Quotations and Allusions గురించి బైబిల్ వచనాలు: Acts 3:25, »And in thy seed shall all the kindreds...«
Acts 3:25, »And in thy seed shall all the kindreds...« గురించి వచనాలు
నిన్ను దీవించే వారిని దీవిస్తాను, శపించే వారిని శపిస్తాను; నిన్ను బట్టి భూమి మీద ఉన్న సర్వ జనాంగాలు దీవించబడతారు.”
అబ్రాహాము ఖచ్చితంగా గొప్ప శక్తిగల దేశం అవుతాడు, అతని ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి.
నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి, ఎందుకంటే నీవు నాకు లోబడ్డావు.”
మీరు ప్రవక్తలకు మీ పితరులతో దేవుడు చేసిన నిబంధనకు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ సంతానం ద్వారా భూమిపై ఉన్న ప్రజలందరు ఆశీర్వదించబడతారు’ అని వాగ్దానం చేశారు.
దేవుడు యూదేతరులను వారి విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీరుస్తారని లేఖనంలో ముందుగానే చెప్పబడింది. “నిన్ను బట్టి సర్వ జనులు దీవించబడతారు” అని చెప్పడం ద్వారా అబ్రాహాముకు ముందుగానే సువార్త ప్రకటించబడింది.