Jabesh-Gilead గురించి బైబిల్ వచనాలు: Saul and his sons buried at
Saul and his sons buried at గురించి వచనాలు
అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి యాబేషు గిలాదు ప్రజలు విన్నప్పుడు,
వారి బలశాలులంతా లేచి బేత్-షాను వరకు రాత్రంతా నడిచి వెళ్లి సౌలు శవాన్ని అతని కుమారుల శవాలను బేత్-షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషుకు తీసుకువచ్చి వారిని దహనం చేశారు.
తర్వాత వారి ఎముకలు తీసుకుని యాబేషులోని పిచుల వృక్షం క్రింద పాతిపెట్టి ఏడు రోజులు ఉపవాసమున్నారు.
ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి యాబేషు గిలాదు వాసులందరు విన్నప్పుడు,
వారి బలశాలులంతా వెళ్లి సౌలు శవాన్ని, అతని కుమారుల శవాలను యాబేషుకు తీసుకువచ్చి వారి ఎముకలు తీసుకుని యాబేషులోని సింధూర వృక్షం క్రింద పాతిపెట్టి, ఏడు రోజులు ఉపవాసమున్నారు.