కంటెంట్‌కు వెళ్లండి

Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు: Flesh promised

12 వచనాలు · 177 కోణాలు

"Journey of Israel Through The Desert" కోసం వెతకండి

Flesh promised గురించి వచనాలు

  1. మోషే ప్రతి కుటుంబంలోని ప్రజలు వారి డేరాల దగ్గర ఏడుస్తూ ఉండడం విన్నాడు. యెహోవా చాలా కోప్పడ్డారు మోషే బాధపడ్డాడు.

  2. మోషే యెహోవాతో, “మీ సేవకునిపై ఈ కష్టం ఎందుకు తెచ్చారు? వీరందరి భారం నా మీద వేయకుండ మీ దృష్టిలో నేనెందుకు దయను పొందలేకపోయాను?

  3. వీరందరిని నేను గర్భందాల్చానా? నేను వీరిని కన్నానా? దాది శిశువును ఎత్తుకున్నట్లు, మీ పూర్వికులకు మీరు ప్రమాణం వాగ్దానం చేసిన స్థలానికి నడిపించడానికి వీరిని నా చేతిలో ఎందుకు మోయమన్నారు?

  4. వీరందరి కోసం మాంసం ఎక్కడ నుండి తేవాలి? నన్ను చూసి, ‘మాకు తినడానికి మాంసం ఇవ్వు!’ అంటూ ఏడుస్తున్నారు.

  5. నా అంతట నేను ఈ ప్రజలందరినీ మోయలేను; భారం నాకు చాల భారీగా ఉంది.

  6. ఒకవేళ నాతో మీరు ఇలా వ్యవహరించ తలిస్తే దయచేసి నన్ను చంపేయండి; నా మీద మీకు దయ కలిగితే నా దురవస్థను నేను చూడకుండ నన్ను చంపేయండి” అని చెప్పాడు.

  7. “నీవు ప్రజలకు ఇలా చెప్పు: ‘రేపటి కోసం మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి, రేపు మీరు మాంసం తినబోతున్నారు. మీరు, “మాకు మాంసం మాత్రం ఉంటే బాగుండేది! ఈజిప్టులో మాకు బాగుండేది!” అని ఏడ్వడం యెహోవా విన్నారు కాబట్టి యెహోవా మీకు మాంసం ఇస్తారు, మీరు తింటారు.

  8. దానిని మీరు తినడం ఒక రోజు కాదు, రెండు రోజులు, అయిదు రోజులు, పది రోజులు, యిరవై రోజులు కాదు,

  9. ఒక నెలంతా మీ నాసికా రంధ్రాల నుండి బయటకు వచ్చి మీరు అసహ్యించుకునే వరకు తింటారు; ఎందుకంటే మీరు మీ మధ్య ఉన్న యెహోవాను నిరాకరించి, “మేము అసలు ఈజిప్టును ఎందుకు విడిచిపెట్టామో?” అంటూ ఆయన ఎదుట ఏడ్చారు.’ ”

  10. అయితే మోషే, “నేను ఆరు లక్షలమంది పాదాచారుల మధ్య ఉన్నాను, మీరేమో, ‘నేను వారికి నెలరోజులు తినడానికి సరిపడే మాంసం ఇస్తాను!’ అని అన్నారు.

  11. ఉన్న పశువులు, మందలు అన్నిటిని వధించినా వీరికి సరిపోతుందా? సముద్రంలో చేపలన్నీ పట్టినా వీరికి సరిపోతాయా?”

  12. యెహోవా మోషేకు జవాబిస్తూ, “యెహోవా బాహుబలం తక్కువయ్యిందా? నేను చెప్పింది జరుగుతుందో లేదో నీవు చూస్తావు” అని అన్నారు.