- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 930–586 BC
The Divided Kingdom
The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.
ఈ కాలపు వచనాలు
- 2 దినవృత్తాంతములు 10:1సుమారు క్రీ.పూ. 975
రెహబామును రాజుగా చేయడానికి ఇశ్రాయేలు ప్రజలంతా షెకెముకు వెళ్లగా రెహబాము అక్కడికి వెళ్లాడు.
- 2 దినవృత్తాంతములు 10:2సుమారు క్రీ.పూ. 975
రాజైన సొలొమోను దగ్గరి నుండి ఈజిప్టుకు పారిపోయి అక్కడే నివాసం చేస్తున్న నెబాతు కుమారుడైన యరొబాము ఇది విని, ఈజిప్టు నుండి తిరిగి వచ్చాడు.
- 2 దినవృత్తాంతములు 10:3సుమారు క్రీ.పూ. 975
కాబట్టి ప్రజలు యరొబామును పిలిపించారు. అతడు, ఇశ్రాయేలీయులు అంతా కలిసి రెహబాము దగ్గరకు వెళ్లి అతనితో ఇలా అన్నారు:
- 2 దినవృత్తాంతములు 10:4సుమారు క్రీ.పూ. 975
“మీ తండ్రి మామీద బరువైన కాడిని మోపాడు, అయితే మీ తండ్రి పెట్టిన కఠినమైన దాసత్వాన్ని, మామీద ఉంచిన బరువైన కాడిని తేలిక చేయండి, అప్పుడు మేము మీకు సేవ చేస్తాము.”
- 2 దినవృత్తాంతములు 10:5సుమారు క్రీ.పూ. 975
అందుకు రెహబాము జవాబిస్తూ, “మీరు మూడు రోజులయ్యాక మళ్ళీ రండి” అన్నాడు. కాబట్టి ప్రజలు వెళ్లిపోయారు.
- 2 దినవృత్తాంతములు 10:6సుమారు క్రీ.పూ. 975
అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతనికి సేవలందించిన పెద్దలను సంప్రదించి, “ఈ ప్రజలకు ఎలా జవాబివ్వాలో చెప్పండి” అని అడిగాడు.
- 2 దినవృత్తాంతములు 10:7సుమారు క్రీ.పూ. 975
అందుకు వారు, “ఈ రోజు నీవు ఈ ప్రజల మీద దయచూపి వారిని సంతోషపరచి వారికి అనుకూలంగా జవాబు చెప్తే, వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు” అని చెప్పారు.
- 2 దినవృత్తాంతములు 10:8సుమారు క్రీ.పూ. 975
కాని రెహబాము పెద్దలు ఇచ్చిన సలహాను తిరస్కరించి, తనతో పెరిగి పెద్దవారై తనకు సేవలందిస్తున్న యువకులను సంప్రదించాడు.
- 2 దినవృత్తాంతములు 10:9సుమారు క్రీ.పూ. 975
అతడు వారిని, “మీ సలహా ఏంటి? ‘మీ తండ్రి పెట్టిన కాడిని తేలిక చేయండి’ అని నాతో అంటున్న ఈ ప్రజలకు నేనేమి జవాబివ్వాలి?” అని అడిగాడు.
- 2 దినవృత్తాంతములు 10:10సుమారు క్రీ.పూ. 975
అతనితో పాటు పెరిగి పెద్దవారైన ఆ యువకులు జవాబిస్తూ, “ఈ ప్రజలు నీతో, ‘మీ తండ్రి మామీద బరువైన కాడి ఉంచాడు, కాని మీరు దాన్ని తేలిక చేయండి’ అని అన్నారు. కాని నీవు వారితో, ‘నా తండ్రి నడుముకంటే నా చిటికెన వేలు పెద్దది.
- 2 దినవృత్తాంతములు 10:11సుమారు క్రీ.పూ. 975
నా తండ్రి మీమీద బరువైన కాడి ఉంచాడు; నేను దానిని ఇంకా బరువు చేస్తాను. నా తండ్రి కొరడాలతో కొట్టాడు; నేను తేళ్లతో కొడతాను’ అని చెప్పాలి” అన్నారు.
- 2 దినవృత్తాంతములు 10:12సుమారు క్రీ.పూ. 975
రాజు, “మూడు రోజుల తర్వాత నా దగ్గరకు రండి” అని చెప్పిన ప్రకారం మూడు రోజుల తర్వాత యరొబాము ప్రజలంతా రెహబాము దగ్గరకు వచ్చారు.
- 2 దినవృత్తాంతములు 10:13సుమారు క్రీ.పూ. 975
రెహబాము రాజు పెద్దలు చెప్పిన సలహాను తిరస్కరించి, వారికి కఠినంగా జవాబిచ్చాడు.
- 2 దినవృత్తాంతములు 10:14సుమారు క్రీ.పూ. 975
అతడు యువకులు ఇచ్చిన సలహా ప్రకారం, “నా తండ్రి మీ కాడిని బరువుగా చేశాడు; నేను మరి ఎక్కువ బరువుగా చేస్తాను. నా తండ్రి కొరడాలతో శిక్షించాడు; నేను తేళ్లతో శిక్షిస్తాను” అని అన్నాడు.
- 2 దినవృత్తాంతములు 10:15సుమారు క్రీ.పూ. 975
రాజు ప్రజల మాట వినిపించుకోలేదు, ఎందుకంటే యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో చెప్పిన మాట నెరవేర్చడానికి ఈ సంఘటనలు దేవుడు ఇలా జరిగించారు.
- 2 దినవృత్తాంతములు 10:16సుమారు క్రీ.పూ. 975
రాజు తమ మాట అంగీకరించలేదని తెలుసుకున్న ఇశ్రాయేలీయులంతా రాజుకు ఇలా జవాబిచ్చారు: “దావీదులో మాకేం భాగం ఉంది, యెష్షయి కుమారునిలో మాకేం స్వాస్థ్యం ఉంది? ఇశ్రాయేలీయులారా, మీ గుడారాలకు వెళ్లిపొండి! దావీదూ, నీ సొంత ఇంటి సంగతి చూసుకో!” కాబట్టి ఇశ్రాయేలీయులంతా గుడారాలకు వెళ్లిపోయారు.
- 2 దినవృత్తాంతములు 10:17సుమారు క్రీ.పూ. 975
కాని యూదా పట్టణాల్లో నివసించే ఇశ్రాయేలీయుల మీద మాత్రం రెహబాము పరిపాలన చేశాడు.
- 2 దినవృత్తాంతములు 10:18సుమారు క్రీ.పూ. 975
రాజైన రెహబాము వెట్టి పనివారి మీద అధికారిగా ఉన్న అదోనిరామును పంపాడు, కాని ఇశ్రాయేలీయులు అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. అయితే రాజైన రెహబాము తప్పించుకుని తన రథమెక్కి యెరూషలేముకు పారిపోయాడు.
- 2 దినవృత్తాంతములు 10:19సుమారు క్రీ.పూ. 975
కాబట్టి నేటికీ ఇశ్రాయేలీయులు దావీదు వంశం మీద తిరుగబడుతూనే ఉన్నారు.
రెహబాము యెరూషలేము చేరుకొని యూదా బెన్యామీను గోత్రాల వారినందరిని, అనగా 1,80,000 మంది ఉత్తములైన సైనికులను పోగుచేసుకుని, ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి, రెహబాముకు రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అనుకున్నాడు.
అయితే దైవజనుడైన షెమయాకు యెహోవా నుండి ఈ వాక్కు వచ్చింది:
“సొలొమోను కుమారుడును యూదా రాజైన రెహబాముతో, యూదా బెన్యామీనులో ఉన్న ఇశ్రాయేలీయులందరితో చెప్పు,
‘యెహోవా చెప్పే మాట ఇదే: మీరు మీ తోటి ఇశ్రాయేలీయులతో యుద్ధానికి వెళ్లకండి. ఇది నేను చేస్తున్నది కాబట్టి మీరంతా ఇళ్ళకు వెళ్లండి.’ ” కాబట్టి వారు యెహోవా మాటలు విని, యరొబాముతో యుద్ధానికి వెళ్లడం మాని తిరిగి వెళ్లారు.
- 2 దినవృత్తాంతములు 11:5సుమారు క్రీ.పూ. 975
రెహబాము యెరూషలేములో నివాసముండి యూదాలో రక్షణ కోసం ఈ పట్టణాలను కట్టించాడు:
- 2 దినవృత్తాంతములు 11:6సుమారు క్రీ.పూ. 975
బేత్లెహేము, ఏతాము, తెకోవా,