Quotations and Allusions గురించి బైబిల్ వచనాలు: Matthew 12:18, »Behold my servant...«
Matthew 12:18, »Behold my servant...« గురించి వచనాలు
“ఇదిగో, నేను నిలబెట్టుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను; ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను. ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు.
అతడు కేకలు వేయడు, అరవడు, వీధుల్లో ఆయన స్వరం వినబడనీయడు.
నలిగిన రెల్లును అతడు విరువడు, మసకగా వెలుగుతున్న వత్తిని ఆర్పడు. అతడు నమ్మకంగా న్యాయాన్ని చేస్తాడు;
భూమి మీద న్యాయాన్ని స్థాపించే వరకు అతడు అలసిపోడు నిరుత్సాహపడడు. అతని బోధలో ద్వీపాలు నిరీక్షణ కలిగి ఉంటాయి.”
యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా అది అలా జరిగింది. అదేమిటంటే:
“ఇదిగో, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నేను ప్రేమించేవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను; ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను. ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు.
ఆయన జగడమాడడు, అరవడు కేకలు వేయడు; వీధుల్లో ఆయన స్వరం ఎవరికీ వినిపించదు.
న్యాయాన్ని వ్యాపింపచేసే వరకు ఆయన నలిగిన రెల్లును విరువడు, మంటలేకుండా కాలి పొగవస్తున్న వత్తిని ఆర్పడు.
దేశాలు ఈయన నామంలో నిరీక్షణ కలిగి ఉంటాయి.”