Prayer గురించి బైబిల్ వచనాలు: With desire to be heard
With desire to be heard గురించి వచనాలు
మీ సేవకులైన ఇశ్రాయేలు ప్రజల కోసం మీ సేవకుడు పగలు రాత్రి మీ ఎదుట చేస్తున్న ప్రార్థనను వినడానికి మీ చెవిని మీ కళ్లను తెరవండి. నేను, నా తండ్రి కుటుంబంతో సహా ఇశ్రాయేలీయులమైన మేము మీకు వ్యతిరేకంగా చేసిన పాపాలను నేను ఒప్పుకుంటున్నాను.
దావీదు ప్రార్థన. యెహోవా, న్యాయమైన నా మనవి వినండి; నా మొర ఆలకించండి. నా ప్రార్థన వినండి అది మోసపూరితమైన పెదవుల నుండి రాలేదు.
సంగీత దర్శకునికి.తంతివాద్యాలతో పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. ఓ దేవా! నా ప్రార్థన ఆలకించండి, నా విజ్ఞప్తిని విస్మరించకండి;
నా మనవి విని నాకు జవాబివ్వండి. నా ఆలోచనలతో నాకు నెమ్మది లేదు.
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. ఓ దేవా! నా మనవి వినండి; నా ప్రార్థన ఆలకించండి.