Skip to content

Jabesh

8 verses

32.3700, 35.6100 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Jabesh ను ప్రస్తావించే వచనాలు

  1. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్-గిలాదును ముట్టడించినప్పుడు యాబేషు వారందరు అతనితో, “మాతో ఒప్పందం చేసుకో, మేము నీకు సేవకులమై ఉంటాము” అన్నారు.

  2. అందుకు యాబేషు పెద్దలు అతనితో, “మేము ఇశ్రాయేలు అంతటా రాయబారులను పంపడానికి మాకు ఏడు రోజుల సమయం ఇవ్వు; మమ్మల్ని రక్షించడానికి ఎవరూ రాకపోతే మేము నీకు లొంగిపోతాము” అన్నారు.

  3. సౌలు పొలం నుండి పశువులను తోలుకొని వస్తూ, “ప్రజలందరికి ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తున్నారు?” అని అడిగినప్పుడు, వారు యాబేషు నుండి వచ్చిన వ్యక్తి తెచ్చిన వార్తను అతనికి చెప్పారు.

  4. అప్పుడు వారు, “రేపు సూర్యుడు వేడెక్కే సమయానికి మీరు రక్షించబడతారు” అని వచ్చిన రాయబారులతో చెప్పారు. ఆ రాయబారులు వెళ్లి యాబేషు గిలాదు వారికి ఈ వార్త తెలియజేసినప్పుడు వారు సంతోషించారు.

  5. కాబట్టి యాబేషు వారు అమ్మోనీయులతో, “రేపు మేము నీకు లొంగిపోతాము, నీవు ఏమి చేయాలనుకుంటున్నావో అది మాకు చేయవచ్చు” అన్నారు.

  6. వారి బలశాలులంతా లేచి బేత్-షాను వరకు రాత్రంతా నడిచి వెళ్లి సౌలు శవాన్ని అతని కుమారుల శవాలను బేత్-షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషుకు తీసుకువచ్చి వారిని దహనం చేశారు.

  7. తర్వాత వారి ఎముకలు తీసుకుని యాబేషులోని పిచుల వృక్షం క్రింద పాతిపెట్టి ఏడు రోజులు ఉపవాసమున్నారు.

  8. వారి బలశాలులంతా వెళ్లి సౌలు శవాన్ని, అతని కుమారుల శవాలను యాబేషుకు తీసుకువచ్చి వారి ఎముకలు తీసుకుని యాబేషులోని సింధూర వృక్షం క్రింద పాతిపెట్టి, ఏడు రోజులు ఉపవాసమున్నారు.