Hermon
ఇలా కూడా పిలుస్తారు: Hermonites
33.4100, 35.8500 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Hermon ను ప్రస్తావించే వచనాలు
హెర్మోనును సీదోనీయులు షిర్యోను అంటారు; అమోరీయులు శెనీరు అని పిలుస్తారు.
ఆ దేశం అర్నోను వాగు లోయ ఒడ్డున ఉన్న అరోయేరు నుండి హెర్మోను అనే సీయోను కొండ వరకు,
తూర్పు పడమర లోని కనానీయుల రాజులకు, అమోరీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, కొండ సీమలో ఉన్న యెబూసీయుల, మిస్పా ప్రదేశంలో హెర్మోను పర్వతం క్రింద ఉన్న హివ్వీయుల రాజులకు కబురు పంపాడు.
నా దేవా, ఈ బరువు మోయలేక నా మనస్సు క్రుంగిపోయింది; యొర్దాను ప్రాంతం నుండి హెర్మోను పర్వత శిఖరాల నుండి మిసారు గుట్టలపై నుండి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.
ఉత్తర దక్షిణ దిక్కులను మీరే సృజించారు; తాబోరు హెర్మోను పర్వతాలు మీ నామాన్ని బట్టి ఆనంద గానం చేస్తున్నాయి.
అది సీయోను కొండలమీదికి దిగివచ్చే హెర్మోను మంచులా ఉంటుంది. యెహోవా తన ఆశీర్వాదాన్ని, జీవాన్ని కూడా నిరంతరం అక్కడ కుమ్మరిస్తారు.
నా వధువు, లెబానోను నుండి నాతో రా, లెబానోను నుండి నాతో రా. అమాన పర్వత శిఖరం నుండి, శెనీరు, హెర్మోను శిఖరాల నుంచీ, సింహాల బోనుల నుండి, చిరుత పులులు సంచరించే కొండల నుండి దిగిరా.