కంటెంట్‌కు వెళ్లండి

Kings గురించి బైబిల్ వచనాలు: Athaliah, mother of Ahaziah (usurper)

6 వచనాలు · 175 కోణాలు

Athaliah, mother of Ahaziah (usurper) గురించి వచనాలు

  1. అహజ్యా తల్లి అతల్యా, తన కుమారుడు చనిపోయాడని తెలుసుకుని రాజకుటుంబం వారందరినీ నాశనం చేయడానికి పూనుకుంది.

  2. కాని, అహజ్యా సోదరీ రాజైన యెహోరాము కుమార్తెయైన యెహోషేబ అహజ్యా కుమారుడైన యోవాషును, చావవలసిన రాకుమారుల నుండి రహస్యంగా తప్పించి అతన్ని, అతని దాదిని ఒక పడకగదిలో ఉంచి అతన్ని అతల్యా నుండి దాచిపెట్టింది; కాబట్టి అతడు చంపబడలేదు.

  3. అతల్యా దేశాన్ని పరిపాలించే కాలంలో అతడు ఆరేళ్ళు యెహోవా మందిరంలో అతని దాదితో దాగి ఉన్నాడు.

  4. అహజ్యా తల్లి అతల్యా తన కుమారుడు చనిపోయాడని తెలుసుకుని ఆమె యూదా రాజకుటుంబం వారందరినీ నాశనం చేయడానికి పూనుకుంది.

  5. కాని, రాజైన యెహోరాము కుమార్తెయైన యెహోషేబ అహజ్యా కుమారుడైన యోవాషును, చావవలసిన రాకుమారుల నుండి రహస్యంగా తప్పించి అతన్ని, అతని దాదిని ఒక పడకగదిలో ఉంచింది. రాజైన యెహోరాము కుమార్తె, యాజకుడైన యెహోయాదా భార్యయైన ఈ యెహోషేబ అహజ్యాకు సోదరి కాబట్టి ఆ పసివాన్ని అతల్యా నుండి దాచిపెట్టింది; కాబట్టి అతడు చంపబడలేదు.

  6. అతల్యా దేశాన్ని పరిపాలించే కాలంలో అతడు ఆరేళ్ళు దేవుని మందిరంలో వారితో దాక్కుని ఉన్నాడు.