కంటెంట్‌కు వెళ్లండి

Quotations and Allusions గురించి బైబిల్ వచనాలు: Romans 10:6, »Who shall ascend into heaven...«

6 వచనాలు · 252 కోణాలు

"Quotations and Allusions" కోసం వెతకండి

Romans 10:6, »Who shall ascend into heaven...« గురించి వచనాలు

  1. మీరు, “దానిని పొందడానికి పరలోకంలోకి ఎవరు ఎక్కి వెళ్లి, మేము దానిని పాటించేలా మాకు ఎవరు ప్రకటిస్తారు?” అని అడగడానికి ఇది పరలోకంలో లేదు.

  2. లేదా, “సముద్రాన్ని దాటి దాన్ని తెచ్చి, మేము దానిని పాటించేలా మాకు ఎవరు ప్రకటిస్తారు?” అని మీరు అడగడానికి అది సముద్రం అవతల లేదు.

  3. మీరు దానిని పాటించేలా ఆ వాక్యం మీకు చాలా దగ్గరగా ఉంది; అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.

  4. అయితే విశ్వాసం ద్వారా వచ్చే నీతి ఇలా చెప్తుంది: “క్రీస్తును క్రిందకు తేవడానికే ‘పరలోకంలోకి ఎవరు ఎక్కి వెళ్తారు?’ అని మీ హృదయంలో అనుకోవద్దు.”

  5. “లేదా ‘క్రీస్తును మృతులలో నుండి పైకి తేవడానికే అగాధం లోనికి ఎవరు దిగి వెళ్తారు?’ ” అని మీ హృదయాల్లో అనుకోవద్దు.

  6. అయితే ఇది ఏమి చెప్తుంది? “వాక్యం మీకు దగ్గరగా ఉంది, అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.” అది మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యమే.