కంటెంట్‌కు వెళ్లండి

Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు: Second numbering of the people

46 వచనాలు · 177 కోణాలు

"Journey of Israel Through The Desert" కోసం వెతకండి

Second numbering of the people గురించి వచనాలు

  1. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెల మొదటి రోజు సీనాయి ఎడారిలో ఉన్న సమావేశ గుడారంలో యెహోవా మోషేతో మాట్లాడారు. ఆయన ఇలా అన్నారు:

  2. మొత్తం సమాజంలోని ఇశ్రాయేలీయుల వంశాలు కుటుంబాల ప్రకారం వారి జనాభా లెక్కలు నమోదు చేయి.

  3. నీవూ అహరోను కలిసి ఇశ్రాయేలీయులలో ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు గలవారు, సైన్యంలో సేవ చేయగలవారిని వారి వారి సేనల ప్రకారం లెక్కించాలి.

  4. ప్రతీ గోత్రం నుండి ఒకడు తన కుటుంబానికి పెద్దగా ఉన్న ప్రతీ ఒకడు మీకు సహాయం చేయాలి.

  5. “మీకు సహాయం చేయాల్సిన పురుషుల పేర్లు ఇవి: “రూబేను గోత్రం నుండి షెదేయూరు కుమారుడైన ఎలీసూరు;

  6. షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు;

  7. యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను;

  8. ఇశ్శాఖారు గోత్రం నుండి సూయరు కుమారుడైన నెతనేలు;

  9. జెబూలూను గోత్రం నుండి హేలోను కుమారుడైన ఏలీయాబు;

  10. యోసేపు కుమారుల నుండి: ఎఫ్రాయిం గోత్రం నుండి అమీహూదు కుమారుడైన ఎలీషామా; మనష్షే గోత్రం నుండి పెదాసూరు కుమారుడైన గమలీయేలు;

  11. బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కుమారుడైన అబీదాను;

  12. దాను గోత్రం నుండి అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు;

  13. ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కుమారుడైన పగీయేలు;

  14. గాదు గోత్రం నుండి దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు;

  15. నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కుమారుడైన అహీర.”

  16. వీరు సమాజంలో వారి పితరుల గోత్రాల నుండి నాయకులుగా ఏర్పాటు చేయబడినవారు. వీరు ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు.

  17. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే అహరోనులు పేర్లు పేర్కొనబడిన వారిని తీసుకుని,

  18. రెండవ నెల మొదటి రోజున సమాజమంతటిని సమావేశ పరిచారు. ప్రజలు వారి వారి గోత్రాలు, వారి వారి కుటుంబాల ప్రకారం తమ వంశాన్ని నమోదు చేసుకున్నారు. యిరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సున్న వారు ఒకరి తర్వాత ఒకరి పేరు నమోదు చేశారు.

  19. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే సీనాయి ఎడారిలో వారిని లెక్కించాడు:

  20. ఇశ్రాయేలు మొదటి సంతానమైన రూబేను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి, సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.

  21. రూబేను గోత్రం నుండి లెక్కించబడినవారు 46,500.

  22. షిమ్యోను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.

  23. షిమ్యోను గోత్రం నుండి లెక్కించబడినవారు 59,300.

  24. గాదు సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.

  25. గాదు గోత్రం నుండి లెక్కించబడినవారు 45,650.