Kings గురించి బైబిల్ వచనాలు: Rendered hereditary in the family of David
Rendered hereditary in the family of David గురించి వచనాలు
నీ దినాలు ముగిసి నీవు నీ పూర్వికుల దగ్గరకు వెళ్లినప్పుడు నీ స్థానంలో నీ సంతానాన్ని, నీ సొంత కుమారులలో ఒకరిని నేను లేవనెత్తి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.
నా కోసం ఒక మందిరాన్ని కట్టేవాడు అతడే. నేను అతని రాజ్యసింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.
నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు. అతడు తప్పు చేసినప్పుడు మనుష్యుల దండంతో మనుష్యుల చేతుల దెబ్బలతో అతన్ని శిక్షిస్తాను.
నీ ముందు నుండి నేను తొలగించిన సౌలుకు దూరం చేసినట్లుగా అతనికి నా ప్రేమను దూరం చేయను.
నా ఎదుట నీ ఇల్లు, నీ రాజ్యం ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. నీ సింహాసనం శాశ్వతంగా స్థాపించబడుతుంది.’ ”
నా పరిశుద్ధత తోడని ప్రమాణం చేశాను, నేను దావీదుతో అబద్ధం చెప్పను.
అతని వంశం నిత్యం ఉంటుందని, సూర్యుడు ఉన్నంత వరకు అతని సింహాసనం నా ఎదుట ఉంటుందని;
ఆకాశంలో విశ్వసనీయమైన సాక్ష్యంగా ఉన్న చంద్రునిలా, అది శాశ్వతంగా స్థిరపరచబడి ఉంటుంది” అని అన్నాను. సెలా