Skip to content

The Oak Tree గురించి బైబిల్ వచనాలు

21 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. కాబట్టి వారు తమ దగ్గర ఉన్న ఇతర దేవతలను, చెవి పోగులను యాకోబుకు ఇచ్చారు, యాకోబు వాటిని షెకెము ప్రాంతంలో ఒక సింధూర వృక్షం క్రింద పాతిపెట్టాడు.

  2. ఆ తర్వాత రిబ్కా దాది, దెబోరా చనిపోయింది, బేతేలుకు దిగవ ఉన్న సింధూర వృక్షం క్రింద పాతిపెట్టబడింది. కాబట్టి ఆ వృక్షానికి అల్లోన్ బాకూత్ అని పేరు పెట్టారు.

  3. యెహోషువ ఈ విషయాలను దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో నమోదు చేసి ఒక పెద్ద రాయిని తీసుకుని దానిని యెహోవా పవిత్ర స్థలం దగ్గర సింధూర వృక్షం క్రింద ప్రతిష్ఠించాడు.

  4. యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకిచెట్టు క్రింద కూర్చున్నాడు. అక్కడ యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా ద్రాక్షగానుగ చాటున గోధుమలను దుళ్లగొడుతున్నాడు.

  5. గిద్యోను లోనికి వెళ్లి ఒక మేకపిల్లను సిద్ధపరచి, తూమెడు పిండితో పులియని రొట్టెల చేసి, మాంసాన్ని గంపలో, రసాన్ని కుండలో పెట్టుకొని తెచ్చి, మస్తకిచెట్టు క్రింద ఆయనకు అర్పించాడు.

  6. అబ్షాలోము కంచరగాడిద ఎక్కి వెళ్తూ దావీదు సైన్యానికి ఎదురయ్యాడు. ఆ కంచరగాడిద గుబురైన కొమ్మలు ఉన్న ఒక సింధూర వృక్షం క్రింది నుండి వెళ్తున్నప్పుడు అబ్షాలోము జుట్టు చెట్టు కొమ్మల్లో చిక్కుకుంది. అయితే ఆ కంచరగాడిద అలాగే ముందుకు వెళ్లిపోవడంతో అతడు గాలిలో వ్రేలాడుతూ ఉండిపోయాడు.

  7. అది చూసిన ఒకడు యోవాబు దగ్గరకు వెళ్లి, “అబ్షాలోము సింధూర వృక్షానికి వ్రేలాడుతూ ఉండడం నేను చూశాను” అని చెప్పాడు.

  8. అందుకు యోవాబు, “నీవు చేసే వరకు నేను ఇలా ఎదురుచూస్తూ ఉండను” అని చెప్పి, మూడు ఈటెలు పట్టుకుని వెళ్లి, ఇంకా ప్రాణాలతో ఆ సింధూర వృక్షానికి వ్రేలాడుతున్న అబ్షాలోము గుండెల్లోకి దిగేలా కొట్టాడు.

  9. ఆ దైవజనుని వెదుకుతూ వెళ్లాడు. అతడు సింధూర వృక్షం క్రింద కూర్చుని ఉండడం చూసి ఆ ప్రవక్త, “యూదా నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా?” అని అడిగాడు. “నేనే” అని అతడు జవాబిచ్చాడు.

  10. వారి బలశాలులంతా వెళ్లి సౌలు శవాన్ని, అతని కుమారుల శవాలను యాబేషుకు తీసుకువచ్చి వారి ఎముకలు తీసుకుని యాబేషులోని సింధూర వృక్షం క్రింద పాతిపెట్టి, ఏడు రోజులు ఉపవాసమున్నారు.

  11. “మీరు వేటిని బట్టి ఆనందించారో ఆ పవిత్ర సింధూర వృక్షాల గురించి మీరు సిగ్గుపడతారు; మీరు ఎంచుకున్న సింధూర తోటల గురించి మీరు అవమానించబడతారు.

  12. మీరు ఆకులు వాడిపోతున్న సింధూర వృక్షంలా, నీరు లేని తోటలా అవుతారు.

  13. ఎందుకంటే ఎత్తైన పొడవైన లెబానోను దేవదారు చెట్లన్నిటికి, బాషాను సింధూర వృక్షాలన్నిటికి,

  14. దానిలో పదవ భాగం మాత్రమే విడిచిపెట్టబడినా అది కూడా నాశనమవుతుంది. అయితే మస్తకి సింధూర చెట్లు నరకబడిన తర్వాత మొద్దులు ఎలా మిగులుతాయో అలాగే పరిశుద్ధ విత్తనం మొద్దులా నేలపై ఉంటుంది.”

  15. అతడు దేవదారు చెట్లను నరుకుతాడు సరళ వృక్షాన్ని గాని సింధూర వృక్షాన్ని గాని తీసుకుంటాడు. అతడు అడవి చెట్ల మధ్యలో దానిని ఎదిగేటట్లు చేస్తాడు, దేవదారు చెట్టు నాటుతాడు, వర్షం దానిని పెంచుతుంది.

  16. మీరు సింధూర వృక్షాల క్రింద పచ్చని ప్రతి చెట్టు క్రింద కామంతో రగిలిపోతున్నారు; మీరు కనుమలలో, రాతిసందుల క్రింద మీ పిల్లలను బలి ఇస్తారు.

  17. తమ విగ్రహాల మధ్య, తమ బలిపీఠాల చుట్టూరా, ఎత్తైన కొండలన్నిటి మీద, పర్వత శిఖరాలన్నిటి మీద, మహా వృక్షాల క్రింద, ఏపుగా పెరిగిన సింధూర వృక్షాలన్నిటి క్రింద ఎక్కడైతే తమ విగ్రహాలన్నిటికి పరిమళ ధూపం వేశారో అక్కడ వారి ప్రజలందరూ చచ్చి పడి ఉండడం చూసి, నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.

  18. బాషాను సింధూర చెక్కతో వారు నీ తెడ్లు తయారుచేస్తారు. కుప్ర తీరం నుండి తెచ్చిన తమాల కలపతో వారు నీకు పీటలు తయారుచేసి ఏనుగు దంతంతో అలంకరించారు.

  19. వారు పర్వత శిఖరాల మీద బలులు అర్పిస్తారు కొండలమీద ధూపం వేస్తారు, సింధూర, చినారు, మస్తకి వృక్షాల క్రింద నీడ మంచిగా ఉన్నచోట బలులు అర్పిస్తారు. కాబట్టి మీ కుమార్తెలు వేశ్యలయ్యారు మీ కోడళ్ళు వ్యభిచారిణులయ్యారు.

  20. “దేవదారు వృక్షమంత ఎత్తుగా, అయినా నేను వారి సింధూర వృక్షమంత బలంగా ఉన్న, అమోరీయులను వారి ఎదుట ఉండకుండా నేను నాశనం చేశాను. నేను పైనున్న వారి ఫలాన్ని, క్రిందున్న వారి వేరును నాశనం చేశాను.

  21. సరళ వృక్షాల్లారా, రోదించండి! దేవదారు చెట్లు కూలిపోయాయి; మహా వృక్షాలు నాశనమైపోయాయి! బాషాను యొక్క సింధూర వృక్షాల్లారా, రోదించండి: దట్టమైన అడవి నరకబడింది.