Skip to content

Kings గురించి బైబిల్ వచనాలు

580 వచనాలు · 175 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రాజు ప్రజల మాట వినిపించుకోలేదు, ఎందుకంటే యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో చెప్పిన మాట నెరవేర్చడానికి ఈ సంఘటనలు యెహోవా ఇలా జరిగించారు.

  2. రాజు తమ మాట అంగీకరించలేదని తెలుసుకున్న ఇశ్రాయేలీయులంతా రాజుకు ఇలా జవాబిచ్చారు: “దావీదులో మాకేం భాగం ఉంది, యెష్షయి కుమారునిలో మాకేం స్వాస్థ్యం ఉంది? ఇశ్రాయేలీయులారా, మీ గుడారాలకు వెళ్లిపొండి! దావీదూ, నీ సొంత ఇంటి సంగతి చూసుకో!” కాబట్టి ఇశ్రాయేలీయులు తమ గుడారాలకు వెళ్లిపోయారు.

  3. కాని యూదా పట్టణాల్లో నివసించే ఇశ్రాయేలీయుల మీద మాత్రం రెహబాము పరిపాలన చేశాడు.

  4. రాజైన రెహబాము వెట్టి పనివారి మీద అధికారిగా ఉన్న అదోనిరామును పంపాడు, కాని ఇశ్రాయేలు వారంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. అయితే రాజైన రెహబాము తప్పించుకుని తన రథమెక్కి యెరూషలేముకు పారిపోయాడు.

  5. కాబట్టి నేటికీ ఇశ్రాయేలీయులు దావీదు వంశం మీద తిరుగబడుతూనే ఉన్నారు.

  6. యరొబాము ఈజిప్టు నుండి తిరిగి వచ్చాడని ఇశ్రాయేలీయులంతా విని, వారు సమావేశమై అతన్ని పిలిపించి, అతన్ని ఇశ్రాయేలంతటి మీద రాజుగా నియమించారు. యూదా గోత్రం వారు మాత్రమే దావీదు వంశానికి నమ్మకంగా ఉన్నారు.

  7. రెహబాము యెరూషలేము చేరుకొని యూదా బెన్యామీను గోత్రాల వారినందరిని, అనగా 1,80,000 మంది ఉత్తములైన సైనికులను పోగుచేసుకుని, ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి, సొలొమోను కుమారుడైన రెహబాముకు రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అనుకున్నాడు.

  8. అయితే దైవజనుడైన షెమయాకు దేవుని నుండి ఈ వాక్కు వచ్చింది:

  9. “సొలొమోను కుమారుడును యూదా రాజైన రెహబాముతో, యూదా, బెన్యామీను వారందరితో, మిగితా ప్రజలతో,

  10. ‘యెహోవా చెప్పే మాట ఇదే: మీరు మీ సోదరులైన ఇశ్రాయేలీయులతో యుద్ధానికి వెళ్లకండి. ఇది నేను చేస్తున్నది కాబట్టి మీరంతా ఇళ్ళకు వెళ్లండి.’ ” కాబట్టి వారు యెహోవా మాట విని, యెహోవా ఆదేశించినట్లు తమ ఇళ్ళకు తిరిగి వెళ్లారు.

  11. సొలొమోను కుమారుడైన రెహబాము యూదాలో రాజుగా ఉన్నాడు. అతడు రాజైనప్పుడు అతని వయస్సు నలభై ఒక సంవత్సరాలు. తన నామం ఉంచడానికి యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి ఎన్నుకున్న పట్టణమైన యెరూషలేములో అతడు పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు. రెహబాము తల్లి పేరు నయమా; ఆమె అమ్మోనీయురాలు.

  12. యూదా వారు యెహోవా దృష్టిలో చెడు చేశారు. వారు తమ ముందున్న వారికన్నా ఎక్కువ పాపాలు చేసి ఆయనకు ఎక్కువ రోషం పుట్టించారు.

  13. వారు తమ కోసం ప్రతి ఎత్తైన కొండమీద, ప్రతి పచ్చని చెట్టు క్రింద, క్షేత్రాలను, పవిత్ర రాళ్లను, అషేరా స్తంభాలను కూడా నిలిపారు.

  14. అంతేకాక, దేశంలో ఉన్న క్షేత్రాల్లో మగ వ్యభిచారులు కూడా ఉన్నారు; యెహోవా ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి వెళ్లగొట్టిన జనాంగాలు చేసిన హేయక్రియలు యూదా వారు చేశారు.

  15. రాజైన రెహబాము పాలనలో అయిదవ సంవత్సరం, ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీద దాడి చేశాడు.

  16. అతడు యెహోవా మందిరంలోని నిధిని, రాజభవనంలో నిధిని దోచుకున్నాడు. అతడు సమస్తాన్ని, సొలొమోను చేయించిన అన్ని బంగారు డాళ్లతో పాటు తీసుకెళ్లాడు.

  17. కాబట్టి రాజైన రెహబాము ఆ డాళ్లకు బదులు ఇత్తడి డాళ్ళను చేయించి వాటిని రాజభవనాన్ని కాపలా కాసే రక్షకభటుల అధిపతులకు అప్పగించాడు.

  18. రాజు యెహోవా ఆలయానికి వచ్చినప్పుడెల్లా భటులు ఆ డాళ్లు మోసుకెళ్లేవారు. తర్వాత వాటిని కాపలా ఉన్న గదిలో ఉంచేవారు.

  19. రెహబాము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  20. రెహబాముకు యరొబాముకు మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉండేది.

  21. రెహబాము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని తన పూర్వికుల దగ్గర సమాధి చేశారు. అతని తల్లి పేరు నయమా; ఆమె అమ్మోనీయురాలు. అతని తర్వాత అతని కుమారుడు అబీయా రాజయ్యాడు.

  22. నెబాతు కుమారుడు యరొబాము పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో అబీయా యూదా దేశానికి రాజయ్యాడు,

  23. అతడు యెరూషలేములో మూడేళ్ళు పరిపాలించాడు. అతని తల్లి పేరు మయకా, ఆమె అబీషాలోము కుమార్తె.

  24. అతడు గతంలో తన తండ్రి చేసిన పాపాలన్నీ చేశాడు; అతని హృదయం తన పితరుడైన దావీదు హృదయంలా తన దేవుడైన యెహోవాకు పూర్తిగా అంకితం కాలేదు.

  25. అయినా, అతని దేవుడైన యెహోవా దావీదును బట్టి, అతని సంతానం అతన్ని తర్వాత కొనసాగడానికి, యెరూషలేమును బలపరచడానికి యెరూషలేములో అతన్ని దీపంలా ఇచ్చారు.