కంటెంట్‌కు వెళ్లండి

Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు

759 వచనాలు · 177 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు తమ దుష్ట క్రియల చేత అపవిత్రులయ్యారు; విగ్రహాల మీద వారికి గల ప్రేమ యెహోవా దృష్టిలో వ్యభిచారము చేశారు.

  2. చాలాసార్లు ఆయన విడిపించాడు, అయినా వారి తిరుగుబాటు ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. తిరగబడి, అపరాధులై, దురవస్థ చెందారు.

  3. అయినా వారు మొరపెట్టగానే ఆయన విన్నాడు. వారి కష్టంను చూచాడు.

  4. దేవుడు తన నిబంధనను తలచుకొన్నాడు. వారి నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాడు. తన మారని ప్రేమను బట్టి వారిని కనికరించాడు.

  5. చెరపట్టిన వారికి వీరి మీద జాలి కలిగింది. అది దైవనిర్ణయమే.

  6. అప్పుడు ఆయన ప్రజలు పూర్వ రోజులను, మోషేను తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నారు తన మందకాపరులతో పాటు తమను సముద్రంలో నుండి తీసుకువచ్చిన ఆయనేరి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన ఆయనేరి?

  7. మోషే కుడిచేతి వైపు మహిమగల తన చేతిని పంపిన ఆయనేరి? తనకు శాశ్వతమైన కీర్తి రాడానికి వారి ఎదుట నీళ్లను విభజించిన ఆయనేరి?

  8. మైదానంలో గుర్రం నడిచినట్లు వారు పడిపోకుండా లోతైన జలాల్లో నడిపించిన ఆయనేరి?

  9. లోయలోనికి దిగివెళ్లే పశువుల్లా యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసింది. మీకు ఘనమైన పేరు రావాలని మీరు మీ ప్రజలను ఇలా నడిపించారు.