కంటెంట్‌కు వెళ్లండి

Patriotism గురించి బైబిల్ వచనాలు

63 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెరూషలేము యొక్క సమాధానం కోసం ప్రార్థించండి. “యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు క్షేమంగా ఉందురు గాక!

  2. మీ ప్రాకారాలలో సమాధానం మీ కోట గోడలలో అభివృద్ధి ఉండును గాక!”

  3. సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు; మీ జీవితకాలమంతా యెరూషలేము అభివృద్ధిని చూస్తారు.

  4. మీరు మీ పిల్లల పిల్లల్ని చూస్తారు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.

  5. బబులోను నదుల దగ్గర మనం కూర్చుని సీయోను పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాము.

  6. దాని మధ్యన ఉన్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించాము.

  7. మనల్ని పట్టుకున్నవారు పాటలు పాడమని మనల్ని అడిగారు, మనల్ని బాధించినవారు సంతోష గానాలు కోరారు; “సీయోను పాటల్లో ఒకటి పాడండి” అని అన్నారు.

  8. పరాయి దేశంలో ఉండగా యెహోవా పాటలు మనం ఎలా పాడగలము?

  9. యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే, నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి.

  10. నేను నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే, యెరూషలేము నాకు ఎక్కువ సంతోషం కలిగించేది అని నేను భావించకపోతే నా నాలుక నా అంగిలికి అంటుకుపోవాలి.

  11. సీయోను నీతి ఉదయకాంతిలా ప్రకాశించే వరకు, దాని రక్షణ కాగడాలా వెలిగే వరకు, సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను. యెరూషలేము పక్షంగా నేను ఊరుకోలేను.

  12. నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు వారు కట్టు కడతారు. సమాధానం లేనప్పుడు, “సమాధానం, సమాధానం” అని వారంటారు.

  13. నా ప్రజలు నలిగిపోయారు కాబట్టి, నేనూ నలిగిపోయాను; నేను దుఃఖిస్తున్నాను, భయం నన్ను పట్టుకుంటుంది.

  14. గిలాదులో ఔషధతైలం లేదా? అక్కడ వైద్యుడు లేడా? ఉంటే నా ప్రజల గాయానికి స్వస్థత ఎందుకు లేదు?

  15. అయ్యో, నా తల నీటి బావి నా కళ్లు కన్నీటి ఊట అయి ఉంటే బాగుండేది! చంపబడిన నా ప్రజల కోసం నేను పగలు రాత్రి ఏడ్చే వాన్ని.

  16. అయ్యో, అరణ్యంలో నాకు యాత్రికులు బసచేసే స్థలం ఒకటి ఉంటే బాగుండేది! నా ప్రజలను వదిలి వారికి దూరంగా వెళ్లి అక్కడ ఉండేవాన్ని; ఎందుకంటే వారంతా వ్యభిచారులు, వారిది ఒక నమ్మకద్రోహుల సమూహము.

  17. యెహోవా, మాకు ఏమి జరిగిందో జ్ఞాపకముంచుకోండి; మా వైపు తిరిగి, మాకు కలిగిన అవమానాన్ని చూడండి.

  18. మా వారసత్వం అపరిచితులకు, మా ఇళ్ళను విదేశీయులకు అప్పగించారు.

  19. మేము తండ్రిలేని వారమయ్యాము, మా తల్లులు విధవరాండ్రు.

  20. మేము త్రాగే నీటిని మేము కొనుక్కోవలసి వస్తుంది; మేము కట్టెలు ఎక్కువ వెలపెట్టి కొనుక్కోవలసి వస్తుంది.

  21. మమ్మల్ని వెంటాడేవారు మా వెనుకే ఉన్నారు; మేము అలసిపోయాము, కాని విశ్రాంతి దొరకడం లేదు.

  22. తగినంత ఆహారం పొందేందుకు మేము ఈజిప్టు, అష్షూరు వారివైపు మేము మా చేతులు చాపాము.

  23. మా పూర్వికులు పాపం చేశారు, వారు చనిపోయారు, వారి శిక్షను మేము భరిస్తున్నాము.

  24. బానిసలు మమ్మల్ని పరిపాలిస్తున్నారు, వారి చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించేవారు ఎవరూ లేరు.

  25. ఎడారిలో ఖడ్గం కారణంగా, ప్రాణాలను పణంగా పెట్టి ఆహారం తెచ్చుకుంటున్నాము.