Skip to content

Prayer గురించి బైబిల్ వచనాలు

720 వచనాలు · 120 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యేసు ఇంట్లోకి వెళ్లిన తర్వాత, శిష్యులు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, “మేము ఎందుకు దానిని వెళ్లగొట్టలేకపోయాం” అని అడిగారు.

  2. అందుకు ఆయన, “ఇలాంటివి ప్రార్థన ద్వారా మాత్రమే బయటకు వస్తాయి” అని చెప్పారు.

  3. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా, దానిని పొందుకున్నామని నమ్మండి, అప్పుడు దానిని మీరు పొందుకుంటారు.

  4. మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ మీరు ఎవరిపట్లనైనా ఏదైనా వ్యతిరేకత కలిగి ఉంటే, వారిని క్షమించండి, దాన్ని బట్టి మీ పరలోకపు తండ్రి మీ పాపాలను క్షమిస్తారు.

  5. వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకుని, దాని కోసం కృతజ్ఞత చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసుకోండి, ఇది నా శరీరం” అని చెప్పారు.

  6. ఆ తర్వాత ఆయన పాత్రను తీసుకుని, కృతజ్ఞతలు చెల్లించి, దానిని వారికి ఇచ్చారు, అప్పుడు వారందరు దానిలోనిది త్రాగారు.

  7. ఆ రోజుల్లో ఒక రోజు ప్రార్థించడానికి యేసు కొండెక్కి రాత్రంతా దేవుని ప్రార్థిస్తూ గడిపారు.

  8. ఆ శతాధిపతి యేసు గురించి విని, యేసును వచ్చి తన దాసుని స్వస్థపరచుమని బ్రతిమాలడానికి యూదా నాయకుల్లో కొందరిని ఆయన దగ్గరకు పంపించాడు.

  9. అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి, కృతజ్ఞత చెల్లించి వాటిని విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు.

  10. ఒక రోజు యేసు ఒక స్థలంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన ముగించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, “ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించినట్లు మాకు నేర్పించు” అని ఆయనను అడిగాడు.

  11. ఆయన వారితో, “మీరు ప్రార్థన చేసేప్పుడు: “ ‘తండ్రీ, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక.

  12. మా అనుదిన ఆహారం ప్రతిరోజు మాకు ఇవ్వండి.

  13. మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మేము క్షమించినట్లు, మా పాపాలను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి.’”

  14. ఆ తర్వాత యేసు వారితో, “మీలో ఒకరికి ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి, నీవు అర్థరాత్రి సమయంలో అతని దగ్గరకు వెళ్లి, ‘స్నేహితుడా, నా స్నేహితుడొకడు ప్రయాణం చేస్తూ, నా దగ్గరకు వచ్చాడు, వానికి పెట్టడానికి నా దగ్గర ఆహారమేమి లేదు కాబట్టి నాకు మూడు రొట్టెలిస్తావా?’ అని అడిగితే;

  15. For a friend of mine in his journey is come to me, and I have nothing to set before him?

  16. లోపల ఉన్నవాడు, ‘నన్ను ఇబ్బంది పెట్టకు, తలుపుకు తాళం వేసి ఉంది. నేను నా పిల్లలు పడుకున్నాము. నేను లేచి నీకు ఏమీ ఇవ్వలేను?’ అని అన్నాడనుకోండి.

  17. నేను చెప్తున్న, మీకున్న స్నేహాన్ని బట్టి అతడు లేచి నీకు రొట్టె ఇవ్వకపోయినా, నీవు అంతగా సిగ్గువిడిచి అడిగావు కాబట్టి అతడు తప్పక లేచి, నీకు అవసరమైనంత ఇస్తాడు.

  18. “అందుకే నేను మీకు చెప్తున్న: అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది.

  19. అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి, తలుపు తీయబడుతుంది.

  20. “మీ తండ్రులలో ఎవరైనా, తన కుమారుడు, చేప అడిగితే పాము ఇస్తారా?

  21. వాడు గ్రుడ్డు అడిగితే తేలు ఇస్తాడా?

  22. మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి బహుమానాలను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా పరిశుద్ధాత్మను ఇస్తారు!”

  23. ఒక రోజు యేసు విసుగక ప్రార్థన చేస్తూ ఉండాలి అనే విషయాన్ని ఉపమానరీతిగా చెప్పారు:

  24. “ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుని భయం లేదు, మనుష్యులను లెక్క చేసేవాడు కాడు.

  25. ఆ పట్టణంలో ఒక విధవరాలు అతని దగ్గరకు తరచుగా వస్తూ, ‘నా విరోధి విషయంలో నాకు న్యాయం తీర్చండి’ అని అడుగుతూ ఉండేది.