కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 దినవృత్తాంతములు 11:6సుమారు క్రీ.పూ. 975

    బేత్లెహేము, ఏతాము, తెకోవా,

  2. 2 దినవృత్తాంతములు 11:7సుమారు క్రీ.పూ. 975

    బేత్-సూరు, శోకో, అదుల్లాము,

  3. 2 దినవృత్తాంతములు 11:8సుమారు క్రీ.పూ. 975

    గాతు, మరేషా, జీఫు,

  4. 2 దినవృత్తాంతములు 11:9సుమారు క్రీ.పూ. 975

    అదోరయాము, లాకీషు, అజేకా,

  5. 2 దినవృత్తాంతములు 11:10సుమారు క్రీ.పూ. 975

    జోరహు, అయ్యాలోను, హెబ్రోను. ఇవన్నీ యూదా, బెన్యామీనులో కోటగోడలు గల పట్టణాలు ఉన్నాయి.

  6. 2 దినవృత్తాంతములు 11:11సుమారు క్రీ.పూ. 975

    అతడు వాటి కోటగోడలను బలంగా చేసి, వాటిలో అధిపతులను ఉంచాడు. వారికి ఆహారపదార్థాలు, నూనె, ద్రాక్షరసం సరఫరాచేశాడు.

  7. 2 దినవృత్తాంతములు 11:12సుమారు క్రీ.పూ. 975

    ఆ పట్టణాల్లో డాళ్లను, ఈటెలను ఉంచి వాటిని చాలా బలమైన పట్టణాలుగా చేశాడు. ఈ విధంగా యూదా, బెన్యామీను వారంతా అతని వశంలో ఉండిపోయాయి.

  8. 2 దినవృత్తాంతములు 11:13సుమారు క్రీ.పూ. 974

    ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్న యాజకులు లేవీయులు తమ ప్రాంతాలన్నిటి నుండి వచ్చి రెహబాము దగ్గరకు చేరారు.

  9. 2 దినవృత్తాంతములు 11:14సుమారు క్రీ.పూ. 974

    యరొబాము, అతని కుమారులు లేవీయులను యెహోవా యాజకులుగా ఉండకుండా తిరస్కరించి, అతడు క్షేత్రాలకు మేక దూడ విగ్రహాలకు తన సొంత పూజారులను నియమించినప్పుడు, లేవీయులు తమ పచ్చికబయళ్లను, ఆస్తిని కూడా విడిచిపెట్టి యూదాకు యెరూషలేముకు వచ్చారు.

  10. 2 దినవృత్తాంతములు 11:15సుమారు క్రీ.పూ. 974

    And he ordained him priests for the high places, and for the devils, and for the calves which he had made.

  11. 2 దినవృత్తాంతములు 11:16సుమారు క్రీ.పూ. 974

    ఇలా ఉండగా, ఇశ్రాయేలులోని అన్ని గోత్రాల్లో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకడానికి తమ హృదయాల్లో నిర్ణయించుకున్న వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి యెరూషలేముకు వెళ్తున్న లేవీయులను వెంబడించారు.

  12. 2 దినవృత్తాంతములు 11:17సుమారు క్రీ.పూ. 975

    వారు యూదా రాజ్యాన్ని బలపరిచారు; ఈ సమయంలో వారు దావీదు సొలొమోనుల మార్గాలను అనుసరించి మూడు సంవత్సరాలు సొలొమోను కుమారుడైన రెహబాముకు మద్ధతు ఇచ్చారు.

  13. 2 దినవృత్తాంతములు 11:18సుమారు క్రీ.పూ. 975

    రెహబాము దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయైన మహలతును పెళ్ళి చేసుకున్నాడు. ఆమె తల్లి యెష్షయి కుమారుడు ఏలీయాబు కుమార్తెయైన అబీహయిలు.

  14. 2 దినవృత్తాంతములు 11:19సుమారు క్రీ.పూ. 975

    రెహబాముకు యూషు, షెమర్యా, జహము అనే కుమారులు పుట్టారు.

  15. 2 దినవృత్తాంతములు 11:20సుమారు క్రీ.పూ. 975

    ఆ తర్వాత అతడు అబ్షాలోము కుమార్తె మయకాను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె ద్వారా అతనికి అబీయా, అత్తయి, జీజా, షెలోమీతు పుట్టారు.

  16. 2 దినవృత్తాంతములు 11:21సుమారు క్రీ.పూ. 975

    రెహబాముకు పద్దెనిమిది మంది భార్యలు, అరవైమంది ఉంపుడుగత్తెలు ఉన్నారు. ఇరవై ఎనిమిది మంది కుమారులు, అరవైమంది కుమార్తెలు పుట్టారు. తన భార్యలందరిలో, ఉంపుడుగత్తెలందరిలో అబ్షాలోము కుమార్తె మయకా అంటే రెహబాముకు ఎక్కువ ప్రేమ.

  17. 2 దినవృత్తాంతములు 11:22సుమారు క్రీ.పూ. 975

    మయకా కుమారుడైన అబీయాను రాజుగా చేయాలనుకొని, రెహబాము అతన్ని తన సోదరులపైన ప్రముఖునిగా నాయకునిగా నియమించాడు.

  18. 2 దినవృత్తాంతములు 11:23సుమారు క్రీ.పూ. 975

    రెహబాము వివేకంతో ప్రవర్తిస్తూ, తక్కిన తన కుమారులను యూదాలో, బెన్యామీనులో వేరు ప్రాంతాలకు, కోటగోడలు గల పట్టణాలకు పంపాడు. వారికి విస్తారమైన ధనం ఇచ్చి వారికి అనేక పెళ్ళిళ్ళు చేశాడు.

  19. 2 దినవృత్తాంతములు 12:1సుమారు క్రీ.పూ. 972

    రెహబాము రాజ్యం స్థిరపడి బలపడిన తర్వాత అతడు, ఇశ్రాయేలీయులంతా యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు.

  20. 2 దినవృత్తాంతములు 12:2సుమారు క్రీ.పూ. 970

    వారు యెహోవా పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు కాబట్టి, రాజైన రెహబాము పాలనలోని అయిదవ సంవత్సరం ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీద దాడి చేశాడు.

  21. 2 దినవృత్తాంతములు 12:3సుమారు క్రీ.పూ. 970

    అతనితో పాటు 1,200 రథాలు, 60,000 మంది రౌతులు, లెక్కలేనంత మంది లిబియానీయులు సుక్కీయులు కూషీయులు ఈజిప్టు నుండి వచ్చారు.

  22. 2 దినవృత్తాంతములు 12:4సుమారు క్రీ.పూ. 970

    షీషకు యూదా దేశంలో కోటగోడలు గల పట్టణాలను పట్టుకుని, తర్వాత యెరూషలేము వరకు వచ్చాడు.

  23. 2 దినవృత్తాంతములు 12:5సుమారు క్రీ.పూ. 970

    అప్పుడు షెమయా ప్రవక్త రెహబాము దగ్గరకు, షీషకుకు భయపడి యెరూషలేముకు వచ్చి చేరిన యూదా అధిపతుల దగ్గరకు వచ్చి వారితో, “యెహోవా చెప్పేదేమిటంటే, మీరు నన్ను విడిచిపెట్టారు. కాబట్టి నేను మిమ్మల్ని షీషకు చేతికి అప్పగించాను” అని చెప్పాడు.

  24. 2 దినవృత్తాంతములు 12:6సుమారు క్రీ.పూ. 970

    రాజు ఇశ్రాయేలు అధికారులు తమను తాము తగ్గించుకొని, “యెహోవా న్యాయం గలవాడు” అని ఒప్పుకున్నారు.

  25. 2 దినవృత్తాంతములు 12:7సుమారు క్రీ.పూ. 970

    వారు అలా తగ్గించుకోవడం యెహోవా చూశారు. కాబట్టి యెహోవా నుండి ఈ వాక్కు షెమయాకు వచ్చింది, “వారు తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి నేను వారిని నాశనం చెయ్యను. త్వరలో వారిని శిక్షిస్తాను. షీషకు ద్వారా నా కోపాగ్ని యెరూషలేము మీద కుమ్మరించను.