Skip to content

Ammonites గురించి బైబిల్ వచనాలు

135 వచనాలు · 11 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మోయాబుకు ఘనతను తెచ్చే పొలిమేర పట్టణాలైన బేత్-యెషిమోతు బయల్-మెయోను కిర్యతాయిములతో మొదలుపెట్టి సరిహద్దు పట్టణాలన్నిటిని

  2. అమ్మోనీయులతో పాటు తూర్పు ప్రజలకు స్వాస్థ్యంగా అప్పగిస్తాను, అప్పుడు జనాల్లో అమ్మోనీయులు జ్ఞాపకానికి రారు.

  3. మోయాబుకు నేను శిక్ష విధిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”

  4. యెహోవా ఇలా చెప్తున్నారు: “అమ్మోను చేసిన మూడు పాపాల గురించి, అతని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అతడు తన సరిహద్దులను విశాల పరచడానికి, గిలాదులో ఉన్న గర్భిణి స్త్రీల కడుపులను చీల్చాడు.

  5. నేను రబ్బా ప్రాకారాలను తగలబెడతాను, యుద్ధం రోజున యుద్ధ నినాదాల మధ్యలో, తుఫాను రోజున పెనుగాలి వీస్తూ ఉన్నప్పుడు, అగ్ని దాని కోటలను దగ్ధం చేస్తుంది.

  6. దాని రాజు, తన రాజ పరివారంతో పాటు బందీగా వెళ్తాడు” అని యెహోవా చెప్తున్నారు.

  7. “నా ప్రజల ప్రాంతంలోకి ప్రవేశించి వారిని దూషించిన, మోయాబు వారు చేసిన అవమానాల గురించి, అమ్మోనీయుల దూషణల గురించి నేను విన్నాను.

  8. కాబట్టి, నా జీవం తోడు, మోయాబు సొదొమలా, అమ్మోను గొమొర్రాలా అవుతుంది. కలుపు మొక్కలు ఉప్పు గుంటలతో, అవి ఎప్పటికీ బంజరు భూమిగానే ఉంటాయి. నా ప్రజల్లో శేషించినవారు వారిని దోచుకుంటారు; నా దేశంలో బ్రతికినవారు తమ దేశాన్ని స్వతంత్రించుకుంటారు” అని ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

  9. ఈ విధంగా వారు గర్వంతో, సైన్యాల యెహోవా ప్రజలను అవమానించినందుకు, ఎగతాళి చేసినందుకు ప్రతిఫలం పొందుతారు.

  10. ఆయన భూమ్మీద ఉన్న దేవతలందరినీ నాశనం చేసినప్పుడు యెహోవా వారికి భయంకరంగా ఉంటాడు. ద్వీపాల్లో నివసించే జనులంతా తమ స్థలాల నుండి, ఆయనకు నమస్కారం చేస్తారు.