంటరిగానే ఉండిపోయింది.

  11. అబ్షాలోము తన అన్న అమ్నోనుతో మంచి గాని చెడు గాని ఏమి మాట్లాడలేదు; తన చెల్లియైన తామారును అవమానపరిచాడు కాబట్టి అతడు అమ్నోనును ద్వేషించాడు.

  12. కానీ దావీదు అన్న షిమ్యా కుమారుడైన యెహోనాదాబు, “నా ప్రభువా, వారు రాజకుమారులందరినీ చంపేశారని అనుకోవద్దు; అమ్నోను మాత్రమే చనిపోయాడు. అతడు అబ్షాలోము చెల్లి తామారును అత్యాచారం చేసిన రోజు నుండే అతన్ని చంపాలనే పగతో అబ్షాలోము ఉన్నాడని అతని మాటలు చెప్తున్నాయి.

  13. ఉంపుడుగత్తెల ద్వారా దావీదుకు పుట్టిన కుమారులు కాకుండా వీరందరు దావీదు కుమారులు. తామారు వీరికి సోదరి.