Skip to content

Carmel

22 verses · 3 known names

ఇలా కూడా పిలుస్తారు: Carmelite, Carmelitess

31.4300, 35.1300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Carmel ను ప్రస్తావించే వచనాలు

  1. కెదెషు రాజు ఒక్కడు కర్మెలులోని యొక్నీము రాజు ఒక్కడు

  2. మాయోను, కర్మెలు, జీఫు, యుత్తా,

  3. అలమ్మేలెకు, అమాదు, మిషాలు ఉన్నాయి. పడమరగా ఆ సరిహద్దు కర్మెలు షీహోర్ లిబ్నాతు వరకు ఉంది.

  4. ఉదయాన్నే సమూయేలు లేచి సౌలును కలవడానికి వెళ్లగా, “సౌలు కర్మెలుకు వెళ్లాడు. అక్కడ తన విజయానికి గుర్తుగా స్థూపాన్ని నిలబెట్టి తిరిగి గిల్గాలుకు వెళ్లాడు” అని చెప్పారు.

  5. కర్మెలులో ఆస్తులు ఉన్న ఒక వ్యక్తి మాయోనులో ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు, అతనికి మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలు ఉన్నాయి. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్లాడు.

  6. దావీదు తన పనివారిలో పదిమంది యువకులను పిలిచి వారితో ఇలా చెప్పాడు, “మీరు కర్మెలులో ఉన్న నాబాలు దగ్గరకు వెళ్లి నేను అడిగినట్టుగా క్షేమసమాచారం అడగండి.

  7. “ ‘ఇది గొర్రెల బొచ్చు కత్తిరించే సమయమని నేను విన్నాను. నీ గొర్రెల కాపరులు మాతో ఉన్నప్పుడు మేము వారికి ఏ హాని చేయలేదు. కర్మెలులో ఉన్నంత కాలం వారు ఏదీ పోగొట్టుకోలేదు.

  8. దావీదు సేవకులు కర్మెలులో ఉన్న అబీగయీలు దగ్గరకు వచ్చి, “దావీదు నిన్ను పెళ్ళి చేసుకోవడానికి నిన్ను తీసుకురమ్మని మమ్మల్ని పంపాడు” అని చెప్పారు.

  9. దావీదు అతని మనుష్యులు ఆకీషుతో పాటు గాతులో స్థిరపడ్డారు. ప్రతిఒక్కరు తమ తమ కుటుంబాలతో ఉన్నారు. అలాగే దావీదు ఇద్దరు భార్యలు: యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన అబీగయీలు (నాబాలు విధవరాలు) అతనితో ఉన్నారు.

  10. దావీదు ఇద్దరు భార్యలు యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన నాబాలు విధవరాలు అబీగయీలు కూడా బందీలుగా కొనిపోబడ్డారు.

  11. దావీదు తన ఇద్దరు భార్యలైన యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన నాబాలు విధవరాలు అబీగయీలును తీసుకుని అక్కడికి వెళ్లాడు.

  12. కర్మెలుకు చెందిన నాబాలుకు భార్యగా ఉన్న అబీగయీలుకు పుట్టిన కిల్యాబు అతని రెండవ కుమారుడు; గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవ కుమారుడు;

  13. కర్మెలీయుడైన హెజ్రో, అర్బీయుడైన పయరై,

  14. కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,

  15. నీ శిరస్సు కర్మెలు పర్వతము. నీ శిరోజాలు రాజు ధరించే ఊదా వస్త్రంలా ఉన్నాయి; వాటి చుట్టలో రాజు బందీగా పట్టుబడ్డాడు.

  16. దేశం ఎండిపోయి క్షీణించిపోతుంది, లెబానోను సిగ్గుపడి వాడిపోతుంది; షారోను ఎడారిలా మారింది బాషాను కర్మెలు తమ చెట్ల ఆకులు రాల్చుతాయి.

  17. ఒక్కసారిగా విచ్చుకుంటుంది; అది గొప్పగా సంతోషించి ఆనందంతో కేకలు వేస్తుంది. లెబానోను మహిమ దానికి ఇవ్వబడుతుంది, కర్మెలు షారోనుల వైభవం దానికి ఉంటుంది; వారు యెహోవా మహిమను మన దేవుని వైభవాన్ని చూస్తారు.

  18. “నా జీవం తోడు” అని రాజు ప్రకటిస్తున్నారు, ఆయన పేరు సైన్యాల యెహోవా, “పర్వతాల మధ్య తాబోరు లాంటివాడు, సముద్రం ఒడ్డున ఉన్న కర్మెలు లాంటివాడు వస్తాడు.

  19. అయితే నేను ఇశ్రాయేలీయులను వారి పచ్చిక బయళ్లకు తిరిగి రప్పిస్తాను, వారు కర్మెలు బాషాను మీద మేస్తారు. ఎఫ్రాయిం గిలాదు కొండలమీద వారు తృప్తి చెందుతారు.”

  20. ఆమోసు ఇలా చెప్పాడు: “యెహోవా సీయోను నుండి గర్జిస్తున్నారు యెరూషలేము నుండి ఉరుముతున్నారు; కాపరుల పచ్చికబయళ్లు ఎండిపోతున్నాయి, కర్మెలు పర్వత శిఖరం వాడిపోతుంది.”

  21. వారు కర్మెలు పర్వత శిఖరాన దాక్కున్నా, అక్కడ నేను వారిని వెంటబడి పట్టుకుంటాను. నా కళ్లకు కనిపించకుండా వారు సముద్రపు అడుగుభాగంలో దాక్కున్నా, అక్కడ వారిని కరవమని సర్పానికి ఆజ్ఞ ఇస్తాను.

  22. ఆయన సముద్రాన్ని గద్దించి దానిని ఆరిపోయేలా చేస్తారు; నదులన్నిటినీ ఆయన ఎండిపోయేలా చేస్తారు. బాషాను కర్మెలు ఎండిపోతాయి, లెబానోను పువ్వులు వాడిపోతాయి.