Quotations and Allusions గురించి బైబిల్ వచనాలు: Hebrews 1:13, »Sit on my right hand...«
Hebrews 1:13, »Sit on my right hand...« గురించి వచనాలు
దావీదు కీర్తన. యెహోవా నా ప్రభువుతో చెప్పిన మాట: “నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేసే వరకు నీవు నా కుడిచేతి వైపున కూర్చో.”
“ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు “నీవు నా కుడి ప్రక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో అన్నారు.” ’
దావీదు తానే, పరిశుద్ధాత్మతో నింపబడి ఈ విధంగా మాట్లాడాడు: “ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు “నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’
దావీదే స్వయంగా కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాశాడు: “ ‘నేను నీ శత్రువులను నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు
“నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’
దావీదు పరలోకానికి ఎక్కి పోలేదు అయినా ఇలా చెప్పాడు, “ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు
“నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’
దేవుడు దేవదూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా, “నేను నీ శత్రువులను నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు నా కుడి వైపున కూర్చో అని చెప్పారా”?
ఆ సమయం నుండి తన శత్రువులు తన పాదపీఠంగా చేయబడేవరకు ఆయన అక్కడ వేచి ఉంటాడు.