కంటెంట్‌కు వెళ్లండి

Quotations and Allusions గురించి బైబిల్ వచనాలు

636 వచనాలు · 252 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా భయంకరమైన మహాదినం రాకముందు, సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారుతాడు.

  2. యెహోవా పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు; యెహోవా చెప్పినట్టే, సీయోను పర్వతం మీద, యెరూషలేములో విడుదల ఉంటుంది, ఎవరినైతే యెహోవా పిలుచుకుంటారో, వారు రక్షింపబడతారు.

  3. “ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు, మీరు నాకు బలులు, అర్పణలు తెచ్చారా?

  4. మీరు మీ సక్కూతు రాజ దేవుని క్షేత్రాన్ని, మీ కైవాన్ విగ్రహాలను, మీ కోసం మోసుకొచ్చారు. అది మీరు మీ కోసం చేసుకుంది.

  5. కాబట్టి నేను మిమ్మల్ని దమస్కు అవతలికి బందీలుగా పంపిస్తాను,” అని సైన్యాల దేవుడు అని పేరు కలిగిన యెహోవా అంటున్నారు.

  6. “ఆ రోజున, “పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి కడతాను, నేను దాని విరిగిన గోడలను మరమ్మత్తు చేసి, దాని శిథిలాలను తిరిగి నిర్మిస్తాను, మునుపు ఉండినట్లుగా దాన్ని తిరిగి కడతాను.

  7. అలా వారు ఎదోము జనంలో మిగిలిన వారిని, నా నామం కలిగిన యూదేతరులనందరినీ స్వాధీనం చేసుకుంటారు,” అని ఈ కార్యాలన్ని చేసే యెహోవా అంటున్నారు.

  8. “అయితే బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబాల మధ్య నీవు చిన్నదానివైనప్పటికి, నా కోసం ఇశ్రాయేలు మీద పరిపాలన చేసే అధిపతి నీలో నుండి వస్తాడు, ఆయన పూర్వకాలం నుండి శాశ్వతకాలం ఉన్నవాడు.”

  9. “దేశాల వైపు గమనించి చూసి, నిర్ఘాంతపోయి ఆశ్చర్యపడండి: ఎందుకంటే మీ కాలంలో నేనొక కార్యాన్ని చేయబోతున్నాను, దాని గురించి ఎవరైనా మీకు చెప్పినా మీరు దాన్ని నమ్మరు.

  10. “చూడండి, శత్రువు కోరికలు న్యాయమైనవి కాకపోయినా అతడు అతిశయపడుతున్నాడు; కాని నీతిమంతుడు తన నమ్మకత్వాన్ని బట్టి జీవిస్తాడు.

  11. “సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘మరికొంత సమయంలో మరోసారి నేను ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని ఎండిన భూమిని కంపింపజేస్తాను.

  12. మీరు చేయవలసిన పనులేవంటే: ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి, మీ న్యాయస్థానాల్లో సమాధానకరమైన తీర్పు ఇవ్వాలి;

  13. సీయోను కుమారీ, గొప్పగా సంతోషించు! యెరూషలేము కుమారీ, ఆనందంతో కేకలు వేయి! ఇదిగో నీతిమంతుడు, జయశీలియైన మీ రాజు దీనుడిగా గాడిద మీద, గాడిదపిల్ల మీద స్వారీ చేస్తూ మీ దగ్గరకు వస్తున్నాడు.

  14. నేను వారితో, “మీకు మంచిదనిపిస్తే నా జీతం ఇవ్వండి; లేదంటే మానేయండి” అన్నాను. కాబట్టి వారు నాకు ముప్పై వెండి నాణేలు చెల్లించారు.

  15. అప్పుడు వారు నాకు చెల్లించిన దానిని కుమ్మరి దగ్గర పారవేయమని యెహోవా నాకు ఆజ్ఞాపించారు కాబట్టి నేను ఆ ముప్పై వెండి నాణేలు తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేశాను.

  16. “అప్పుడు దావీదు వంశీయుల మీద యెరూషలేము నివాసుల మీద కనికరంగల ఆత్మను విన్నపం చేసే ఆత్మను కుమ్మరిస్తాను. వారు తాము పొడిచిన నన్ను చూసి, ఒకరు తన ఒక్కగానొక్క బిడ్డ కోసం విలపించినట్లు, తన మొదటి కుమారుని కోసం దుఃఖపడునట్లు, ఆయన విషయంలో దుఃఖిస్తూ విలపిస్తారు.

  17. “ఖడ్గమా, మేలుకో, నా గొర్రెల కాపరి మీద నా సన్నిహితుడి మీద పడు!” అని సైన్యాల యెహోవా అంటున్నారు. “కాపరిని కొడతాను, గొర్రెలు చెదిరిపోతాయి, చిన్నవారి మీద నేను నా చేతిని ఉంచుతాను.”

  18. యెహోవా ఇలా అంటున్నారు, “నేను మిమ్మల్ని ప్రేమించాను.” “కాని మీరు, ‘నీవెలా మమ్మల్ని ప్రేమించావు?’ అని అడుగుతున్నారు. “ఏశావు యాకోబుకు అన్న కాడా? అయినా నేను యాకోబును ప్రేమించాను.

  19. ఏశావును ద్వేషించాను; నేను అతని కొండలను పాడు చేశాను. అతడు వారసత్వంగా పొందిన ప్రదేశాన్ని అడవి నక్కల పాలు చేశాను” అని యెహోవా అంటున్నారు.

  20. సైన్యాలకు యెహోవా చెప్పేదేమంటే, “నేను నా దూతను పంపుతాను, అతడు నా ముందర మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆ తర్వాత మీరు వెదుకుతున్న ప్రభువు అంటే మీరు కోరే నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు.”

  21. నేను వచ్చి దేశాన్ని శపించకుండ ఉండేలా అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపు, పిల్లల హృదయాలను తండ్రుల వైపు త్రిప్పుతాడు.”

  22. “ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు” (అంటే “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం).

  23. “ ‘యూదయ దేశంలోని బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం తక్కువదానివి కావు; ఎందుకంటే నా ప్రజలైన ఇశ్రాయేలీయులను కాపాడే అధిపతి నీలో నుండి వస్తాడు.’”

  24. హేరోదు మరణించే వరకు అక్కడే ఉన్నాడు. “ఈజిప్టులో నుండి నేను నా కుమారుని పిలిచాను” అని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటలు ఇలా నెరవేరాయి.

  25. “రామాలో ఏడ్పు గొప్ప రోదన వినబడుతుంది, రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఇక వారు లేరని, ఓదార్పు పొందడానికి నిరాకరిస్తుంది.”