కంటెంట్‌కు వెళ్లండి

Quotations and Allusions గురించి బైబిల్ వచనాలు

636 వచనాలు · 252 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఏర్పరచబడిన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారు.

  2. “ఆయన ఎలాంటి పాపం చేయలేదు, ఆయన నోటిలో ఏ మోసం లేదు.”

  3. మనం పాపాల విషయంలో మరణించి నీతి కోసం జీవించేలా ఆయన, “మన పాపాలను తనపై ఉంచుకుని సిలువను మోసారు. ఆయన పొందిన గాయాల వల్ల మీరు స్వస్థత పొందారు.

  4. ఎందుకంటే, “ఎవరైనా జీవితాన్ని ప్రేమించి మంచి దినాలను చూడాలనుకుంటారో వారు చెడు మాట్లాడకుండ నాలుకను మోసపు మాటలు చెప్పకుండ తమ పెదవులను కాచుకోవాలి.

  5. వారు కీడు చేయడం మాని మేలు చేయాలి; వారు సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.

  6. ప్రభువు కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి ప్రార్థనలను వింటున్నాయి, అయితే ప్రభువు ముఖం కీడు చేసేవారికి విరోధంగా ఉన్నది.”

  7. మీరొకవేళ, నీతి కోసం శ్రమపడినా మీరు ధన్యులు. “వారి బెదిరింపుకు భయపడకండి, కలవరపడకండి.”

  8. మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీలో ఉన్న నమ్మకాన్ని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, మంచితనంతో గౌరవంతో సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉండండి.

  9. అలానే, యవ్వనస్థులారా, మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి. మీరందరు వినయం అనే వస్త్రాన్ని ధరించాలి. ఎందుకనగా, “దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు కాని దీనులకు దయ చూపిస్తారు.”

  10. “కుక్క తను కక్కిన దానికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదలో దొర్లడానికి మళ్లినట్లు” అనే సామెతలు వీరి విషయంలో నిజం.

  11. ‘వారు ఇనుపదండంతో రాజ్యాలను పరిపాలిస్తారు, వారిని మట్టి కుండలను పగలగొట్టినట్లు పగలగొడతారు.’