Quotations and Allusions గురించి బైబిల్ వచనాలు: Matthew 21:13, »My house shall be called...«
Matthew 21:13, »My house shall be called...« గురించి వచనాలు
నా పరిశుద్ధ పర్వతం దగ్గరకు తీసుకువస్తాను, నా ప్రార్థన మందిరంలో వారికి ఆనందాన్ని ఇస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులు అర్పణలు అంగీకరించబడతాయి; నా మందిరం అన్ని దేశాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది.”
నా పేరు కలిగిన ఈ ఇల్లు మీకు దొంగల గుహ అయ్యిందా? నేను చూస్తూనే ఉన్నాను! అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ఆయన వారితో, “ ‘నా మందిరం ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడి ఉంది కానీ మీరు దానిని దొంగల గుహగా చేశారు’ ” అన్నారు.
ఆయన వారికి బోధిస్తూ, “ ‘నా మందిరం అన్ని దేశాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడలేదా? కాని మీరు దానిని దొంగల గుహగా చేశారు’ ” అన్నారు.
“ ‘నా మందిరం ప్రార్థన మందిరం’ అని వ్రాయబడి ఉంది, కానీ మీరు దానిని ‘దొంగల గుహగా’ చేశారు” అని అన్నారు.