కంటెంట్‌కు వెళ్లండి

Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు: Third numbering

62 వచనాలు · 177 కోణాలు

Third numbering గురించి వచనాలు

  1. తెగులు అంతరించిన తర్వాత, యెహోవా మోషేతో యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుతో అన్నారు,

  2. “ఇశ్రాయేలు సమాజమంతటిని ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు ఉండి ఇశ్రాయేలు సైన్యంలో సేవ చేయగలవారిని కుటుంబాల ప్రకారం లెక్కించాలి.”

  3. కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు, యెరికో నుండి యొర్దాను వైపు ఉన్న మోయాబు సమతల మైదానాల్లో ఇశ్రాయేలీయుల నాయకులతో మాట్లాడుతూ,

  4. “యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉన్న పురుషులను లెక్కించండి” అని చెప్పారు.

  5. ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన, రూబేను వారసులు: హనోకు ద్వార, హనోకీయుల వంశం; పల్లు ద్వార, పల్లువీయుల వంశం;

  6. హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; కర్మీ ద్వార, కర్మీయుల వంశము.

  7. ఇవి రూబేను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 43,730.

  8. పల్లు కుమారుడు ఏలీయాబు,

  9. ఏలీయాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. ఈ దాతాను, అబీరాములే మోషే అహరోనులకు ఎదురు తిరిగినవారు, కోరహు అనుచరులు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వారి మధ్య ఉన్న అధికారులు.

  10. భూమి నోరు తెరచుకొని కోరహుతో పాటు వారిని మ్రింగివేసింది, అతని అనుచరులు 250 మంది మంటలో హతమయ్యారు. వారు హెచ్చరిక గుర్తుగా ఉన్నారు.

  11. అయితే, ఆ రోజున కోరహు కుమారులు చనిపోలేదు.

  12. షిమ్యోను వారసులు వారి వంశాల ప్రకారం: నెమూయేలు ద్వార, నెమూయేలీయుల వంశం; యామీను ద్వార, యామీనీయుల వంశం; యాకీను ద్వార, యాకీనీయుల వంశం;

  13. జెరహు ద్వార, జెరహీయుల వంశం; షావూలు ద్వార, షావూలీయుల వంశము.

  14. ఇవి షిమ్యోను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 22,200.

  15. గాదు యొక్క వారసులు వారి వంశాల ప్రకారం: సెఫోను ద్వార, సెఫోనీయుల వంశం; హగ్గీ ద్వార, హగ్గీయుల వంశం; షూనీ ద్వార, షూనీయుల వంశం;

  16. ఓజ్ని ద్వార, ఓజ్నీయుల వంశం; ఏరీ ద్వార, ఏరీయుల వంశం;

  17. అరోదు ద్వార, అరోదీయుల వంశం; అరేలీ ద్వార, అరేలీయుల వంశము.

  18. ఇవి గాదు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 40,500.

  19. యూదా కుమారులు ఏరు ఓనాను, కానీ వారు కనాను దేశంలో చనిపోయారు.

  20. యూదా వారసులు వారి వంశాల ప్రకారం: షేలా ద్వార, షేలాహీయుల వంశం; పెరెసు ద్వార, పెరెజీయుల వంశం; జెరహు ద్వార, జెరహీయుల వంశము.

  21. పెరెసు యొక్క వారసులు: హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; హామూలు ద్వార, హామూలీయుల వంశము.

  22. ఇవి యూదా వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 76,500.

  23. ఇశ్శాఖారు వారసులు వారి వంశాల ప్రకారం: తోలా ద్వార, తోలాహీయుల వంశం; పువా ద్వార, పువీయుల వంశం;

  24. యాషూబు ద్వార, యాషూబీయుల వంశం; షిమ్రోను ద్వార, షిమ్రోనీయుల వంశము.

  25. ఇవి ఇశ్శాఖారు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,300.