Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు: Plague sent
Plague sent గురించి వచనాలు
మరుసటిరోజు ఇశ్రాయేలు సమాజమంతా మోషే అహరోనుల మీద సణిగారు. “మీరు యెహోవా యొక్క ప్రజలను చంపేశారు” అని వారన్నారు.
మోషే అహరోనులకు వ్యతిరేకంగా సమాజం గుమికూడి, సమావేశ గుడారం వైపు చూశారు, అకస్మాత్తుగా మేఘం దానిని కప్పింది, యెహోవా మహిమ కనిపించింది.
అప్పుడు మోషే, అహరోనులు సమావేశ గుడారం ముందుకు వెళ్లారు.
యెహోవా మోషేతో,
“మీరు సమాజం మధ్య నుండి తొలగిపోండి, వెంటనే వారిని చంపేస్తాను” అన్నారు. అప్పుడు వారు సాష్టాంగపడ్డారు.
అప్పుడు మోషే అహరోనుతో, “నీ ధూపార్తిని తీసుకుని దానిలో ధూపం వేసి, బలిపీఠం నుండి మండుతున్న బొగ్గును తీసుకుని వారికి ప్రాయశ్చిత్తం చేయడానికి సమాజం దగ్గరకు త్వరగా వెళ్లు. యెహోవా నుండి కోపం రగులుతూ వస్తుంది; తెగులు ప్రారంభమైంది” అన్నాడు.