Skip to content

Zion

21 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Sion

31.7700, 35.2300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Zion ను ప్రస్తావించే వచనాలు

  1. యెరూషలేము నుండి శేషం వస్తుంది, సీయోను పర్వతం నుండి తప్పించుకున్నవారు వస్తారు. “సైన్యాల యెహోవా రోషం దీన్ని సాధిస్తుంది.

  2. మహారాజు పట్టణమైన సీయోను పర్వతం సాఫోన్ ఎత్తైన స్థలంలా అందంగా కనిపిస్తూ సర్వలోకానికి ఆనందం కలిగిస్తుంది.

  3. మీ తీర్పులను బట్టి సీయోను పర్వతం ఆనందిస్తుంది యూదా పట్టణాలు సంతోషంగా ఉన్నాయి.

  4. మీ స్వాస్థ్య గోత్రాన్ని మీరు పూర్వం సంపాదించుకుని విమోచించిన మీ వారసత్వ సమాజాన్ని, మీరు నివసించిన సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకోండి.

  5. కాని ఆయన యూదా గోత్రాన్ని, తాను ప్రేమించిన సీయోను కొండనే ఎన్నుకున్నారు.

  6. యాత్రకీర్తన. యెహోవాపై నమ్మకము ఉంచేవారు కదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు.

  7. అప్పుడు యెహోవా సీయోను పర్వతం అంతట, అక్కడ కూడుకునేవారి మీద పగలు పొగతో ఉన్న మేఘాన్ని, రాత్రి మండుతున్న అగ్నిని సృష్టిస్తారు; ప్రతి దాని మీద మహిమ పందిరిగా ఉంటుంది.

  8. ఇదిగో నేను, యెహోవా నాకిచ్చిన పిల్లలు, సీయోను కొండమీద నివసించే సైన్యాల యెహోవా వలన సూచనలుగా, గుర్తులుగా ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.

  9. ప్రభువు సీయోను పర్వతానికి, యెరూషలేముకు వ్యతిరేకంగా పని ముగించిన తర్వాత ఆయన ఇలా అంటారు, “నేను అష్షూరు రాజుకు ఉన్న హృదయపు గర్వం యొక్క ఫలితం బట్టి అతని కళ్లల్లో ఉన్న అహంకారపు చూపును బట్టి అతన్ని శిక్షిస్తాను.

  10. ఆ కాలంలో ఎత్తైన వారు నునుపైన చర్మం గల ప్రజలు దూరంలోనున్న భయపెట్టే ప్రజలు నదులు పారుచున్న దేశం కలిగి దౌర్జన్యం చేసి వింత భాష కలిగిన దేశం సైన్యాల యెహోవాకు కానుకలు తెస్తారు. సైన్యాల యెహోవా నామానికి నివాసస్థలమైన సీయోను పర్వతానికి ఆ కానుకలు తీసుకువస్తారు.

  11. చంద్రుడు దిగులు చెందుతాడు సూర్యుడు సిగ్గుపడతాడు; సైన్యాల యెహోవా సీయోను కొండమీద యెరూషలేములో, దాని పెద్దల ఎదుట గొప్ప మహిమతో రాజ్యమేలుతారు.

  12. ఆకలితో ఉన్నవారు తింటున్నట్లు కల కని కాని ఇంకా ఆకలితోనే మేల్కొన్నట్లు, దాహంతో ఉన్నవారు త్రాగినట్లు కల కని ఇంకా అలసిపోయి దాహంతోనే మేల్కొన్నట్లు ఉంటారు. సీయోను కొండకు వ్యతిరేకంగా యుద్ధం చేసే అన్ని దేశాల గుంపులకు ఇలా ఉంటుంది.

  13. యెహోవా నాతో చెప్పే మాట ఇదే: తప్పించడానికి గొర్రెల కాపరులందరు కలిసివచ్చి ఎన్ని శబ్దాలు చేసినా భయపడకుండా వారి కేకలకు కలవరపడకుండా సింహం ఒక కొదమసింహం తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యాల యెహోవా యుద్ధం చేయడానికి సీయోను పర్వతం మీదికి దాని కొండ మీదికి దిగి వస్తారు.

  14. యెరూషలేము నుండి శేషం వస్తుంది, సీయోను పర్వతం నుండి తప్పించుకున్నవారు వస్తారు. సైన్యాల యెహోవా రోషం దీన్ని సాధిస్తుంది.

  15. సీయోను పర్వతం నిర్జనంగా పడి ఉంది, నక్కలు దాని మీద విహరిస్తున్నాయి.

  16. యెహోవా పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు; యెహోవా చెప్పినట్టే, సీయోను పర్వతం మీద, యెరూషలేములో విడుదల ఉంటుంది, ఎవరినైతే యెహోవా పిలుచుకుంటారో, వారు రక్షింపబడతారు.

  17. అయితే సీయోను పర్వతం మీద విడుదల ఉంటుంది; అది పవిత్రంగా ఉంటుంది, యాకోబు వారు తన వారసత్వాన్ని స్వాధీనపరచుకుంటారు.

  18. ఏశావు పర్వతాలను పరిపాలించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు, రాజ్యం యెహోవాది అవుతుంది.

  19. కుంటివారిని నా శేషంగా, వెళ్లగొట్టబడిన వారిని బలమైన దేశంగా చేస్తాను. యెహోవా సీయోను కొండమీద ఆ రోజు నుండి ఎల్లప్పుడూ వారిని పరిపాలిస్తారు.

  20. అయితే మీరు సీయోను పర్వతానికి, సజీవ దేవుని పట్టణమైన పరలోకపు యెరూషలేముకు వచ్చారు. మీరు సంతోషకరమైన సభలో వేలాదిమంది దేవదూతల దగ్గరకు వచ్చారు.

  21. ఆ తర్వాత నా ఎదుట సీయోను పర్వతం మీద వధించబడిన గొర్రెపిల్ల, ఆయనతో 1,44,000 మంది తమ నుదుటి మీద ఆయన పేరును ఆయన తండ్రి పేరును వ్రాయబడినవారు నిలబడి ఉండడం చూశాను.