కంటెంట్‌కు వెళ్లండి

Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు: Worship of God celebrated during

15 వచనాలు · 177 కోణాలు

Worship of God celebrated during గురించి వచనాలు

  1. అతడు ఇశ్రాయేలీయులలో యువకులను పంపగా వారు దహనబలులు అర్పించి, యెహోవాకు సమాధానబలులుగా ఎద్దులను వధించారు.

  2. మోషే వాటి రక్తంలో సగం తీసుకుని గిన్నెల్లో పోసి మిగతా సగం బలిపీఠం మీద చల్లాడు.

  3. తర్వాత అతడు ఒడంబడిక గ్రంథాన్ని తీసుకుని ప్రజలకు చదివి వినిపించాడు. అప్పుడు వారు, “యెహోవా ఆజ్ఞాపించినవన్నీ మేము చేస్తాము; వాటికి లోబడి ఉంటాం” అని చెప్పారు.

  4. అప్పుడు మోషే రక్తాన్ని తీసుకుని ప్రజలపై చిలకరించి, “ఈ మాటలన్నిటి ప్రకారం యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే” అన్నాడు.

  5. “నీవు క్రమం తప్పకుండా ప్రతిరోజు బలిపీఠం మీద ఏడాది గొర్రెపిల్లలు రెండు అర్పించాలి.

  6. ఒక గొర్రెపిల్లను ఉదయాన, మరొకదాన్ని సూర్యాస్తమయ వేళ అర్పించాలి.

  7. దంచి తీసిన ఒక పావు హిన్ ఒలీవనూనెతో కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని, ఒక పావు హిన్ ద్రాక్షారసాన్ని పానార్పణగా మొదటి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి.

  8. సాయంకాలం మరొక గొర్రెపిల్లతో కలిపి ఉదయకాలం అర్పించినట్లే భోజనార్పణ, పానార్పణ అర్పించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.

  9. “యెహోవా ఎదుట సమావేశ గుడారపు ద్వారం దగ్గర రాబోయే తరాలన్ని క్రమంగా నిత్యం ఈ దహనబలిని అర్పించాలి. అక్కడే నేను మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడతాను.

  10. అతడు సమావేశ గుడారంలో బల్లకు ఎదురుగా సమావేశ గుడారానికి దక్షిణ వైపు దీపస్తంభాన్ని ఉంచి,

  11. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఎదుట దీపాలు వెలిగించాడు.

  12. మోషే సమావేశ గుడారంలో తెర ఎదుట బంగారు ధూపవేదిక ఉంచి,

  13. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, పరిమళ వాసనగల ధూపాన్ని దాని మీద కాల్చాడు.

  14. తర్వాత అతడు సమావేశ గుడారపు ప్రవేశ ద్వారానికి తెర వేశాడు.

  15. సమావేశ గుడారపు ద్వారానికి సమీపంగా దహనబలిపీఠాన్ని ఉంచి దాని మీద దహనబలి అర్పించి భోజనార్పణను సమర్పించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే ఇది చేశాడు.