Skip to content

Prayer గురించి బైబిల్ వచనాలు

720 వచనాలు · 120 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే ఈ శాసనం ఇవ్వబడిందని దానియేలు తెలిసినప్పటికీ అతడు ఇంటికి వెళ్లి యెరూషలేము వైపు తెరచిన కిటికీలు ఉన్న తన పైగదికి వెళ్లాడు. అతడు గతంలో చేసినట్టు, రోజుకు మూడుసార్లు మోకరించి ప్రార్థన చేస్తూ, తన దేవునికి స్తుతులు చెల్లించాడు.

  2. కాబట్టి నేను ప్రభువైన దేవుని వైపు తిరిగి ప్రార్థన, విన్నపం ద్వారా ఆయనను ప్రాధేయపడ్డాను, ఉపవాసముండి, గోనెపట్ట చుట్టుకొని, బూడిద మీద పోసుకున్నాను.

  3. నా దేవుడైన యెహోవాకు ఇలా ప్రార్థన చేస్తూ ఒప్పుకున్నాను: “ప్రభువా! మిమ్మల్ని ప్రేమించి, మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల ప్రేమ నిబంధనను నిలిపే మహా భీకరుడవైన దేవా,

  4. మేము పాపం చేశాము, తప్పు చేశాము. మేము దుష్టులమై తిరుగుబాటు చేశాం; మీ ఆజ్ఞలు, న్యాయవిధుల నుండి తప్పిపోయాము.

  5. మీ నామంలో, మా రాజులతో, అధిపతులతో, పూర్వికులతో, దేశ ప్రజలందరితో మాట్లాడిన మీ దాసులైన ప్రవక్తల మాటలు మేము వినలేదు.

  6. “ప్రభువా! మీరు నీతిమంతులు, కాని ఈ రోజు మేమైతే అనగా మీ పట్ల మేము చూపిన నమ్మకద్రోహాన్ని బట్టి ఆయా దేశాలకు చెదరగొట్టబడిన యూదా ప్రజలం, యెరూషలేము నివాసులం, ఇశ్రాయేలీయులం, దగ్గరగా దూరంగా ఉన్నవారమందరం అవమానంతో నిండిపోయాము.

  7. యెహోవా, మేము మీకు వ్యతిరేకంగా పాపం చేశాం కాబట్టి మేము, మా రాజులు, అధిపతులు, పూర్వికులు అవమానంతో కప్పబడ్డాము.

  8. మా ప్రభువైన దేవుడు, మేము తిరుగుబాటు చేసిన కూడా, కరుణ, క్షమాపణ గలవారు;

  9. దేవుడైన యెహోవాకు మేము లోబడలేదు, ఆయన తన దాసులైన ప్రవక్తల ద్వారా మాకిచ్చిన న్యాయవిధులను మేము పాటించలేదు.

  10. ఇశ్రాయేలంతా మీకు విధేయత చూపడం విడిచిపెట్టి, మీ ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, వదిలేశారు. “కాబట్టి దేవుని దాసుడైన మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న శాపాలు, ప్రమాణం చేయబడిన తీర్పులు మామీద కుమ్మరించబడ్డాయి, ఎందుకంటే మీకు విరోధంగా మేము పాపం చేశాము.

  11. మమ్మల్ని ఉద్దేశించి చెప్పిన మాటలు, మా మీదికి, మా పాలకుల మీదికి గొప్ప విపత్తు తీసుకురావడం ద్వారా మీరు నెరవేర్చారు. యెరూషలేముకు జరిగినట్లు ఆకాశమంతటి క్రింద మరే స్థలంలో ఎప్పుడూ జరగలేదు.

  12. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినట్లే, ఈ విపత్తు అంతా మా మీదికి వచ్చింది, అయినా మేము పాపాలను వదిలి, మీ సత్యం వైపు దృష్టి పెట్టక, మా దేవుడైన యెహోవా చూపించు దయను కోరలేదు.

  13. మా దేవుడైన యెహోవా తాను క్రియలన్నిటిలో న్యాయవంతులు కాబట్టి యెహోవా ఈ విపత్తు మా మీదికి రప్పించడానికి మొహమాట పడలేదు; అయినా మేము ఆయనకు లోబడలేదు.

  14. “ప్రభువైన మా దేవా, బలమైన హస్తం ద్వారా మీ ప్రజలను ఈజిప్టు నుండి బయటకు రప్పించి నీ నామానికి ఘనత తెచ్చుకున్నావు. మేము పాపం చేశాం, దుర్మార్గంగా ప్రవర్తించాము.

  15. ప్రభువా, మీ నీతిక్రియల ప్రకారం మీ పట్టణం, మీ పరిశుద్ధ కొండయైన యెరూషలేము పట్ల మీ కోపాన్ని వదిలేయండి. మా పాపాలు, మా పూర్వికుల అతిక్రమాలు, మా చుట్టూ ఉన్న ప్రజలకు, యెరూషలేమును, మీ ప్రజలను హేళన చేసే విషయంగా మార్చాయి.

  16. “ఇప్పుడు, మా దేవా, మీ దాసుని ప్రార్థనలు, విన్నపాలు ఆలకించండి. ప్రభువా, మీ కోసం, పాడైపోయిన మీ పరిశుద్ధాలయం మీద దయతో చూడండి.

  17. మా దేవా, చెవియొగ్గి ఆలకించండి; మీ కళ్లు తెరిచి, మీ పేరుపెట్టబడిన పట్టణం యొక్క శిథిలావస్తను చూడండి. మేము నీతిమంతులమని కాదు కాని, మీ గొప్ప కరుణను బట్టి మేము మీకు మా విన్నపాలు చేస్తున్నాము.

  18. ప్రభువా ఆలకించండి! ప్రభువా క్షమించండి! నా దేవా మీ కోసం, ఆలస్యం చేయకండి, ఎందుకంటే మీ పట్టణం మీ ప్రజలు మీ పేరు కలిగి ఉన్నారు.”

  19. అతడు దేవదూతతో పోరాడి గెలిచాడు; అతడు ఏడ్చి, దయచూపమని వేడుకున్నాడు. బేతేలులో అతడు దేవున్ని కనుగొన్నాడు అక్కడ అతడు ఆయనతో మాట్లాడాడు.

  20. యెహోవా ఎదుట సేవచేసే యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఏడ్వాలి. వారు, “యెహోవా! మీ ప్రజలను కనికరించండి. మీ స్వాస్థ్యమైన వారిని అవమాన పడనివ్వకండి వారు దేశాల మధ్య హేళన చేయబడకూడదు. ‘వీరి దేవుడు ఎక్కడ?’ అని ప్రజలు ఎందుకు అనుకోవాలి?”

  21. అప్పుడు యెహోవా తన దేశంపట్ల ఆసక్తి చూపి, ప్రజలను కనికరించారు.

  22. యెహోవా వారికి ఇలా జవాబిచ్చారు: “నేను మిమ్మల్ని పూర్తిగా తృప్తిపరచడానికి, ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవనూనె పంపుతున్నాను; ఇక ఎన్నడూ మిమ్మల్ని దేశాల్లో అవమానానికి గురిచేయను.

  23. యెహోవా పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు; యెహోవా చెప్పినట్టే, సీయోను పర్వతం మీద, యెరూషలేములో విడుదల ఉంటుంది, ఎవరినైతే యెహోవా పిలుచుకుంటారో, వారు రక్షింపబడతారు.

  24. యెహోవా ఇశ్రాయేలుతో చెప్పే మాట ఇదే: “నన్ను వెదికితే బ్రతుకుతారు.

  25. బేతేలును ఆశ్రయించకండి; గిల్గాలు క్షేత్రాలకు వెళ్లకండి, బెయేర్షేబకు ప్రయాణించకండి. గిల్గాలు ప్రజలు ఖచ్చితంగా బందీలుగా వెళ్తారు, విపత్తులతో బేతేలు శూన్యంగా మారుతుంది.”