- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 930–586 BC
The Divided Kingdom
The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.
ఈ కాలపు వచనాలు
- 2 దినవృత్తాంతములు 20:33సుమారు క్రీ.పూ. 914
అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు, ప్రజలు తమ పూర్వికుల దేవుని అనుసరించాలని హృదయపూర్వకంగా ఇంకా నిశ్చయించుకోలేదు.
- 2 దినవృత్తాంతములు 20:34సుమారు క్రీ.పూ. 914
యెహోషాపాతు పరిపాలన గురించిన ఇతర విషయాలు, మొదటి నుండి చివరి వరకు, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో నమోదు చేయబడిన హనానీ కుమారుడైన యెహు చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
- 2 దినవృత్తాంతములు 20:35సుమారు క్రీ.పూ. 896
తర్వాత యూదా రాజైన యెహోషాపాతు, దుష్ట మార్గాల్లో నడిచే ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో సంధి చేసుకున్నాడు.
- 2 దినవృత్తాంతములు 20:36సుమారు క్రీ.పూ. 896
అతడు తర్షీషు ఓడలను నిర్మించడానికి అతనితో అంగీకరించాడు. ఎసోన్-గెబెరు దగ్గర అవి నిర్మించబడిన తర్వాత,
- 2 దినవృత్తాంతములు 20:37సుమారు క్రీ.పూ. 896
మరేషాకు చెందిన దోదవహు కుమారుడైన ఎలీయెజెరు యెహోషాపాతుకు వ్యతిరేకంగా, “నీవు అహజ్యాతో పొత్తు పెట్టుకున్నావు కాబట్టి, నీవు చేసిన దాన్ని యెహోవా నాశనం చేస్తారు” అని ప్రవచించాడు. ఓడలు బద్దలయ్యాయి, వాణిజ్యానికి తర్షీషుకు వెళ్లలేకపోయాయి.
- 2 దినవృత్తాంతములు 21:1సుమారు క్రీ.పూ. 889
తర్వాత యెహోషాపాతు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యాడు.
- 2 దినవృత్తాంతములు 21:2సుమారు క్రీ.పూ. 889
వీరు యెహోరాము సహోదరులు, అంటే యెహోషాపాతు కుమారులు: అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్యా. వీరంతా ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు.
- 2 దినవృత్తాంతములు 21:3సుమారు క్రీ.పూ. 889
వారి తండ్రి వారికి అనేక వెండి, బంగారం విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చాడు, వాటితో పాటు యూదాలో కోటగోడలు గల పట్టణాలు కూడా ఇచ్చాడు. అయితే యెహోరాము తనకు ప్రథమ పుత్రుడు, కాబట్టి అతనికి రాజ్యం ఇచ్చాడు.
- 2 దినవృత్తాంతములు 21:4సుమారు క్రీ.పూ. 889
యెహోరాము తన తండ్రి రాజ్యం మీద తన పరిపాలనను సుస్థిరం చేసుకున్న తర్వాత అతడు తన సోదరులందరినీ, ఇశ్రాయేలు అధికారులలో కొందరిని ఖడ్గంతో చంపేశాడు.
- 2 దినవృత్తాంతములు 21:5సుమారు క్రీ.పూ. 892
యెహోరాము రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు.
- 2 దినవృత్తాంతములు 21:6సుమారు క్రీ.పూ. 892
అతడు అహాబు కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు, కాబట్టి అహాబు ఇంటివారిలా ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు. యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
- 2 దినవృత్తాంతములు 21:7సుమారు క్రీ.పూ. 892
అయినప్పటికీ, యెహోవా దావీదుతో చేసిన ఒడంబడిక కారణంగా, దావీదు ఇంటిని నాశనం చేయడానికి యెహోవా ఇష్టపడలేదు. దావీదుకు, అతని వారసులకు ఒక దీపం ఎల్లప్పుడు వెలుగుతూ ఉంటుందని ఆయన వాగ్దానం చేశారు.
- 2 దినవృత్తాంతములు 21:8సుమారు క్రీ.పూ. 889
యెహోరాము కాలంలో, ఎదోమీయులు యూదాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమ సొంత రాజును నియమించుకున్నారు.
- 2 దినవృత్తాంతములు 21:9సుమారు క్రీ.పూ. 889
కాబట్టి యెహోరాము తన సేనాధిపతులతో రథాలన్నిటితో అక్కడికి వెళ్లాడు. ఎదోమీయులు అతన్ని, అతని రథసారధులను చుట్టుముట్టారు, కాని అతడు రాత్రిలో లేచి వారిపై దాడి చేశాడు.
- 2 దినవృత్తాంతములు 21:10సుమారు క్రీ.పూ. 889
ఈనాటికీ ఎదోము యూదాను వ్యతిరేకిస్తూ ఉంది. అదే సమయంలో లిబ్నా తిరుగబడింది, ఎందుకంటే యెహోరాము తన పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టాడు.
- 2 దినవృత్తాంతములు 21:11సుమారు క్రీ.పూ. 889
అంతే కాదు, అతడు యూదా కొండల పైన క్షేత్రాలను కట్టించి, యెరూషలేము ప్రజలను వ్యభిచారుల్లా ప్రవర్తించేలా చేశాడు, యూదావారిని తప్పుత్రోవ పట్టించాడు.
- 2 దినవృత్తాంతములు 21:12సుమారు క్రీ.పూ. 888
అప్పుడు యెహోరాముకు ప్రవక్తయైన ఏలీయా నుండి ఈ లేఖ వచ్చింది. అందులో ఇలా ఉంది: “మీ తండ్రియైన దావీదుకు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘నీవు నీ తండ్రియైన యెహోషాపాతు జీవిత విధానాలను యూదా రాజైన ఆసా జీవిత విధానాలను అనుసరించలేదు.
- 2 దినవృత్తాంతములు 21:13సుమారు క్రీ.పూ. 888
అయితే నీవు ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించి, అహాబు ఇంటివారు చేసినట్లుగా, నీవు యూదా వారిని, యెరూషలేము వారిని వ్యభిచరించేలా చేశావు. నీవు నీ సొంత సోదరులను, నీ సొంత కుటుంబ సభ్యులను, నీ కంటే మెరుగైన పురుషులను కూడా హత్య చేశావు.
- 2 దినవృత్తాంతములు 21:14సుమారు క్రీ.పూ. 888
కాబట్టి గొప్ప తెగులుతో నీ ప్రజలను, నీ కుమారులను, భార్యలను, నీకు చెందినదంతటిని యెహోవా దెబ్బతో కొడతారు.
- 2 దినవృత్తాంతములు 21:15సుమారు క్రీ.పూ. 888
మీరు ప్రేగులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధితో అనారోగ్యం పాలవుతారు, ఆ వ్యాధిని బట్టి మీ ప్రేగులు జారిపోతాయి.’ ”
- 2 దినవృత్తాంతములు 21:16సుమారు క్రీ.పూ. 887
యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, కూషీయులకు దగ్గరలో ఉన్న అరబీయులను పురికొల్పారు.
- 2 దినవృత్తాంతములు 21:17సుమారు క్రీ.పూ. 887
వారు యూదా పైకి దండెత్తివచ్చి, రాజభవనంలో ఉన్న వస్తువులన్నిటిని, అతని కుమారులను భార్యలను తీసుకెళ్లారు. అతని కుమారులలో చిన్నవాడైన యెహోయాహాజు ఒక్కడే మిగిలాడు.
- 2 దినవృత్తాంతములు 21:18సుమారు క్రీ.పూ. 887
ఇదంతా జరిగాక, యెహోవా యెహోరామును ప్రేగులలో నయంకాని జబ్బుతో మొత్తారు.
- 2 దినవృత్తాంతములు 21:19సుమారు క్రీ.పూ. 887
రోజు రోజుకు జబ్బు ఎక్కువవుతూ వచ్చింది. రెండేళ్ళ తర్వాత ఆ జబ్బువలన అతని ప్రేగులు బయటకు వచ్చాయి. మహాబాధతో అతడు చనిపోయాడు. అతని ప్రజలు అతని పూర్వికులకు చేసినట్టు అతనికి అంత్యక్రియలు జరిగించలేదు.
- 2 దినవృత్తాంతములు 21:20సుమారు క్రీ.పూ. 885
యెహోరాము రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలిస్తూ ఉండగా చనిపోయాడు అతని మృతికి ఎవరూ విచారపడలేదు. రాజుల సమాధుల్లో కాకుండ దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు.