కంటెంట్‌కు వెళ్లండి

God గురించి బైబిల్ వచనాలు

662 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దానిపై కవచాన్ని ఎవరు లాగివేయగలరు? దాని రెండంతల కవచంలోకి ఎవరు చొచ్చుకోగలరు?

  2. భయంకరమైన పళ్ళ వరుస గల, దాని నోటిద్వారాన్ని తెరవడానికి ఎవరు సాహసం చేస్తారు?

  3. దాని వీపుమీది పొలుసులు చాలా గట్టివి; అవి దగ్గరగా బిగుసుగా కూర్చబడ్డాయి.

  4. గాలికూడా వాటి మధ్యలోనికి చొరబడలేనంత ప్రతిదీ దాని తర్వాత దానికి చాలా దగ్గరగా ఉంటుంది.

  5. ఒక దానితో ఒకటి అతుక్కుని ఉన్నాయి, అవి అంటిపెట్టుకుని ఉంటాయి వాటిని ఎవరు వేరు చేయలేరు.

  6. దాని గురక కాంతి వెలుగులను విసురుతుంది; దాని కళ్లు ఉదయపు కిరణాల్లా ఉన్నాయి.

  7. దాని నోటి నుండి అగ్నిజ్వాలలు ప్రవహిస్తాయి; నిప్పు కణాలు ఎగిరివస్తాయి.

  8. జమ్ము మంట పై ఉడికే కుండలో నుండి పొగ వచ్చినట్లు దాని నాసికా రంధ్రాల్లో నుండి పొగ వస్తుంది.

  9. దాని ఊపిరి నిప్పు కణాలను రాజేస్తుంది, దాని నోటి నుండి మంటలు బయలుదేరతాయి.

  10. బలం దాని మెడలో ఉంటుంది; నిరాశ దాని ముందర నడుస్తుంది.

  11. దాని మాంసం యొక్క మడతలు దగ్గరగా కలుపబడ్డాయి; అవి దృఢంగా అంటుకుని ఉంటాయి.

  12. దాని రొమ్ము బండలా గట్టిగా, తిరుగటిరాయి క్రింది దిమ్మలా ఉంటుంది.

  13. అది లేచినప్పుడు, బలవంతులు భయపడతారు; అది కొట్టకుండానే పారిపోతారు.

  14. ఖడ్గంతో దాడి చేసినా ప్రభావం ఉండదు, ఈటెలు బాణాలు బరిసెలు దాని మీద పని చేయవు.

  15. దానికి ఇనుము అంటే తుక్కుతో ఇత్తడి అంటే పుచ్చిపోయిన చెక్కతో సమానము.

  16. బాణాలు దానిని పారిపోయేలా చేయలేవు; వడిసెల రాళ్లు దానికి పొట్టుతో సమానము.

  17. దుడ్డుకర్ర దానికి తుక్కు ముక్కలా ఉంటుంది; వడిగా వెళ్తున్న ఈటెను చూసి నవ్వుతుంది.

  18. దాని దిగువ భాగం పగిలిన కుండపెంకుల వలె గరుకుగా ఉంటాయి, బురద మీద నూర్పిడి కర్రను పోలిన గుర్తులను ఏర్పరుస్తుంది.

  19. అది దాని గందరగోళంతో నీటిని మరిగేలా చేస్తుంది. అది సముద్రాన్ని కదిలించి నూనె మరుగుతున్న కుండలా చేస్తుంది.

  20. అది వెళ్లిన దారంతా మెరుస్తున్న నురుగును వదలుతుంది; అది చూసేవారికి సముద్రానికి తెల్ల వెంట్రుకలు ఉన్నాయేమో అనిపిస్తుంది.

  21. భూమి మీద దానికి సమానమైనదేదీ లేదు; ఒక భయంలేని సృష్టి.

  22. అహంకారం కలిగిన వాటన్నిటిని చిన్న చూపు చూస్తుంది; గర్వపడే వాటన్నిటికి అది రాజు.”

  23. అప్పుడు యోబు యెహోవాకు ఇలా సమాధానం ఇచ్చాడు:

  24. “నీవు సమస్తం చేయగలవని నాకు తెలుసు; నీ ఉద్దేశాలలో ఏది నిష్ఫలం కాదు.

  25. ‘తెలివిలేని మాటలతో నా ప్రణాళికలను వక్రీకరిస్తున్న ఇతడెవడు? అని నీవడిగావు.’ అవును, అర్థం చేసుకోలేని విషయాల గురించి నేను మాట్లాడాను. అవి నా బుద్ధికి మించినవి నేను గ్రహించలేనివి.