Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు: Passover first commemorated
Passover first commemorated గురించి వచనాలు
ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం మొదటి నెలలో సీనాయి అరణ్యంలో యెహోవా మోషేతో మాట్లాడారు. ఆయన ఇలా చెప్పారు,
“ఇశ్రాయేలీయులు నిర్ణీత సమయంలో పస్కా పండుగ జరుపుకోవాలి.
దాని నిర్ణీత సమయంలో అనగా, ఈ నెల పద్నాలుగవ రోజు సాయంకాల సమయంలో, నియమ నిబంధనలతో ఈ పండుగ జరుపుకోవాలి.”
కాబట్టి మోషే పస్కాను జరుపుకోమని ఇశ్రాయేలీయులకు చెప్పాడు,
వారంతా అదే విధంగా మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంకాలం సీనాయి అరణ్యంలో పస్కాను జరుపుకుంటారు. ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశారు.