కంటెంట్‌కు వెళ్లండి

Patriotism గురించి బైబిల్ వచనాలు

63 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆకలికి జ్వరంగా ఉండి, మా చర్మం పొయ్యిలా వేడిగా అయ్యింది.

  2. సీయోనులో స్త్రీలు, యూదా పట్టణాల్లో కన్యలు హింసించబడ్డారు.

  3. అధిపతుల చేతులు కట్టబడి, వ్రేలాడదీయబడ్డారు; పెద్దలకు గౌరవం లేదు.

  4. యువకులు తిరుగటిరాళ్ల దగ్గర కష్టపడుతున్నారు; బాలురు కట్టెల బరువు మోయలేక తూలుతున్నారు.

  5. పెద్దలు నగర ద్వారం నుండి వెళ్లిపోయారు, యువకులు తమ సంగీతాన్ని ఆపివేశారు.

  6. మా హృదయాల్లో నుండి ఆనందం వెళ్లిపోయింది, మా నాట్యం దుఃఖంగా మారింది.

  7. మా తల మీది నుండి కిరీటం పడిపోయింది, పాపం చేశాము, మాకు శ్రమ.

  8. మా హృదయాలు ధైర్యం కోల్పోయాయి, వీటిని బట్టి మా కళ్లు క్షీణిస్తున్నాయి

  9. సీయోను పర్వతం నిర్జనంగా పడి ఉంది, నక్కలు దాని మీద విహరిస్తున్నాయి.

  10. యెహోవా, ఎప్పటికీ పాలించండి; మీ సింహాసనం తరతరాలుగా ఉంటుంది.

  11. మీరు మమ్మల్ని ఎందుకు మరచిపోతారు? ఇంతకాలం వరకు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టారు?

  12. యెహోవా, మేము తిరిగి వచ్చేలా, మమ్మల్ని మీ దగ్గరకు రప్పించుకోండి; మీరు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించి,

  13. మామీద చెప్పలేనంత కోపాన్ని పెంచుకుంటే తప్ప, మా రోజులను పాత రోజుల్లా నూతనపర్చండి.