కంటెంట్‌కు వెళ్లండి

God గురించి బైబిల్ వచనాలు

662 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. గర్విష్ఠులందరిని చూసి వారిని అణచివేయి, వారున్న చోటులోనే దుష్టులను నలగ్గొట్టు.

  2. వారందరినీ దుమ్ములో పూడ్చిపెట్టు; వారిని సమాధిలో బంధించు.

  3. అప్పుడు నీ సొంత కుడి చేయి నిన్ను రక్షించగలదని నేనే నీ ముందు ఒప్పుకుంటాను.

  4. “నీటిగుర్రాన్ని చూడు, నిన్ను చేసినట్లే దానిని కూడా సృజించాను అది ఎద్దులా గడ్డిమేస్తుంది.

  5. దాని బలం దాని నడుములో ఉంది, దాని శక్తి దాని కడుపు కండరాల్లో ఉంది!

  6. దాని తోక దేవదారు చెట్టు కొమ్మ వంగినట్లు వంగుతుంది; దాని తొడనరాలు గట్టిగా అతికి ఉన్నాయి.

  7. దాని ఎముకలు ఇత్తడి గొట్టాలు, దాని ప్రక్కటెముకలు ఇనుప కడ్డీల్లాంటివి.

  8. దేవుని కార్యాల్లో అది మొదటి స్థానంలో ఉంటుంది, అయినా దాని సృష్టికర్తే దానిని తన ఖడ్గంతో సమీపించగలడు.

  9. కొండలు దానికి ఆహారం అందిస్తాయి, అడవి జంతువులన్నీ దగ్గరలోనే ఆడుకుంటాయి.

  10. తామర మొక్కల క్రింద అది పడుకుంటుంది, బురదనేలలోని రెల్లు మధ్యలో అది దాక్కుంటుంది.

  11. తామరచెట్లు వాటి నీడలో దానిని కప్పుతాయి; కాలువలోని నిరవంజి చెట్లు దానిని చుట్టుకొని ఉంటాయి.

  12. నది పొంగిపొర్లినా అది భయపడదు. యొర్దాను నది పొంగి దాని నోటి వరకు నీరు వచ్చినా అది ధైర్యంగా ఉంటుంది.

  13. అది మెలకువగా ఉన్నప్పుడు ఎవరైనా దానిని బంధించగలరా, దానికి వలవేసి ముక్కుకు తాడువేయగలరా?

  14. “లెవియాథన్ ను చేపగాలంతో లాగగలవా? త్రాడుతో దాని నాలుకను కట్టగలవా?

  15. దాని జమ్ము తాడును ముక్కుకు వేయగలవా? దవడకు గాలం ఎక్కించగలవా?

  16. దయచూపమని అది నిన్ను వేడుకుంటుందా? మృదువైన మాటలు నీతో మాట్లాడుతుందా?

  17. జీవితాంతం నీవు దానిని బానిసగా ఉంచుకునేలా అది నీతో ఒప్పందం చేసుకుంటుందా?

  18. ఒక పక్షితో ఆడుకున్నట్లు నీవు దానితో ఆడుకుంటావా? నీ ఇంట్లోని అమ్మాయిలు ఆడుకోడానికి దానిని కట్టి ఉంచగలవా?

  19. వ్యాపారులు దానితో పరివర్తకం చేస్తారా? వారు దానిని ముక్కలుగా కోసి వ్యాపారులకు అమ్ముతారా?

  20. దాని చర్మం నిండా బల్లెములను గుచ్చగలవా? చేపలను పట్టే ఈటెలతో దాని తల నిండా పొడవగలవా?

  21. నీవు దాని మీద చేయి వేసి చూడు, దానితో చేసే పోరాటాన్ని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ అలా చేయవు.

  22. దానిని వశపరుచుకోవాలనే ఆశ అబద్ధం; కేవలం దానిని చూస్తే చాలు ఎవరైనా భయపడిపోతారు.

  23. దానిని లేపే సాహసం ఎవరు చేయలేరు. అలాంటప్పుడు నా ఎదుట ఎవరు నిలబడగలరు?

  24. నేను తిరిగి చెల్లించవలసి ఉందని ఎవరు నన్ను అడగగలరు? ఆకాశం క్రింద ఉన్నదంతా నాదే.

  25. “లెవియాథన్ అవయవాల గురించి, దానికున్న అధిక బలాన్ని గురించి, దాని మనోహరమైన రూపాన్ని గురించి చెప్పకుండా ఉండలేను.