కంటెంట్‌కు వెళ్లండి

Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు

759 వచనాలు · 177 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. హెర్మోనును సీదోనీయులు షిర్యోను అంటారు; అమోరీయులు శెనీరు అని పిలుస్తారు.

  2. పీఠభూమిలో ఉన్న పట్టణాలన్నిటిని, బాషానులో ఓగు రాజ్యంలోని పట్టణాలైన సలేకా ఎద్రెయీల వరకు గిలాదు అంతటిని, బాషానును అంతటిని స్వాధీనం చేసుకున్నాము.

  3. రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు చివరివాడు. అతని సమాధి ఇనుముతో చేయబడి తొమ్మిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలది. అది ఇంకా అమ్మోనీయులకు చెందిన రబ్బాలో ఉంది.

  4. ఆ సమయంలో మనం స్వాధీనం చేసుకున్న దేశాన్ని అనగా అర్నోను వాగు లోయలో ఉన్న అరోయేరు నుండి గిలాదు కొండ ప్రాంతంలోని సగభాగాన్ని దానిలో ఉన్న పట్టణాలతో కలిపి రూబేనీయులకు గాదీయులకు ఇచ్చాను.

  5. గిలాదులో మిగతా ప్రాంతాన్ని, ఓగు రాజ్యమైన బాషాను అంతటిని మనష్షే అర్ధగోత్రానికి ఇచ్చాను. బాషానులోని అర్గోబు ప్రాంతమంతా రెఫాయీయుల దేశమని పిలువబడేది.

  6. మనష్షే సంతానమైన యాయీరు అర్గోబు ప్రాంతమంతా గెషూరీయుల మయకాతీయుల సరిహద్దుల వరకు స్వాధీనపరచుకున్నాడు. దానికి అతని పేరు పెట్టబడింది కాబట్టి నేటికీ బాషాను హవ్వోత్ యాయీరు అని పిలుస్తారు.

  7. గిలాదును మాకీరుకు ఇచ్చాను.

  8. అయితే రూబేనీయులకు, గాదీయులకు గిలాదు నుండి అర్నోను వాగు లోయ మధ్య వరకు, యబ్బోకు నది వరకు, అమ్మోనీయుల సరిహద్దు వరకు నేను ఇచ్చాను.

  9. దాని పశ్చిమ సరిహద్దు కిన్నెరెతు నుండి పిస్గా కొండచరియల తూర్పున, మృత సముద్రమనే అరాబా సముద్రం వరకు వ్యాపించి ఉన్న అరాబాలోని యొర్దాను నది.

  10. అప్పుడు యెహోవా నాతో అన్నారు, “నీవు మొదటి పలకలవంటి మరో రెండు రాతిపలకలను చెక్కి పర్వతమెక్కి నా దగ్గరకు రా. అలాగే ఒక కర్ర మందసాన్ని తయారుచేయు.

  11. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే నేను వాటిపై వ్రాస్తాను. తర్వాత నీవు వాటిని ఆ మందసంలో ఉంచాలి.”

  12. కాబట్టి నేను తుమ్మకర్రతో మందసం చేసి, మొదటి వాటిలా రెండు రాతిపలకలను చెక్కి, నా చేతులతో ఆ రెండు రాతిపలకలు పట్టుకుని నేను పైకి వెళ్లాను.

  13. సమావేశమైన రోజున, పర్వతం మీద, అగ్ని మధ్యలో నుండి మీకు ప్రకటించిన పది ఆజ్ఞలను మొదట వ్రాసినట్లుగానే, యెహోవా ఆ పలకల మీద వ్రాశారు. యెహోవా వాటిని నాకు ఇచ్చారు.

  14. తర్వాత నేను పర్వతం దిగివచ్చి, యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారం, నేను చేసిన మందసంలో ఆ పలకలను ఉంచాను. ఇప్పుడవి దానిలో ఉన్నాయి.

  15. తర్వాత మోషే మోయాబు సమతల మైదానాల నుండి వెళ్లి యెరికో ఎదురుగా ఉన్న పిస్గా పర్వత శిఖరం వరకు వెళ్లి నెబో పర్వతమెక్కాడు. అక్కడ యెహోవా అతనికి గిలాదు నుండి దాను వరకు ఉన్న దేశాన్నంతా చూపించారు,

  16. నఫ్తాలి ప్రాంతమంతటిని, ఎఫ్రాయిం మనష్షేల ప్రాంతాలను, పశ్చిమదిక్కున ఉన్న మధ్యధరా సముద్రం వరకు ఉన్న యూదా ప్రాంతాన్ని,

  17. దక్షిణ ప్రాంతాన్ని, ఖర్జూర చెట్ల పట్టణమైన యెరికో లోయ నుండి సోయరు వరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని అతనికి చూపించారు.

  18. అప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నారు, “నేను మీ సంతానానికి ఇస్తానని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన దేశం ఇదే. కళ్ళారా నిన్ను దాన్ని చూడనిస్తున్నాను కాని, నది దాటి నీవు అక్కడికి వెళ్లవు.”

  19. మా పూర్వికులు ఈజిప్టులో ఉన్నప్పుడు నేను చేసిన అద్భుతాలను గ్రహించలేదు; మీ దయాసమృద్ధిని వారు తలపోయ లేదు, ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేశారు.

  20. అయినా ఆయన తన బలప్రభావాలను తెలియపరచడానికి, తన పేరు కోసం వారిని రక్షించాడు.

  21. ఎర్ర సముద్రాన్ని గద్దించాడు. అది ఎండిపోయింది; ఎడారిలో నడిచినట్లే జలాగాధంలో వారు నడిచారు. దేవుడు వారిని నడిపించాడు.

  22. పగవారి బారి నుండి దేవుడే వారిని తప్పించాడు; విడుదల ప్రసాదించాడు.

  23. విరోధులంతా నీటిలో మునిగి చచ్చారు. ఒక్కడూ మిగల్లేదు.

  24. ఇశ్రాయేలీయులు అప్పుడు కాని దేవుని మాట నమ్మలేదు. స్తుతిస్తూ పాటలు పాడారు.

  25. దేవుని క్రియలు వారు త్వరలోనే మరచిపోయారు. ఆయన సలహాలను వారు లక్ష్యపెట్టు వారు కారు.