- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 930–586 BC
The Divided Kingdom
The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.
ఈ కాలపు వచనాలు
- 2 దినవృత్తాంతములు 13:17సుమారు క్రీ.పూ. 958
అబీయా అతని సేనలు వారికి భారీ ప్రాణనష్టం కలిగించగా ఇశ్రాయేలీయుల సమర్థులలో అయిదు లక్షలమంది సైనికులు మరణించారు.
- 2 దినవృత్తాంతములు 13:18సుమారు క్రీ.పూ. 958
ఈ విధంగా ఇశ్రాయేలీయులు అణచివేయబడ్డారు. యూదా ప్రజలు తమ పూర్వికుల దేవుడైన యెహోవాపై ఆధారపడ్డారు కాబట్టి వారు విజయం సాధించారు.
- 2 దినవృత్తాంతములు 13:19సుమారు క్రీ.పూ. 958
అబీయా యరొబామును వెంటాడి, అతని వశంలో నుండి బేతేలును దాని పట్టణాలను, యెషానాను ఎఫ్రోనునూ వాటి చుట్టూ ఉన్న గ్రామాలను స్వాధీనపరచుకున్నాడు.
- 2 దినవృత్తాంతములు 13:20సుమారు క్రీ.పూ. 958
అబీయా రోజుల్లో యరొబాము మళ్ళీ బలపడలేదు. యెహోవా అతన్ని మొత్తాడు కాబట్టి అతడు చనిపోయాడు.
- 2 దినవృత్తాంతములు 13:21సుమారు క్రీ.పూ. 958
కానీ అబీయా బలాభివృద్ధి చెందాడు. అతడు పద్నాలుగు మంది స్త్రీలను పెళ్ళి చేసుకున్నాడు; అతనికి ఇరవై రెండు మంది కుమారులు, పదహారు మంది కుమార్తెలు.
- 2 దినవృత్తాంతములు 13:22సుమారు క్రీ.పూ. 958
అబీయా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు ఏమి చేశాడో ఏమి చెప్పాడో, అవన్నీ ప్రవక్తయైన ఇద్దో రచించిన వ్యాఖ్యాన గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి.
- 2 దినవృత్తాంతములు 14:1సుమారు క్రీ.పూ. 955
అబీయా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు ఆసా రాజయ్యాడు. అతని రోజుల్లో దేశం పది సంవత్సరాలు ప్రశాంతంగా ఉండింది.
- 2 దినవృత్తాంతములు 14:2సుమారు క్రీ.పూ. 941
ఆసా యెహోవా దృష్టిలో మంచిది, సరియైనది చేశాడు.
- 2 దినవృత్తాంతములు 14:3సుమారు క్రీ.పూ. 941
అతడు ఇతర దేవుళ్ళ బలిపీఠాలను, క్షేత్రాలను తొలగించాడు. అషేరా దేవి స్తంభాలను పడగొట్టించాడు.
- 2 దినవృత్తాంతములు 14:4సుమారు క్రీ.పూ. 941
అతడు తమ పూర్వికుల దేవుడైన యెహోవాను వారు తెలుసుకొని, ఆయన నియమాలను ఆజ్ఞలను అనుసరించాలని యూదా ప్రజలకు ఆజ్ఞాపించాడు.
- 2 దినవృత్తాంతములు 14:5సుమారు క్రీ.పూ. 941
అతడు యూదాలోని ప్రతి పట్టణంలోని ఉన్నత క్షేత్రాలను, ధూపవేదికలను తొలగించాడు. అతని పరిపాలనలో దేశం ప్రశాంతంగా ఉంది.
- 2 దినవృత్తాంతములు 14:6సుమారు క్రీ.పూ. 941
దేశం ప్రశాంతంగా ఉన్నప్పుడు అతడు యూదాలో కోటగోడలు గల పట్టణాలు కట్టించాడు. యెహోవా అతనికి విశ్రాంతి ఇవ్వగా ఆ సంవత్సరాల్లో అతనితో ఎవరూ యుద్ధం చేయలేదు.
- 2 దినవృత్తాంతములు 14:7సుమారు క్రీ.పూ. 941
ఆసా యూదా వారితో, “మనం యెహోవాను వెదికి అనుసరించాం కాబట్టి ఈ దేశం ఇంకా మన స్వాధీనంలోనే ఉంది. ఆయనను వెదకి అనుసరించాం కాబట్టి మనం ఈ పట్టణాలను కట్టి, వాటికి చుట్టూ గోడలు, గోపురాలు, ద్వారాలు, అడ్డగడియలు అమర్చుదాం” అన్నాడు. అలాగే వారు పట్టణాలను కట్టి వర్థిల్లారు.
- 2 దినవృత్తాంతములు 14:8సుమారు క్రీ.పూ. 941
ఆసాకు యూదా వారిలో 3,00,000 మంది సైనికులు ఉన్నారు. వారికి పెద్ద డాళ్లు ఈటెలు ఉన్నాయి. అతనికి బెన్యామీనీయులలో 2,80,000 మంది సైనికులున్నారు. వారికి చిన్న డాళ్లు, విల్లులు ఉన్నాయి. వీరంతా పోరాట యోధులు.
- 2 దినవృత్తాంతములు 14:9సుమారు క్రీ.పూ. 941
తర్వాత కూషు వాడైన జెరహు వేవేల సైన్యంతో, మూడువందల రథాలతో వారిపైకి దండెత్తి మరేషా పట్టణం వరకు వచ్చాడు.
- 2 దినవృత్తాంతములు 14:10సుమారు క్రీ.పూ. 941
ఆసా అతన్ని ఎదుర్కోడానికి వెళ్లాడు. వారు మరేషాకు దగ్గరలో ఉన్న జెపాతా లోయలో బారులు తీరారు.
- 2 దినవృత్తాంతములు 14:11సుమారు క్రీ.పూ. 941
అప్పుడు ఆసా యెహోవాకు, “యెహోవా, బలవంతులతో యుద్ధంలో బలహీనులకు సహాయం చేయడానికి మీరు తప్ప ఇంకెవరు లేరు. యెహోవా, మా దేవా! మేము మీమీద నమ్మకం పెట్టుకున్నాము. మీ పేర మేము ఈ మహా సైన్యాన్ని ఎదిరించడానికి వచ్చాం కాబట్టి సాయం చేయండి. యెహోవా మీరే మా దేవుడు. మానవమాత్రులను మీకు వ్యతిరేకంగా నిలువనీయకండి” అని ప్రార్థన చేశాడు.
- 2 దినవృత్తాంతములు 14:12సుమారు క్రీ.పూ. 941
ఆసా ఎదుట యూదా వారి ఎదుట యెహోవా కూషువారిని మొత్తగా వారు పారిపోయారు.
- 2 దినవృత్తాంతములు 14:13సుమారు క్రీ.పూ. 941
ఆసా, అతనితో ఉన్నవారు వారిని గెరారు వరకు వెంటాడారు. కూషు వారిలో చాలామంది కూలారు, కాబట్టి వారు మళ్ళీ బలాన్ని కూడగట్టుకోలేక యెహోవా ఎదుట ఆయన సైన్యం ఎదుట నుండి పారిపోయారు. యూదా వారు అధిక మొత్తంలో దోపుడుసొమ్ము దోచుకున్నారు.
- 2 దినవృత్తాంతములు 14:14సుమారు క్రీ.పూ. 941
గెరారు చుట్టూరా ఉన్న గ్రామాలను యెహోవా భయం ఆవరించింది కాబట్టి యూదా వారు వాటన్నిటిని ఓడించి దోచుకొని, చాలా దోపుడుసొమ్ము తీసుకున్నారు.
- 2 దినవృత్తాంతములు 14:15సుమారు క్రీ.పూ. 941
వారు పశువుల కాపరుల గుడారాలపై కూడా దాడి చేశారు. అంతేకాదు గొర్రెలు, మేకలు ఒంటెల మందలను కూడా తీసుకెళ్లారు. తర్వాత వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు.
దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి దిగిరాగా,
అతడు ఆసాను కలుసుకోడానికి వెళ్లి అతనితో ఇలా చెప్పాడు, “ఆసా, సర్వ యూదా ప్రజలారా, బెన్యామీనీయులారా, నేను చెప్పేది వినండి. మీరు యెహోవాతో ఉంటే ఆయన మీతో ఉంటారు. మీరు ఆయనను వెదికితే, ఆయన మీకు కనిపిస్తారు. ఒకవేళ మీరు ఆయనను విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతారు.
ఎందుకంటే చాలా కాలం వరకు ఇశ్రాయేలు ప్రజలు నిజమైన దేవుడు గాని, బోధించడానికి యాజకులు గాని, ధర్మశాస్త్రం గాని లేకుండానే గడిపారు.
అయితే తమ బాధలో వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయనను వెదికారు. ఆయన వారికి దొరికారు.