Skip to content

God గురించి బైబిల్ వచనాలు

662 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఎందుకంటే దేవుడు దానికి జ్ఞానం ఇవ్వలేదు దానికి గ్రహింపు ఇవ్వలేదు.

  2. అయినా పరుగెత్తడానికి అది తన రెక్కలను చాపినప్పుడు, అది గుర్రాన్ని దాని రౌతును చూసి నవ్వుతుంది.

  3. “గుర్రానికి దాని బలాన్ని నీవిస్తావా? దాని మెడ మీద జూలు పెట్టింది నీవా?

  4. దాని భీకరమైన గురకతో భయాన్ని సృష్టించే మిడతలా, మీరు దానిని దూకేలా చేస్తారా?

  5. అది తన బలాన్నిబట్టి సంతోషిస్తూ, ఆగ్రహంతో నేలను దువ్వి, పోరాడటానికి పరుగెడుతుంది.

  6. అది భయాన్ని చూసి నవ్వుతుంది, దేనికి భయపడదు; ఖడ్గాన్ని చూసినా వెనుతిరుగదు.

  7. మెరుస్తున్న ఈటెలు బరిసెలతో పాటు దాని అంబులపొది గలగలలాడుతుంది,

  8. పిచ్చి కోపంలో అది నేల మీద కాలు దువ్వుతుంది; బూరధ్వని విన్నప్పుడు అది ప్రశాంతంగా నిలబడలేదు.

  9. బూర మ్రోగగానే అది, ‘ఆహా!’ అని అంటుంది దూరం నుండే యుద్ధవాసన, సేనాధిపతుల కేకలు యుద్ధఘోష పసిగడుతుంది.

  10. “దక్షిణదిక్కు వైపుకు తన రెక్కలు చాపి ఎలా ఎగరాలో డేగకు నీ జ్ఞానంతో నేర్పించావా?

  11. నీ ఆజ్ఞను బట్టే గ్రద్ద పైకెగిరిపోయి, తన గూడు ఎత్తైన చోటులో కట్టుకుంటుందా?

  12. ఎవరు ఎక్కలేని కొండచరియలో నివసిస్తుంది రాత్రివేళ అక్కడే గడుపుతుంది; ఏటవాలుగా ఉన్న బండ దానికి బలమైన కోట.

  13. అక్కడి నుండే ఆహారం కోసం చూస్తుంది; దాని కళ్లు దూరం నుండే దానిని కనిపెడతాయి.

  14. దాని పిల్లలు రక్తాన్ని త్రాగుతాయి, మృతదేహాలు ఎక్కడ ఉంటాయో అక్కడే అది ఉంటుంది.”

  15. యెహోవా యోబుతో ఈ విధంగా అన్నారు:

  16. “సర్వశక్తిమంతునితో పోరాడేవారు ఆయనను సరిచేయగలరా? దేవునితో నిందించేవారు ఆయనకు జవాబు చెప్పాలి!”

  17. అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు:

  18. “నేను అయోగ్యుడను, మీకెలా జవాబు చెప్పగలను? నా చేతితో నా నోరు మూసుకుంటాను.

  19. ఒకసారి మాట్లాడాను, కాని నా దగ్గర జవాబు లేదు; రెండు సార్లు, ఇక నేను ఏమి చెప్పను.”

  20. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నారు:

  21. “పురుషునిగా నీ నడుము కట్టుకో; నేను నిన్ను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబు చెప్పాలి.

  22. “నీవు నా న్యాయాన్ని కించపరుస్తావా? నిన్ను నీవు సమర్థించుకోడానికి నన్ను ఖండిస్తావా?

  23. దేవుని బాహువులాంటిది నీకుందా? ఆయన స్వరంలా నీ స్వరం ఉరుమగలదా?

  24. అలాగైతే మహిమ వైభవంతో నిన్ను నీవే అలంకరించుకో! ఘనత ప్రభావాలను ధరించుకో!

  25. నీ మహా కోపాన్ని ప్రవాహంలా కుమ్మరించు, గర్విష్ఠులందరిని చూసి వారిని పడగొట్టు,