కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 దినవృత్తాంతములు 16:11సుమారు క్రీ.పూ. 955

    ఆసా పరిపాలన గురించిన విషయాలు మొదటి నుండి చివరి వరకు యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.

  2. 2 దినవృత్తాంతములు 16:12సుమారు క్రీ.పూ. 916

    ఆసా పరిపాలిస్తున్న ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అతనికి పాదాల్లో జబ్బు పుట్టింది. దానివలన అతడు చాలా బాధ పడినా దాని గురించి కూడా యెహోవాను వెదకలేదు గాని వైద్యులను సహాయం కోరాడు.

  3. 2 దినవృత్తాంతములు 16:13సుమారు క్రీ.పూ. 914

    తాను పరిపాలిస్తున్న నలభై ఒకటో సంవత్సరంలో ఆసా నిద్రపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు.

  4. 2 దినవృత్తాంతములు 16:14సుమారు క్రీ.పూ. 914

    తన కోసం అతడు దావీదు పట్టణంలో తొలిపించుకొన్న సమాధిలో ప్రజలు అతన్ని పాతిపెట్టారు. సుగంధ ద్రవ్యాలతో, రకరకాల పరిమళాలతో నిండిన పాడెమీద అతన్ని ఉంచి, అతని అంత్యక్రియలు ఘనంగా జరిగించారు.

  5. ఆసా స్థానంలో అతని కుమారుడు యెహోషాపాతు రాజయ్యాడు. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా తనను తాను బలపరచుకున్నాడు.

  6. కోటగోడలు గల యూదా పట్టణాలన్నిటిలో అతడు సైన్యాలను ఉంచాడు. యూదాలోనూ, తన తండ్రి ఆసా పట్టుకున్న ఎఫ్రాయిం ప్రాంత పట్టణాల్లోనూ రక్షక దళాలను ఏర్పాటు చేశాడు.

  7. యెహోషాపాతు తన పితరుడైన దావీదు ఆరంభ దినాల్లో అనుసరించిన విధానాలను అనుసరించాడు. కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యెహోషాపాతు బయలును అనుసరించలేదు.

  8. అతడు ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు చేయక తన తండ్రి యొక్క దేవున్ని వెదికి, ఆయన ఆజ్ఞలు అనుసరించాడు.

  9. 2 దినవృత్తాంతములు 17:5సుమారు క్రీ.పూ. 913

    కాబట్టి యెహోవా అతని ఆధీనంలో రాజ్యాన్ని సుస్థిరం చేశారు. యూదా ప్రజలంతా యెహోషాపాతుకు పన్ను చెల్లిస్తూ ఉండేవారు కాబట్టి అతనికి ఎంతో గౌరవం, ఐశ్వర్యం చేకూరాయి.

  10. 2 దినవృత్తాంతములు 17:6సుమారు క్రీ.పూ. 913

    యెహోవా మార్గాల్లో నడవాలని అతడు తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. అతడు క్షేత్రాలను అషేరా స్తంభాలను యూదా దేశంలో లేకుండా తొలగించాడు.

  11. 2 దినవృత్తాంతములు 17:7సుమారు క్రీ.పూ. 912

    తాను పరిపాలిస్తున్న మూడవ సంవత్సరంలో యూదా పట్టణాల్లో ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అతడు బెన్-హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మీకాయా అనే నాయకులను పంపాడు.

  12. 2 దినవృత్తాంతములు 17:8సుమారు క్రీ.పూ. 912

    వారితో పాటు షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబీయా, టోబ్-అదోనియా అనే లేవీయులను యాజకులైన ఎలీషామా, యెహోరాము అనే వారిని పంపాడు.

  13. 2 దినవృత్తాంతములు 17:9సుమారు క్రీ.పూ. 912

    వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చేతపట్టుకుని యూదా అంతటా బోధించారు. వారు యూదాపట్టణాలన్నిటికి సంచారం చేస్తూ ప్రజలకు బోధించారు.

  14. 2 దినవృత్తాంతములు 17:10సుమారు క్రీ.పూ. 912

    యూదా చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నిటినీ యెహోవా భయం ఆవరించింది కాబట్టి అవి యెహోషాపాతుపై యుద్ధం చేయలేదు.

  15. 2 దినవృత్తాంతములు 17:11సుమారు క్రీ.పూ. 912

    ఫిలిష్తీయులలో కొంతమంది యెహోషాపాతుకు కానుకలు, పన్నుగా వెండిని తెచ్చేవారు. అరబీయులు అతనికి 7,700 పొట్టేళ్లు, 7,700 మేకపోతులు తెచ్చేవారు.

  16. 2 దినవృత్తాంతములు 17:12సుమారు క్రీ.పూ. 912

    యెహోషాపాతు అధికంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. అతడు యూదాలో కోటలు, సామాగ్రి నిల్వజేసే గిడ్డంగుల పట్టణాలు కట్టించాడు.

  17. 2 దినవృత్తాంతములు 17:13సుమారు క్రీ.పూ. 912

    యూదా పట్టణాల్లో అతనికి చాలా సంపద చేకూరింది. అతని దగ్గర యెరూషలేములో అనుభవం కలిగిన పోరాట వీరులున్నారు.

  18. 2 దినవృత్తాంతములు 17:14సుమారు క్రీ.పూ. 912

    వారి పూర్వికుల వంశాల ప్రకారం వారి సంఖ్య ఇలా ఉంది: యూదా గోత్రాల్లో వేయిమందికి అధిపతులుగా ఉన్నవారికి అద్నా అనేవాడు సేనాధిపతి: అతనితో 3,00,000 మంది యుద్ధవీరులున్నారు,

  19. 2 దినవృత్తాంతములు 17:15సుమారు క్రీ.పూ. 912

    తర్వాత సేనాధిపతియైన యెహోహనాను, అతనితో 2,80,000 మంది ఉన్నారు,

  20. 2 దినవృత్తాంతములు 17:16సుమారు క్రీ.పూ. 912

    తర్వాత, జిఖ్రీ కుమారుడు అమస్యా. అతడు యెహోవాకు హృదయపూర్వకంగా సమర్పించుకున్నవాడు. అతనితో 2,00,000 మంది యుద్ధవీరులున్నారు.

  21. 2 దినవృత్తాంతములు 17:17సుమారు క్రీ.పూ. 912

    బెన్యామీను గోత్రంలో: ఎల్యాదా అనే యుద్ధవీరుడు ఉండేవాడు. అతనితో విల్లు, డాలు పట్టుకునేవారు 2,00,000 మంది ఉన్నారు,

  22. 2 దినవృత్తాంతములు 17:18సుమారు క్రీ.పూ. 912

    తర్వాత, యెహోజాబాదు, అతనితో 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులున్నారు.

  23. 2 దినవృత్తాంతములు 17:19సుమారు క్రీ.పూ. 912

    వీరంతా రాజుకు కొలువు చేసినవారు. వీరు కాక రాజు యూదా అంతటా కోటగోడలు గల పట్టణాల్లో కొంతమందిని ఉంచాడు.

  24. 2 దినవృత్తాంతములు 18:1సుమారు క్రీ.పూ. 897

    యెహోషాపాతుకు ఎంతో ఐశ్వర్యం, ఘనత ఉన్నాయి. అతడు అహాబుతో వియ్యమందాడు.

  25. 2 దినవృత్తాంతములు 18:2సుమారు క్రీ.పూ. 897

    కొన్ని సంవత్సరాల తర్వాత అతడు సమరయలో అహాబును సందర్శించడానికి వెళ్లాడు. అహాబు అతని కోసం, అతని వెంట వచ్చిన వారి కోసం చాలా గొర్రెలు, పశువులు వధించి, ఆపైన రామోత్ గిలాదుపై దాడి చేయమని అతన్ని ప్రేరేపించాడు.