Skip to content

Ammonites గురించి బైబిల్ వచనాలు

135 వచనాలు · 11 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అందుకు యాబేషు పెద్దలు అతనితో, “మేము ఇశ్రాయేలు అంతటా రాయబారులను పంపడానికి మాకు ఏడు రోజుల సమయం ఇవ్వు; మమ్మల్ని రక్షించడానికి ఎవరూ రాకపోతే మేము నీకు లొంగిపోతాము” అన్నారు.

  2. రాయబారులు సౌలు ఉంటున్న గిబియాకు వచ్చి ఆ షరతు గురించి ప్రజలకు తెలియజేసినప్పుడు వారందరు గట్టిగా ఏడ్చారు.

  3. సౌలు పొలం నుండి పశువులను తోలుకొని వస్తూ, “ప్రజలందరికి ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తున్నారు?” అని అడిగినప్పుడు, వారు యాబేషు నుండి వచ్చిన వ్యక్తి తెచ్చిన వార్తను అతనికి చెప్పారు.

  4. సౌలు ఆ వార్త వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలంగా వచ్చింది. అతడు కోపంతో మండిపడ్డాడు.

  5. ఒక జత ఎడ్లను తీసుకుని వాటిని ముక్కలుగా చేసి ఇశ్రాయేలు దేశమంతటికి రాయబారులచేత వాటిని పంపి, “సౌలుతోను సమూయేలుతోను చేరకుండ ఉండే ప్రతిఒక్కరి ఎడ్లు ఇలాగే చేయబడతాయి” అని ప్రకటించాడు. అప్పుడు ప్రజలందరిలో యెహోవా భయం కలిగింది కాబట్టి అందరు ఒక్కటిగా కలసివచ్చారు.

  6. సౌలు బెజెకులో వారిని లెక్కపెట్టినప్పుడు మూడు లక్షలమంది ఇశ్రాయేలీయులు, ముప్పైవేలమంది యూదా వారు ఉన్నారు.

  7. అప్పుడు వారు, “రేపు సూర్యుడు వేడెక్కే సమయానికి మీరు రక్షించబడతారు” అని వచ్చిన రాయబారులతో చెప్పారు. ఆ రాయబారులు వెళ్లి యాబేషు గిలాదు వారికి ఈ వార్త తెలియజేసినప్పుడు వారు సంతోషించారు.

  8. కాబట్టి యాబేషు వారు అమ్మోనీయులతో, “రేపు మేము నీకు లొంగిపోతాము, నీవు ఏమి చేయాలనుకుంటున్నావో అది మాకు చేయవచ్చు” అన్నారు.

  9. తర్వాత రోజు సౌలు తన ప్రజలను మూడు గుంపులుగా చేసిన తర్వాత వారు తెల్లవారే సమయాన అమ్మోనీయుల శిబిరంలోనికి చొచ్చుకొని వెళ్లారు. ఆ రోజు సూర్యుడు వేడెక్కే సమయానికి వారందరిని హతం చేశాడు. ప్రాణాలతో బయటపడిన వారు చెల్లాచెదురుగా ఉన్నారు, తద్వారా వారిలో ఇద్దరు కలిసి మిగిలిపోలేదు.

  10. అప్పుడు ప్రజలు సమూయేలుతో, “సౌలు మనలను పరిపాలిస్తాడా అని అడిగిన వారేరి? మేము వారిని చంపడానికి వారిని తీసుకురండి” అన్నారు.

  11. అయితే సౌలు, “ఈ రోజు యెహోవా ఇశ్రాయేలీయులను రక్షించారు కాబట్టి ఈ రోజు ఎవరిని చంపవద్దు” అన్నాడు.

  12. అప్పుడు సమూయేలు ప్రజలతో, “మనం గిల్గాలుకు వెళ్లి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా ఏర్పరచుకుందాము” అన్నాడు.

  13. కాబట్టి ప్రజలందరు గిల్గాలుకు వచ్చి యెహోవా సన్నిధిలో సౌలును రాజుగా చేసి అక్కడ యెహోవా ఎదుట వారు సమాధానబలులు అర్పించారు. సౌలు ఇశ్రాయేలీయులందరు ఎంతో సంతోషించారు.

  14. ఇంతలో యోవాబు అమ్మోనీయుల పట్టణమైన రబ్బామీద యుద్ధం చేసి రాజభవనాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

  15. యోవాబు దూతల ద్వార ఈ వార్త దావీదుకు పంపిస్తూ, “నేను రబ్బామీద యుద్ధం చేసి ఆ పట్టణపు నీళ్ల సరఫరాను స్వాధీనం చేసుకున్నాను.

  16. ఇప్పుడు నీవు మిగిలిన సైన్యాన్ని పంపి పట్టణాన్ని ముట్టడించి దానిని స్వాధీనం చేసుకో. లేకపోతే నేను ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాను అప్పుడు దానికి నా పేరు పెట్టబడుతుంది” అని కబురు పంపాడు.

  17. కాబట్టి దావీదు సైన్యాన్నంతా తీసుకుని రబ్బాకు వెళ్లి దానిపై దాడిచేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు.

  18. దావీదు వారి రాజు తలమీద నుండి కిరీటాన్ని తీసి తన తలమీద పెట్టుకున్నాడు. అది ఒక తలాంతు బరువు కలిగి ఉండి, ప్రశస్తమైన రాళ్లతో పొదిగించబడి ఉంది. దావీదు ఆ పట్టణం నుండి పెద్ద మొత్తంలో దోపుడుసొమ్ము తీసుకెళ్లాడు.

  19. అక్కడి ప్రజలను బయటకు తీసుకువచ్చి రంపతో, పదునైన ఇనుప పనిముట్లతో, గొడ్డళ్ళతో కఠినమైన పని చేయించాడు. ఇటుక బట్టీలలో వారితో పని చేయించాడు. దావీదు అమ్మోనీయుల పట్టణాలన్నిటికి ఈ విధంగా చేశాడు. తర్వాత అతడు అతని సైన్యమంతా యెరూషలేముకు తిరిగి వచ్చారు.

  20. వసంతకాలంలో, రాజులు యుద్ధానికి బయలుదేరే కాలంలో, యోవాబు సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. అతడు అమ్మోనీయుల దేశాన్ని నాశనం చేసి రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. అయితే దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు. యోవాబు రబ్బాపై దాడి చేసి దానిని నాశనం చేశాడు.

  21. దావీదు వారి రాజు తలమీద నుండి కిరీటాన్ని తీసుకున్నాడు, అది ఒక తలాంతు బరువు కలిగి ఉండి, ప్రశస్తమైన రాళ్లతో పొదిగించబడి ఉంది. దాన్ని దావీదు తలమీద పెట్టుకున్నాడు. అతడు ఆ పట్టణం నుండి పెద్ద మొత్తంలో దోపుడుసొమ్ము తీసుకెళ్లాడు.

  22. అక్కడి ప్రజలను బయటకు తీసుకువచ్చి రంపతో, పదునైన ఇనుప పనిముట్లతో, గొడ్డళ్ళతో కఠినమైన పని చేయించాడు. దావీదు అమ్మోనీయుల పట్టణాలన్నిటికి ఈ విధంగా చేశాడు. తర్వాత దావీదు అతని సైన్యమంతా యెరూషలేముకు తిరిగి వచ్చారు.

  23. ఫిలిష్తీయులతో గూర్-బయలులో ఉన్న అరబీయులతో మెయునీయులతో యుద్ధం చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశారు.

  24. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్ను చెల్లించేవారు. అతడు చాలా శక్తివంతంగా అభివృద్ధి చెందాడు కాబట్టి, అతని గొప్పతనం ఈజిప్టు సరిహద్దు వరకు వ్యాపించింది.

  25. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి నిలబడి వారితో, “మీరు నమ్మకద్రోహులుగా ఉన్నారు; పరాయి స్త్రీలను పెళ్ళి చేసుకుని ఇశ్రాయేలీయుల దోషాన్ని ఇంకా ఎక్కువ చేశారు.