Skip to content

Jabesh-Gilead గురించి బైబిల్ వచనాలు

27 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తర్వాత వారు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని గోత్రమేది?” అని అడిగారు. చివరకు యాబేషు గిలాదు నుండి ఎవ్వరూ సమావేశానికి రాలేదని తెలుసుకున్నారు.

  2. ప్రజలందరినీ లెక్కపెట్టినప్పుడు, యాబేషు గిలాదు నుండి ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు.

  3. అప్పుడు సమాజం పన్నెండువేలమంది యుద్ధవీరులను యాబేషు గిలాదుకు పంపతూ, అక్కడికి వెళ్లి అక్కడి వారినందరిని, స్త్రీలు పిల్లలతో సహితం ఖడ్గంతో చంపాలని ఆదేశించారు.

  4. వారు, “మీరు ఏం చేయాలంటే, ప్రతి పురుషుని, కన్య కాని ప్రతి స్త్రీని నాశనం చేయండి” అని వారు అన్నారు.

  5. వారు అక్కడ యాబేషు గిలాదు ప్రజల్లో పురుషులతో పడుకోని నాలుగువందలమంది యువతులను కనుగొన్నారు, వారిని కనానులోని షిలోహు దగ్గర ఉన్న శిబిరానికి తీసుకెళ్లారు.

  6. అప్పుడు సమాజమంతా రిమ్మోను బండ దగ్గర ఉన్న బెన్యామీనీయులతో సమాధానపడదాం అని కబురు పంపారు.

  7. ఆ సమయంలో బెన్యామీనీయులు తిరిగి వచ్చారు, యాబేషు గిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చినవారిని వారికిచ్చి పెళ్ళిళ్ళు చేశారు. అయితే వారందరికీ ఆ స్త్రీలు సరిపోలేదు.

  8. యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో లోపం కలుగజేశారని ప్రజలు బెన్యామీను విషయం బాధపడ్డారు.

  9. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్-గిలాదును ముట్టడించినప్పుడు యాబేషు వారందరు అతనితో, “మాతో ఒప్పందం చేసుకో, మేము నీకు సేవకులమై ఉంటాము” అన్నారు.

  10. అయితే, “ఇశ్రాయేలీయులందరికి అవమానం కలిగేలా మీ అందరి కుడి కళ్లు పెరికివేస్తాననే ఒకే ఒక షరతు మీద మీతో ఒప్పందం చేసుకుంటాను” అని అమ్మోనీయుడైన నాహాషు జవాబిచ్చాడు.

  11. అందుకు యాబేషు పెద్దలు అతనితో, “మేము ఇశ్రాయేలు అంతటా రాయబారులను పంపడానికి మాకు ఏడు రోజుల సమయం ఇవ్వు; మమ్మల్ని రక్షించడానికి ఎవరూ రాకపోతే మేము నీకు లొంగిపోతాము” అన్నారు.

  12. రాయబారులు సౌలు ఉంటున్న గిబియాకు వచ్చి ఆ షరతు గురించి ప్రజలకు తెలియజేసినప్పుడు వారందరు గట్టిగా ఏడ్చారు.

  13. సౌలు పొలం నుండి పశువులను తోలుకొని వస్తూ, “ప్రజలందరికి ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తున్నారు?” అని అడిగినప్పుడు, వారు యాబేషు నుండి వచ్చిన వ్యక్తి తెచ్చిన వార్తను అతనికి చెప్పారు.

  14. సౌలు ఆ వార్త వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలంగా వచ్చింది. అతడు కోపంతో మండిపడ్డాడు.

  15. ఒక జత ఎడ్లను తీసుకుని వాటిని ముక్కలుగా చేసి ఇశ్రాయేలు దేశమంతటికి రాయబారులచేత వాటిని పంపి, “సౌలుతోను సమూయేలుతోను చేరకుండ ఉండే ప్రతిఒక్కరి ఎడ్లు ఇలాగే చేయబడతాయి” అని ప్రకటించాడు. అప్పుడు ప్రజలందరిలో యెహోవా భయం కలిగింది కాబట్టి అందరు ఒక్కటిగా కలసివచ్చారు.

  16. సౌలు బెజెకులో వారిని లెక్కపెట్టినప్పుడు మూడు లక్షలమంది ఇశ్రాయేలీయులు, ముప్పైవేలమంది యూదా వారు ఉన్నారు.

  17. అప్పుడు వారు, “రేపు సూర్యుడు వేడెక్కే సమయానికి మీరు రక్షించబడతారు” అని వచ్చిన రాయబారులతో చెప్పారు. ఆ రాయబారులు వెళ్లి యాబేషు గిలాదు వారికి ఈ వార్త తెలియజేసినప్పుడు వారు సంతోషించారు.

  18. కాబట్టి యాబేషు వారు అమ్మోనీయులతో, “రేపు మేము నీకు లొంగిపోతాము, నీవు ఏమి చేయాలనుకుంటున్నావో అది మాకు చేయవచ్చు” అన్నారు.

  19. తర్వాత రోజు సౌలు తన ప్రజలను మూడు గుంపులుగా చేసిన తర్వాత వారు తెల్లవారే సమయాన అమ్మోనీయుల శిబిరంలోనికి చొచ్చుకొని వెళ్లారు. ఆ రోజు సూర్యుడు వేడెక్కే సమయానికి వారందరిని హతం చేశాడు. ప్రాణాలతో బయటపడిన వారు చెల్లాచెదురుగా ఉన్నారు, తద్వారా వారిలో ఇద్దరు కలిసి మిగిలిపోలేదు.

  20. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి యాబేషు గిలాదు ప్రజలు విన్నప్పుడు,

  21. వారి బలశాలులంతా లేచి బేత్-షాను వరకు రాత్రంతా నడిచి వెళ్లి సౌలు శవాన్ని అతని కుమారుల శవాలను బేత్-షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషుకు తీసుకువచ్చి వారిని దహనం చేశారు.

  22. తర్వాత వారి ఎముకలు తీసుకుని యాబేషులోని పిచుల వృక్షం క్రింద పాతిపెట్టి ఏడు రోజులు ఉపవాసమున్నారు.

  23. దావీదు వెళ్లి యాబేషు గిలాదువారి దగ్గరి నుండి సౌలు, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తీసుకువచ్చాడు. (గిల్బోవలో ఫిలిష్తీయులు సౌలు యోనాతానులను చంపి బేత్-షాను పట్టణపు వీధుల్లో వ్రేలాడదీసినప్పుడు యాబేషు గిలాదువారు వారి మృతదేహాలను దొంగిలించారు.)

  24. దావీదు వారి దగ్గర నుండి సౌలు అతని కుమారుడైన యోనాతాను ఎముకలు తెప్పించాడు. రాజాజ్ఞ ప్రకారం ఉరితీయబడిన ఆ ఏడుగురి ఎముకలు కూడా సమకూర్చారు.

  25. సౌలు అతని కుమారుడైన యోనాతాను ఎముకలు తీసుకుని బెన్యామీనీయుల దేశంలోని సేలాలో ఉన్న సౌలు తండ్రి కీషు సమాధిలో పాతిపెట్టారు. రాజు ఆజ్ఞ ప్రకారం ప్రతిదీ వారు చేసిన తర్వాత దేశం కోసం వారు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చారు.