కంటెంట్‌కు వెళ్లండి

Prayer గురించి బైబిల్ వచనాలు

720 వచనాలు · 120 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవాను వెదకండి మీరు బ్రతుకుతారు, లేదంటే యోసేపు గోత్రాల మీద ఆయన అగ్నిలా పడతారు; అది వారిని కాల్చివేస్తుంది బేతేలులో దాన్ని ఆర్పివేయగల వారెవరూ ఉండరు.

  2. అప్పుడు వారు యెహోవాకు మొరపెట్టి, “యెహోవా, ఈ మనిషి ప్రాణం కోసం దయచేసి మమ్మల్ని చావనివ్వకండి. నిర్దోషిని చంపుతున్నామని మామీద నేరం మోపకండి, ఎందుకంటే యెహోవా, మీ ఇష్ట ప్రకారం ఇలా జరిగిస్తున్నారు” అని చెప్పి,

  3. చేప కడుపులో నుండి యోనా తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు.

  4. అతడు ఇలా ప్రార్థించాడు: “నా ఆపదలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు జవాబిచ్చారు. మృత్యులోకంలో ఉండి సహాయం కోసం అడిగాను, మీరు నా మొర విన్నారు.

  5. “నా ప్రాణం క్షీణిస్తూ ఉంటే, యెహోవా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. నా ప్రార్థన మీ దగ్గరకు వచ్చింది, మీ పరిశుద్ధ ఆలయానికి చేరింది.

  6. యెహోవా, సహాయం కోసం నేను మొరపెట్టినా, ఎంతకాలం వినకుండా ఉంటావు? “హింస!” జరుగుతుందని నీకు మొరపెట్టినా ఎంతకాలం రక్షించకుండ ఉంటావు?

  7. దేశంలోని సమస్త దీనులారా, ఆయన ఆజ్ఞను పాటించేవారలారా, యెహోవాను వెదకండి. నీతిని వెదకండి, దీనత్వాన్ని వెదకండి; యెహోవా కోప్పడే దినాన బహుశ మీకు ఆశ్రయం దొరకవచ్చు.

  8. వసంతకాలంలో వర్షం కోసం యెహోవాను అడగండి; ఉరుములతో ఉన్న తుఫానును పంపేది యెహోవాయే. అందరి పొలానికి మొక్కలు పెరిగేలా, ఆయన ప్రజలందరికి వర్షాన్ని కురిపిస్తారు.

  9. “నేను యూదాను బలపరుస్తాను యోసేపు గోత్రాలను రక్షిస్తాను. వారి పట్ల నాకు దయ ఉంది కాబట్టి, నేను వారిని తిరిగి రప్పిస్తాను. నేను వారిని విడిచిపెట్టిన సంగతిని వారు మరిచిపోతారు, ఎందుకంటే నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారికి జవాబిస్తాను.

  10. “అప్పుడు దావీదు వంశీయుల మీద యెరూషలేము నివాసుల మీద కనికరంగల ఆత్మను విన్నపం చేసే ఆత్మను కుమ్మరిస్తాను. వారు తాము పొడిచిన నన్ను చూసి, ఒకరు తన ఒక్కగానొక్క బిడ్డ కోసం విలపించినట్లు, తన మొదటి కుమారుని కోసం దుఃఖపడునట్లు, ఆయన విషయంలో దుఃఖిస్తూ విలపిస్తారు.

  11. ఈ మూడవ వంతు ప్రజలను నేను అగ్నిలో నుండి వెండిని శుద్ధి చేసినట్లు వారిని శుద్ధి చేస్తాను బంగారాన్ని పరీక్షించినట్లు వారిని పరీక్షిస్తాను. వారు నా పేరట మొరపెడతారు, నేను వారికి జవాబిస్తాను. ‘వారు నా ప్రజలు’ అని నేనంటాను, ‘యెహోవా మా దేవుడు’ అని వారంటారు.”

  12. అందుకు యేసు, “సాతానా! నా దగ్గర నుండి వెళ్లిపో! నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉంది” అని చెప్పారు.

  13. “మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల్లా ఉండకండి. ఎందుకంటే వారు సమాజమందిరాల్లోను వీధుల మూలల్లోను నిలబడి అందరికి కనబడేలా ప్రార్థించడం వారికి ఇష్టం. వారు తమ ప్రతిఫలం పూర్తిగా పొందుకున్నారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.

  14. అయితే మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని, కనిపించని మీ తండ్రికి ప్రార్థన చేయండి. మీరు రహస్యంగా చేసేది చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.

  15. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ మాటలు మాట్లాడితే తమ ప్రార్థన ఆలకించబడుతుందని భావించే యూదేతరుల్లా అనవసరమైన మాటలు పలుకుతూ ప్రార్థించకండి.

  16. మీ తండ్రిని మీరు అడగడానికి ముందే మీకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి మీరు వారిలా ఉండకండి.

  17. “మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి: “ ‘పరలోకమందున్న మా తండ్రీ, మీ నామం పరిశుద్ధపరచబడును గాక,

  18. మీ రాజ్యం వచ్చును గాక; పరలోకంలో జరుగునట్లు భూమి మీద, మీ చిత్తం జరుగును గాక.

  19. మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ఇవ్వండి.

  20. మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణాలను క్షమించండి.

  21. మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’

  22. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి. అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి.

  23. “అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది.

  24. అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి తలుపు తీయబడుతుంది.

  25. “మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టె అడిగితే రాయి ఇస్తారా?