కంటెంట్‌కు వెళ్లండి

Kings గురించి బైబిల్ వచనాలు: Promote the interests of the Church

15 వచనాలు · 175 కోణాలు

Promote the interests of the Church గురించి వచనాలు

  1. “పర్షియా రాజైన కోరెషు చెప్పేది ఇదే: “ ‘పరలోకపు దేవుడైన యెహోవా నాకు భూమిపై ఉన్న అన్ని రాజ్యాలను ఇచ్చారు. యూదాలోని యెరూషలేములో తనకు మందిరాన్ని నిర్మించడానికి నన్ను నియమించారు.

  2. మీ మధ్య ఉన్న ఆయన ప్రజల్లో ఎవరైనా యూదాలోని యెరూషలేముకు వెళ్లి మందిరాన్ని నిర్మించవచ్చు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, యెరూషలేములో ఉన్న దేవుడైన వారి దేవుడు వారికి తోడుగా ఉండును గాక.

  3. మిగిలి ఉన్నవారు ఇప్పుడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతం ప్రజలు వారికి వెండి, బంగారాలను, సామాగ్రిని, పశువులను యెరూషలేములోని దేవుని ఆలయానికి స్వేచ్ఛార్పణలు ఇవ్వాలి.’ ”

  4. అప్పుడు రాజైన దర్యావేషు ఆదేశించగా వారు బబులోను ఖజానాలోని రాజ్య దస్తావేజులన్ని పరిశోధించారు.

  5. మాదీయ ప్రాంతంలో ఉన్న ఎక్బతానా కోటలో ఒక గ్రంథపుచుట్ట దొరికింది. దాని మీద ఇలా వ్రాసి ఉంది: వ్రాతపూర్వక సందేశము:

  6. రాజైన కోరెషు పాలనలో మొదటి సంవత్సరంలో యెరూషలేములోని దేవుని దేవాలయం గురించి రాజు జారీ చేసిన శాసనం: బలులు అర్పించే స్థలంగా మందిరాన్ని తిరిగి కట్టాలి, దాని పునాదులు వేయాలి. దాని ఎత్తు అరవై మూరలు, వెడల్పు అరవై మూరలు ఉండాలి.

  7. పెద్ద రాళ్లతో మూడు వరుసలు, క్రొత్త కలపతో ఒక వరుస పెట్టి కట్టాలి. దానికయ్యే ఖర్చు రాజ్య ఖజానా నుండి చెల్లించాలి.

  8. అంతేకాక, నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి బబులోనుకు తీసుకువచ్చిన దేవుని ఆలయానికి సంబంధించిన వెండి బంగారు వస్తువులను తిరిగి యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్లి వాటి స్థానాల్లో పెట్టాలి; వాటిని దేవుని మందిరంలోనే ఉంచాలి.

  9. అందుకు ఇప్పుడు, యూఫ్రటీసు నది అవతల అధిపతియైన తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు దీనికి దూరంగా ఉండాలి.

  10. దేవుని ఆలయ పనికి ఆటంకం కలిగించకూడదు. యూదుల అధిపతిని, యూదుల పెద్దలను దేవుని మందిరాన్ని దాని స్థానంలో కట్టనివ్వండి.

  11. అంతేకాక, దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి ఈ యూదుల పెద్దలకు మీరు అందించవలసిన సహాయం గురించి కూడా నేను మీకు ఆదేశం ఇస్తున్నాను: యూఫ్రటీసు నది అవతల నుండి రాజ ఖజానాకు వచ్చిన పన్నుల నుండి వారి ఖర్చులన్నిటిని చెల్లించాలి, తద్వారా వారి పని ఆగదు.

  12. వారికి అవసరమైన వాటిని అనగా పరలోక దేవునికి దహనబలులు అర్పించడానికి దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు యెరూషలేములోని యాజకులు అడిగే గోధుమలు, ఉప్పు, ద్రాక్షరసం, ఒలీవనూనె, ప్రతిరోజు క్రమం తప్పకుండా వారికి అందించాలి.

  13. తద్వారా వారు బలులు అర్పించి పరలోక దేవుని సంతోషపరచి రాజు, అతని కుమారుల క్షేమం గురించి ప్రార్థిస్తారు.

  14. అంతేకాక, నా ఆదేశం ఏంటంటే, ఎవరైనా ఈ ఆజ్ఞ పాటించకపోతే వారి ఇంటి నుండి దూలాన్ని తీసి దానికి వారిని ఉరితీయాలి. ఈ నేరం బట్టి వారి ఇంటిని చెత్తకుప్పగా చేయాలి.

  15. ఏ రాజైన ఏ ప్రజలైనా ఈ ఆజ్ఞను మీరి యెరూషలేములోని దేవుని మందిరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే తన నామాన్ని అక్కడ ఉంచిన దేవుడు వారిని పడగొట్టును గాక. దర్యావేషు అనే నేను ఆదేశిస్తున్నాను. దీనిని ఖచ్చితంగా శ్రద్ధతో పాటించాలి.