కంటెంట్‌కు వెళ్లండి

Quotations and Allusions గురించి బైబిల్ వచనాలు

636 వచనాలు · 252 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా హితవత్సరాన్ని, మన దేవుని ప్రతీకార దినాన్ని ప్రకటించడానికి దుఃఖిస్తున్న వారందరినీ ఓదార్చడానికి,

  2. తన కోసం ఎదురు చూసే వారి పక్షంగా కార్యం చేసే మిమ్మల్ని తప్ప అనాది కాలం నుండి ఏ దేవున్ని ఎవరూ చూడలేదు అలాంటి దేవుడు ఉన్నాడని ఎవరూ వినలేదు ఎవరూ గ్రహించలేదు.

  3. తమ ఊహల ప్రకారం చేస్తూ చెడు మార్గంలో నడుస్తూ ఉన్న మూర్ఖులైన ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాపాను.

  4. యెహోవా చెప్పే మాట ఇదే: “ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం. మీరు నా కోసం కట్టాలనుకున్న ఇల్లు ఎక్కడ? నా విశ్రాంతి స్థలం ఏది?

  5. వీటన్నిటిని చేసింది నా చేయి కాదా, ఈ విధంగా అవి కలిగాయి కదా?” అని యెహోవా తెలియజేస్తున్నారు. “ఎవరైతే వినయంతో పశ్చాత్తాప హృదయం కలిగి నా మాట విని వణుకుతారో, వారికే నేను దయ చూపిస్తాను.

  6. “వారు వెళ్లి నా మీద తిరుగుబాటు చేసిన వారి శవాలను చూస్తారు; వాటిని తినే పురుగులు చావవు, వాటిని కాల్చే అగ్ని ఆరిపోదు, మనుష్యులందరికి అది అసహ్యంగా ఉంటుంది.”

  7. నా పేరు కలిగిన ఈ ఇల్లు మీకు దొంగల గుహ అయ్యిందా? నేను చూస్తూనే ఉన్నాను! అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  8. అయితే గర్వించేవారు దీనిని గురించి గర్వించాలి: నన్ను తెలుసుకునే జ్ఞానం వారికి ఉందని, నేనే యెహోవానని, భూమిపై దయను, న్యాయాన్ని నీతిని అమలు చేసేవాడినని, ఎందుకంటే వీటిని బట్టి నేను సంతోషిస్తున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  9. యెహోవా చెప్పే మాట ఇదే: “రామాలో రోదన, గొప్ప ఏడ్పు వినబడుతుంది, రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఇక వారు లేరని, ఓదార్పు పొందడానికి నిరాకరిస్తుంది.”

  10. యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ క్రొత్త నిబంధన చేసే రోజులు వస్తున్నాయి.

  11. ఆ నిబంధన, ఈజిప్టు నుండి నేను వారి పూర్వికుల చేయి పట్టుకుని బయటకు నడిపించినపుడు నేను వారితో చేసిన నిబంధనలా ఉండదు, ఎందుకంటే నేను వారికి ఒక భర్తగా ఉన్నా, వారితో చేసిన నా నిబంధనను వారు ఉల్లంఘించారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  12. “ఆ కాలం తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో నేను చేసే నిబంధన ఇదే” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నేను నా ధర్మశాస్త్రాన్ని వారి మనస్సుల్లో ఉంచి, దాన్ని వారి హృదయాల మీద వ్రాస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు.

  13. ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు, ‘యెహోవాను తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు, ఎందుకంటే వారిలో, సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు అందరు నన్ను తెలుసుకుంటారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఎందుకంటే నేను వారి దుష్టత్వాన్ని క్షమించి వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.”

  14. కారణం లేకుండా నాకు శత్రువులుగా ఉన్నవారు పక్షిలా నన్ను వేటాడారు.

  15. “మనుష్యకుమారుడా, నీవు తిరుగుబాటుదారుల మధ్య జీవిస్తున్నావు. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి చూసే కళ్లు ఉన్నా చూడరు, వినే చెవులు ఉన్నా వినరు.

  16. “అయినా ఇశ్రాయేలీయులు సముద్రతీరాన ఉన్న ఇసుకంత విస్తారంగా కొలువలేనంతగా లెక్కపెట్టలేనంతగా ఉంటారు. ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో, అక్కడే వారు ‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు.

  17. నేను ఆమెను నా కోసం దేశంలో నాటుతాను; ‘నా ప్రియురాలు కాదు,’ అని ఎవరి గురించి అన్నానో ఆ వ్యక్తికే నా ప్రేమను చూపిస్తాను. ‘నా ప్రజలు కారు,’ అని ఎవరి గురించి అన్నానో వారితో, ‘మీరు నా ప్రజలు’ అని చెప్తాను; అప్పుడు వారు, ‘మీరే మా దేవుడు’ అంటారు.”

  18. ఎందుకంటే నేను దయను కోరుతున్నాను బలిని కాదు, దహనబలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టము.

  19. ఇశ్రాయేలు పాపానికి ప్రతిరూపాలైన దుష్టత్వం కలిగిన క్షేత్రాలు నాశనం చేయబడతాయి. ముండ్ల చెట్లు, గచ్చపొదలు పెరిగి వారి బలిపీఠాలను కప్పుతాయి. అప్పుడు వారు పర్వతాలతో, “మమ్మల్ని కప్పండి!” అని కొండలతో, “మామీద పడండి!” అని అంటారు.

  20. “ఇశ్రాయేలు శిశువుగా ఉన్నప్పుడు నేను అతన్ని ప్రేమించాను, ఈజిప్టులో నుండి నేను నా కుమారుని పిలిచాను.

  21. “నేను ఈ ప్రజలను పాతాళం శక్తి నుండి విడిపిస్తాను; మరణం నుండి వారిని విమోచిస్తాను. ఓ మరణమా, నీవు కలిగించే తెగుళ్ళు ఎక్కడ? ఓ పాతాళమా, నీవు కలిగించే నాశనం ఎక్కడ? “అతడు తన సోదరుల మధ్య ఎదుగుతున్నా సరే,

  22. మాటలు సిద్ధపరచుకొని యెహోవా దగ్గరకు రా. ఆయనతో ఇలా చెప్పు: “మా పాపాలన్నీ క్షమించండి మమ్మల్ని దయతో స్వీకరించండి, కోడెలకు బదులుగా మేము మా పెదవులను అర్పిస్తాము.

  23. “ఆ తర్వాత నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ యువకులు దర్శనాలు చూస్తారు.

  24. ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను.

  25. నేను ఆకాశంలో అద్భుతాలను, భూమి మీద రక్తం, అగ్ని, గొప్ప పొగను చూపిస్తాను.