Prayer గురించి బైబిల్ వచనాలు: With desire to be answered
With desire to be answered గురించి వచనాలు
యెహోవా, నేను మొరపెట్టినప్పుడు నా స్వరాన్ని ఆలకించండి; నాపై కరుణ చూపించి నాకు జవాబివ్వండి.
నేను కష్టంలో ఉన్నప్పుడు మీ ముఖాన్ని నాకు మరుగు చేయకండి. మీ చెవి నా వైపు త్రిప్పండి; నేను మొరపెట్టినప్పుడు, త్వరగా జవాబివ్వండి.
మీరు ప్రేమించేవారు విడిపించబడేలా, మీ కుడిచేతితో మమ్మల్ని రక్షించి మాకు సాయం చేయండి.
దావీదు కీర్తన. యెహోవా, నా ప్రార్థన వినండి; దయ కోసం నేను చేసే మొరను ఆలకించండి; మీ నమ్మకత్వం నీతిని బట్టి నాకు జవాబివ్వండి.