Patriotism గురించి బైబిల్ వచనాలు: General references
General references గురించి వచనాలు
మీరు మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా ఇస్తున్న దేశంలోకి ప్రవేశించినప్పుడు దానిని స్వాధీనం చేసుకుని దానిలో స్థిరపడాలి.
మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న భూమి నేల నుండి మీరు ఉత్పత్తి చేసే అన్ని ఫలాలను తీసుకుని వాటిని బుట్టలో ఉంచండి, తర్వాత మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాసంగా ఎన్నుకునే ప్రదేశానికి వెళ్లి,
ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న యాజకునికి, “మాకు ఇస్తానని యెహోవా మా పూర్వికులకు ప్రమాణం చేసిన దేశానికి నేను వచ్చానని ఈ రోజు మీ దేవుడైన యెహోవాకు ప్రకటిస్తున్నాను” అని చెప్పండి.
యాజకుడు మీ చేతుల్లో నుండి ఆ గంపను తీసుకుని మీ దేవుడైన యెహోవా బలిపీఠం ముందు క్రింద పెట్టాలి.
అప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా ఎదుట ఇలా ప్రకటించాలి: “నా తండ్రి సంచరించే అరామీయుడు, అతడు కొద్దిమంది వ్యక్తులతో ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించి, శక్తివంతమైన, అసంఖ్యాకమైన గొప్ప దేశంగా అయ్యాడు.
కాని ఈజిప్టువారు మనలను హింసించి, బాధపెట్టి, మనలను కఠినమైన శ్రమకు గురి చేశారు.
మనం మన పూర్వికుల దేవుడైన యెహోవాకు మొరపెట్టుకున్నాము. యెహోవా మన మొర విని, మన బాధ, ప్రయాస, మనకు కలిగిన హింసను చూశారు.
యెహోవా తన బలమైన హస్తంతో చేయి చాపి మహా భయంకరమైన విధంగా చర్య తీసుకున్నాడు, అసాధారణ గుర్తులను, అద్భుతాలను చూపించారు.
ఈ స్థలానికి మనలను తెచ్చి పాలు తేనెలు నదులైపారే ఈ దేశాన్ని మనకిచ్చారు.
యెహోవా, మీరు నాకు ఇచ్చిన భూమిలోని మొదటి ఫలాలను ఇప్పుడు తెస్తున్నాను.” ఆ గంపను మీ దేవుడైన యెహోవా ముందు పెట్టి ఆయన ముందు నమస్కరించాలి.
నీకు మీ ఇంటివారికి మీ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మేలును బట్టి మీరూ లేవీయులు అలాగే మీ మధ్య ఉన్న విదేశీయులు కలిసి సంతోషించాలి.
మీ దయతో సీయోనుకు మంచి చేయండి; యెరూషలేము గోడలు కట్టించండి.
సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన. యెహోవా, మీ దేశానికి మీరు దయ చూపారు; యాకోబును చెర నుండి తిరిగి తీసుకువచ్చారు.
మీరు మీ ప్రజల దోషాన్ని క్షమించారు వారి పాపాలన్నీ కప్పివేశారు. సెలా
మీ ఉగ్రతను మీరు ప్రక్కన పెట్టారు మీ భయంకర కోపాగ్నిని చల్లార్చుకున్నారు.
మా రక్షకుడవైన దేవా, మమ్మల్ని మరల పునరుద్ధరించండి. మామీద ఉన్న మీ కోపాన్ని విడిచిపెట్టండి.
ఎప్పటికీ మీరు మామీద కోప్పడతారా? తరతరాల వరకు మామీద మీరు కోప్పడుతూనే ఉంటారా?
మీ ప్రజలు మీలో ఆనందించేలా మీరు మమ్మల్ని మరల బ్రతికించరా?
యెహోవా, మీ మారని ప్రేమను మా పట్ల చూపించండి, మీ రక్షణ మాకు అనుగ్రహించండి.
దేవుడైన యెహోవా చెప్తున్నదంతా నేను ఆలకిస్తాను; ఆయన తన ప్రజలకు, నమ్మకమైన దాసులకు సమాధానాన్ని వాగ్దానం చేస్తారు; అయితే వారు బుద్ధిహీనత వైపు తిరుగకుందురు గాక.
మన దేశంలో ఆయన మహిమ నివసించేలా, ఆయనకు భయపడేవారికి ఆయన రక్షణ ఎంతో సమీపంగా ఉంటుంది.
మారని ప్రేమ నమ్మకత్వం కలుసుకుంటాయి; నీతి సమాధానం పరస్పరం ముద్దు పెట్టుకుంటాయి.
నమ్మకత్వం భూమిలో నుండి మొలుస్తుంది, నీతి ఆకాశం నుండి తొంగి చూస్తుంది.
యెహోవా మేలైనది అనుగ్రహిస్తారు, మన భూమి తన పంటనిస్తుంది.
ఆయనకు ముందుగా నీతి వెళ్తూ ఆయన అడుగు జాడలకు మార్గం సిద్ధం చేస్తుంది.