- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 930–586 BC
The Divided Kingdom
The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.
ఈ కాలపు వచనాలు
- 2 దినవృత్తాంతములు 18:28సుమారు క్రీ.పూ. 897
కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్ గిలాదు మీదికి వెళ్లారు.
- 2 దినవృత్తాంతములు 18:29సుమారు క్రీ.పూ. 897
ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “యుద్ధంలో ప్రవేశించేటప్పుడు నేను మారువేషంలో యుద్ధానికి వెళ్తాను, మీరు మాత్రం మీ రాజవస్త్రాలు ధరించుకోండి” అని అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు మారువేషంలో యుద్ధానికి వెళ్లాడు.
- 2 దినవృత్తాంతములు 18:30సుమారు క్రీ.పూ. 897
సిరియా రాజు తన రథాధిపతులకు, “మీరు ఇశ్రాయేలు రాజు ఒక్కనితో తప్ప, చిన్నవారితో గాని గొప్పవారితో గాని యుద్ధం చేయకూడదు” అని ఆదేశించాడు.
- 2 దినవృత్తాంతములు 18:31సుమారు క్రీ.పూ. 897
అయితే ఆ రథాధిపతులు యెహోషాపాతును చూసి, “ఇతడే ఇశ్రాయేలు రాజు” అనుకుని అతనిపై దాడి చేయడానికి అతని మీదికి రాగా యెహోషాపాతు బిగ్గరగా కేక వేశాడు. అప్పుడు యెహోవా అతనికి సహాయం చేశారు. దేవుడే వారిని అతని దగ్గర నుండి తరిమివేశారు.
- 2 దినవృత్తాంతములు 18:32సుమారు క్రీ.పూ. 897
ఎలాగంటే, అతడు ఇశ్రాయేలు రాజు కాడని రథాధిపతులు తెలుసుకొని వారు అతన్ని తరమడం ఆపివేశారు.
- 2 దినవృత్తాంతములు 18:33సుమారు క్రీ.పూ. 897
అయితే ఎవడో ఒకడు విల్లెక్కుపెట్టి బాణం వేయగా అది ఇశ్రాయేలు రాజుకు కవచం అతుకు మధ్యలో గుచ్చుకుంది. రాజు తన రథసారధితో, “రథం వెనుకకు త్రిప్పి నన్ను యుద్ధం నుండి బయటకు తీసుకెళ్లు, నేను గాయపడ్డాను” అని అన్నాడు.
- 2 దినవృత్తాంతములు 18:34సుమారు క్రీ.పూ. 897
రోజంతా హోరాహోరీగా యుద్ధం జరిగింది. ఇశ్రాయేలు రాజు సాయంత్రం వరకు అరామీయులకు ఎదురుగా తన రథాన్ని ఆసరాగా చేసుకున్నాడు. సూర్యాస్తమయ సమయంలో అతడు చనిపోయాడు.
- 2 దినవృత్తాంతములు 19:1సుమారు క్రీ.పూ. 896
యూదా రాజైన యెహోషాపాతు క్షేమంగా యెరూషలేములో తన భవనానికి తిరిగి వస్తున్నప్పుడు,
- 2 దినవృత్తాంతములు 19:2సుమారు క్రీ.పూ. 896
హనానీ కుమారుడు, దీర్ఘదర్శియైన యెహు అతన్ని కలుసుకోడానికి వెళ్లి రాజైన యెహోషాపాతుతో, “మీరు దుర్మార్గులకు సహాయం చేస్తూ యెహోవాను ద్వేషించేవారిని ప్రేమిస్తారా? యెహోవాకు మీమీద కోపం వచ్చింది.
- 2 దినవృత్తాంతములు 19:3సుమారు క్రీ.పూ. 896
అయితే మీలో కొంత మంచి కూడా ఉంది, మీరు దేశం నుండి అషేరా స్తంభాలను తొలగించి, యెహోవాను వెదికి ఆయనను అనుసరించడానికి హృదయపూర్వకంగా నిశ్చయించుకున్నారు” అని అన్నాడు.
- 2 దినవృత్తాంతములు 19:4సుమారు క్రీ.పూ. 896
యెహోషాపాతు యెరూషలేములో ఉంటూ, బెయేర్షేబ నుండి ఎఫ్రాయిం కొండసీమవరకు ప్రజల మధ్యకు వెళ్లి వారిని మరల వారి పూర్వికుల దేవుడైన యెహోవా వైపుకు త్రిప్పాడు.
- 2 దినవృత్తాంతములు 19:5సుమారు క్రీ.పూ. 896
యూదా దేశంలో కోటగోడలు గల అన్ని పట్టణాల్లో అతడు న్యాయాధిపతులను నియమించాడు.
- 2 దినవృత్తాంతములు 19:6సుమారు క్రీ.పూ. 896
అతడు వారితో ఇలా అన్నాడు, “మీరు ఏమి చేస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించండి, ఎందుకంటే మీరు కేవలం మనుష్యుల కోసం కాదు, మీరు ఎప్పుడు తీర్పు ఇచ్చినా మీకు తోడుగా ఉన్న యెహోవా కోసం తీర్పు ఇస్తున్నారు.
- 2 దినవృత్తాంతములు 19:7సుమారు క్రీ.పూ. 896
యెహోవా భయం మీమీద ఉండాలి. జాగ్రత్తగా తీర్పు తీర్చండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవా అన్యాయం చేయరు, పక్షపాతం చూపించరు, లంచం తీసుకోరు.”
- 2 దినవృత్తాంతములు 19:8సుమారు క్రీ.పూ. 896
యెహోషాపాతు, యెరూషలేములో కూడా కొంతమంది లేవీయులను, యాజకులను ఇశ్రాయేలీయుల కుటుంబ పెద్దలను యెహోవా ధర్మశాస్త్రాన్ని బోధించడానికి, వివాదాలను పరిష్కరించడానికి నియమించాడు. వారు యెరూషలేములో నివసించారు.
- 2 దినవృత్తాంతములు 19:9సుమారు క్రీ.పూ. 896
అతడు వారికి ఈ ఆజ్ఞలు జారీ చేశాడు: “యెహోవాయందు భయం కలిగి, మీరు నమ్మకంగా యధార్థహృదయంతో సేవ చేయాలి.
- 2 దినవృత్తాంతములు 19:10సుమారు క్రీ.పూ. 896
పట్టణాల్లో నివసించే మీ ప్రజలు మీ దగ్గరకు తెచ్చే ప్రతి ఫిర్యాదు అంటే అది హత్యకు సంబంధించినవైనా లేదా ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, శాసనాలు, నిబంధనలకు సంబంధించిన ఇతర విషయాలైనా, వారు యెహోవాకు వ్యతిరేకంగా ఏ పాపం చేయవద్దని మీరు వారిని హెచ్చరించాలి; లేకపోతే ఆయన కోపం మీ మీదికి మీ ప్రజలమీదికి వస్తుంది. ఇలా చేస్తే, మీరు అపరాధులు కారు.
- 2 దినవృత్తాంతములు 19:11సుమారు క్రీ.పూ. 896
“యెహోవాకు సంబంధించిన ప్రతి విషయంలోను ముఖ్య యాజకుడైన అమర్యా మీమీద అధికారిగా ఉంటాడు, అలాగే రాజుకు సంబంధించిన ప్రతి విషయంలోను యూదా గోత్ర నాయకుడు ఇష్మాయేలు కుమారుడైన జెబద్యా మీమీద అధికారిగా ఉంటాడు, లేవీయులు మీ ఎదుట అధికారులుగా ఉండి సేవ చేస్తారు. ధైర్యంగా ఉండండి, మంచిని జరిగించే వారికి యెహోవా తోడుగా ఉండును గాక.”
ఇలా జరిగాక మోయాబీయులు, అమ్మోనీయులు మెయునీయులలో కొందరితో కలిసి యెహోషాపాతుతో యుద్ధం చేయడానికి వచ్చారు.
కొంతమంది మనుష్యులు వచ్చి యెహోషాపాతుతో, “మృత సముద్రం అవతలి వైపున ఉన్న ఎదోము నుండి గొప్ప సైన్యం మీ మీదికి వస్తూ ఉంది. వారు ఇప్పటికే హససోన్ తామారులో (అనగా ఎన్-గేదీ) ఉన్నారు” అని చెప్పారు.
యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారణ చేద్దామని నిశ్చయించుకున్నాడు, అంతేగాక యూదా ప్రజలంతా ఉపవాసం ఉండాలని ప్రకటన చేయించాడు.
సాయం చేయమని యెహోవాను ప్రాధేయపడడానికి యూదా ప్రజలంతా సమకూడారు; ఆయనను సహాయం అడగడానికి యూదాలోని ప్రతి పట్టణం నుండి ప్రజలు వచ్చారు.
అప్పుడు యెహోషాపాతు యూదా, యెరూషలేము సమాజంలో క్రొత్త ప్రాంగణం ముందు ఉన్న యెహోవా మందిరంలో నిలబడి,
ఇలా ప్రార్థించాడు: “యెహోవా మా పూర్వికుల దేవా, పరలోకంలో ఉన్న దేవుడు మీరు కాదా? మీరు ప్రజల రాజ్యాలన్నిటినీ పరిపాలిస్తున్నారు. బలప్రభావాలు మీ చేతిలో ఉన్నాయి, మీకు వ్యతిరేకంగా ఎవరు నిలబడలేరు.
మా దేవా! మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశంలో కాపురమున్న వారిని మీరు వెళ్లగొట్టి, మీ స్నేహితుడైన అబ్రాహాము వారసులకు శాశ్వతంగా ఈ దేశాన్ని ఇవ్వలేదా?