Skip to content

Joash

8 వచనాలు · 1 కుటుంబ సభ్యుడు

Joash ను ప్రస్తావించే వచనాలు

  1. యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకిచెట్టు క్రింద కూర్చున్నాడు. అక్కడ యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా ద్రాక్షగానుగ చాటున గోధుమలను దుళ్లగొడుతున్నాడు.

  2. వారు, “ఎవరు ఇది చేశారు?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. వారు జాగ్రతగా విచారణ చేసినప్పుడు, “యోవాషు కుమారుడైన గిద్యోను దానిని చేశాడు” అని వారికి తెలిసింది.

  3. నగర ప్రజలు యోవాషుతో, “నీ కుమారుడు బయలు బలిపీఠాన్ని పడగొట్టి, దాని ప్రక్కనున్న అషేరా స్తంభాన్ని పడద్రోసాడు కాబట్టి అతడు చావాలి. అతన్ని బయటకు తీసుకురా” అన్నారు.

  4. యోవాషు తన చుట్టూ చేరి గొడవ చేస్తున్న గుంపుతో, “మీరు బయలు పక్షాన ఉన్నారా? అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? వాని పక్షాన వాదించేవారు తెల్లవారక ముందే చావాలి! ఒకవేళ బయలు నిజంగా దేవుడైతే, ఎవరైనా తన బలిపీఠం పడగొట్టినప్పుడు తాను పోరాడతాడు కదా” అని చెప్పాడు.

  5. అతని స్నేహితుడు జవాబిస్తూ, “అది ఇశ్రాయేలీయుడైనా యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని ఇంకొకటి కాదు. దేవుడు మిద్యానీయుల దండు అంతటిని అతని చేతులకు అప్పగించారు” అన్నాడు.

  6. యోవాషు కుమారుడైన గిద్యోను యుద్ధం నుండి హెరెసు కనుమ నుండి తిరిగి వచ్చాడు.

  7. యోవాషు కుమారుడు గిద్యోను తన సొంత ఇంట్లో నివసించడానికి తిరిగి వెళ్లిపోయాడు.

  8. యోవాషు కుమారుడైన గిద్యోను మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు, అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్న తన తండ్రి యోవాషు సమాధిలో అతడు పాతిపెట్టబడ్డాడు.