కంటెంట్‌కు వెళ్లండి

Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు: Murmuring of the mixed multitude and of Israel, for flesh

6 వచనాలు · 177 కోణాలు

Murmuring of the mixed multitude and of Israel, for flesh గురించి వచనాలు

  1. వారితో ఉన్న అల్లరి గుంపు వేరే ఆహారం ఆశించడం ప్రారంభించారు, అప్పుడు మళ్ళీ ఇశ్రాయేలీయులు ఏడ్వడం మొదలుపెట్టి, “మనకు తినడానికి మాంసం మాత్రం ఉంటే ఎంత బాగుండేది!

  2. ఈజిప్టులో చేపలు, దోసకాయలు, పుచ్చకాయలు, ఒక రకమైన ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, వెల్లుల్లిపాయలు ఉచితంగా తిన్నాము.

  3. కానీ ఇప్పుడు మాకు తిండి మీద ఇష్టం లేకుండ పోయింది; ఈ మన్నా తప్ప మాకేమి కనిపించడం లేదు!” అని అన్నారు.

  4. మన్నా కొత్తిమెర గింజల్లా ఉండి గుగ్గిలంలా కనబడుతుంది.

  5. ప్రజలు బయటకు వెళ్లి, తిరుగుతూ దానిని సేకరించుకొని, దానిని తిరగలితో విసరేవారు లేదా రోటిలో దంచేవారు. కుండలో దానిని ఉడకబెట్టి దానితో రొట్టెలు చేసుకునేవారు. దాని రుచి నూనెతో చేసిన అప్పడంలా ఉంటుంది.

  6. రాత్రివేళ శిబిరంలో మంచు కురిసినప్పుడు మన్నా దాని వెంటనే పడేది.